Un known dead body
-
రిజర్వాయర్లో యువతి మృతదేహం
సాక్షి, కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి రిజర్వాయర్లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం నీటిపై యువతి మృతదేహం తేలియాడుతోందని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏసీపీ రవీంద్రకుమార్, సిబ్బంది చేరుకుని బయటకు తీయిం చారు. బూడిద రంగు టాప్, తెలుపు రంగు ప్యాంటు ధరించిన ఆమె కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మల బుట్టలు, ముత్యంతో కూడిన ముక్కు పుల్ల ధరించి ఉందని తెలిపారు. చెప్పులు రిజర్వాయర్ కట్టపై ఉండటంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి వేశారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 94910 89128, 94407 95212, 94407 00506 నంబర్లకు ఫోన్ చేయాలని ఏసీపీ కోరారు. -
వ్యక్తి ఆత్మహత్య
నిజామాబాద్ : మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని కనుగొన్నారు. స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వీఆర్వో అశోక్ ఆధ్వర్యంలో శవానికి పంచనామా నిర్వహించి ఆ తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.