ప్రభుత్వ కార్యాలయాలకు తాళం 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ వల్ల ఖమ్మం జిల్లాలో మునిగిపోయే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. అఖిలపక్ష నాయకుల పిలుపు మేరకు గురువారం ముంపుమండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళంవేసి నిరసన తెలిపారు. తహసిల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీ వో రామచంద్రరావుతోపాటు రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, సిబ్బందిని కార్యాలయం నుంచి బయటకు పంపించారు.
బ్యాంకులు, అటవీశాఖ, రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నా చేశారు. ‘ఆంధ్ర అధికారులూ దయచేసి తెలంగాణకు రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు. సీపీఐ(ఎంఎల్)పాల్వంచ డివిజన్ కమిటీ సభ్యుడు ఎస్‌కే గౌస్ మాట్లాడుతూ తెలంగాణలోని ముంపుమండలాలను కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఆంధ్రాలో కలపడం అన్యాయమన్నారు.
ఏడు మండలాలలోని ఏ ఒక్కరైనా విలీనానికి అంగీకరిస్తే అప్పుడు ఆంధ్రాలో కలపడానికి ఎవరూ అభ్యంతరం చెప్పమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, సీపీఐ(ఎంఎల్)మండల కార్యదర్శి బాసినేని సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు చేకూరి రమణరాజు, సీపీఎం మండల నాయకులు యర్రంశెట్టి నాగేంద్రరావు పాల్గొన్నారు.
ఆర్డినెన్స్‌పై ఆగ్రహం
Published Fri, Jul 4 2014 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement