వైరల్‌: చిరుతను చంపి ఊరేగించారు | Leopard Entered A Residential Colony Beaten To Death In Assam | Sakshi
Sakshi News home page

వైరల్‌: చిరుతను కొట్టి చంపి ఊరేగించారు

Published Mon, Jun 8 2020 10:39 AM | Last Updated on Mon, Jun 8 2020 3:52 PM

Leopard Entered A Residential Colony Beaten To Death In Assam - Sakshi

గువాహటి: జనవాసాల్లోకి ప్రవేశించిన ఓ చిరుతను దారుణంగా కొట్టి చంపిన ఘటన అసోం రాజధాని గువాహటి శివారు ప్రాంతంలో ఆదివారం జరిగింది. కాలనీల్లోకి చొరబడ్డ చిరుతను స్థానికులు దాన్ని వెంబడించి మూకుమ్మడిగా దాడిచేశారు. తీవ్ర గాయాలతో అది ప్రాణాలు విడిచింది. అనంతరం గ్రామస్తులంతా చిరుత మృతదేహాన్ని ఊరేగించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక చిరుతపై దాడి విషయం తెలుసుకున్నఅటవీశాఖ అధికారులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మిగతావారిని పట్టుకుంటామని చెప్పారు. 

కాగా, ఆదివారం ఉదయం తమ గ్రామంలోకి చిరుత ప్రవేశించిందని.. ఆ విషయం అటవీశాఖ అధికారులు తెలిపామని స్థానికులు చెప్తున్నారు. బోను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశామని వెల్లడించారు. అయితే అది తప్పించుకుందని, దాంతో ఎక్కడ తమపై దాడి చేస్తుందోననే భయంతో ఎదురుదాడికి దిగామని వారు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా స్పందించి చిరుతను బంధించి ఉంటే.. దాని ప్రాణాలు దక్కేవని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
(చదవండి: కరోనా ఎఫెక్ట్‌; వైద్యానికీ ఆధార్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement