సాక్షి, కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి రిజర్వాయర్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం నీటిపై యువతి మృతదేహం తేలియాడుతోందని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏసీపీ రవీంద్రకుమార్, సిబ్బంది చేరుకుని బయటకు తీయిం చారు. బూడిద రంగు టాప్, తెలుపు రంగు ప్యాంటు ధరించిన ఆమె కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మల బుట్టలు, ముత్యంతో కూడిన ముక్కు పుల్ల ధరించి ఉందని తెలిపారు. చెప్పులు రిజర్వాయర్ కట్టపై ఉండటంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి వేశారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 94910 89128, 94407 95212, 94407 00506 నంబర్లకు ఫోన్ చేయాలని ఏసీపీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment