months
-
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు. -
ఒకే కుటుంబం.. రెండు నెలల్లో అమరులైన ఇద్దరు జవానులు
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయగా, ఐదుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. వీరంతా ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ఈ ఘటన సైనికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుమారులు అమరులైన కుటుంబం అనుభవిస్తున్న వేదన మాటలకు అందనిది.ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ పరిధిలోగల డాగర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలోని ఇద్దరు కుమారులు రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ప్రాణాలర్పించారు. వీరిలో ఒకరైన ఆదర్శ్ నేగి గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని కథువాలో మరణించగా, మరో కుమారుడు మేజర్ ప్రణయ్ నేగి గత ఏప్రిల్‌లో లేహ్‌లో వీరమరణం పొందారు. కుమారులిద్దరూ అసువులుబాయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.కథువాలో వీరమరణం పొందిన సైనికుడు ఆదర్శ్ నేగి 2018లో గర్వాల్ రైఫిల్స్‌లో చేరాడు. తాజాగా ఆదర్శ్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఒక కుమారుని బలిదానం నుండి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో కుమారుడు మరణించడాన్ని వారు దిగమింగుకోలేకపోతున్నారు. సీఎం పుష్కర ధామి అమరవీరుల కుటుంబాన్ని ఓదార్చారు. -
పూల సాగుతో నాలుగు నెలల్లో రూ. 8 లక్షలు!
ఇటీవలి కాలంలో యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్టార్టప్‌లతో పాటు వ్యవసాయరంగంలోనూ కాలుమోపి, విజయాలు సాధిస్తున్నారు. యూపీలోని లక్నోలో గల మలిహాబాద్ పరిధిలోని ధాక్వా గ్రామానికి చెందిన గౌరవ్ కుమార్ ఇలాంటి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కలిగిన గౌరవ్ కుమార్ గ్లాడియోలస్ పూలు సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లో రూ. ఎనిమిది లక్షలు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. గౌరవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి శివకుమార్ వరి, గోధుమలు పండించి చాలాసార్లు నష్టపోయాడని, ప్రతికూల వాతావరణం కారణంగా పంట పాడైపోయేదని తెలిపాడు. అటువంటి పరిస్థితిలో తాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్‌లో చేరానన్నాడు. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని, పూల సాగుకు తండ్రిని ఒప్పించానని తెలిపాడు. సెప్టెంబరు నుంచి గ్లాడియోలస్ పూల సాగు ప్రారంభమవుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ పూలు విరివిగా లభిస్తాయని తెలిపాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పూల విక్రయం ద్వారా నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గౌరవ్ తెలిపాడు. తాను ప్రస్తుతం డీ ఫార్మా చదువుతున్నానని, వైద్య విద్యతో పాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు. -
ఏడాదికి 12 నెలలే ఎందుకు? 13 నెలలు ఉండాలి బ్రో..?
చరిత్రలో క్యాలెండర్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ రోజు ఉపయోగించే క్యాలెండర్ జూలియస్ సీజర్ లేదా పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించిన క్యాలెండర్ లాంటిది కాదు. ప్రస్తుతం మనం వాడుతున్నది 1582 ADలో పోప్ గ్రెగొరీ-XIII తీసుకొచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది సూర్యుని చుట్టూ భూమి కదలికలపై ఆధారపడి ఉంటుంది (అంటే ఇది సోలార్ క్యాలెండర్). ఇందులో లీపు సంవత్సరాలు కూడా ఉంటాయి. అసలు ఏడాదికి 12 నెలలే ఎందుకు ఉండాలి? 13 నెలలు ఎందుకు ఉండకూడదు? అని ఎప్పుడైనా అనిపించిందా!? సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ ఎపుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. 'మనకు ఏడాదిలో 12 బదులుగా 13 నెలలు ఉంటే, ప్రతి నెల సరిగ్గా 28 రోజులు ఉండాలి. సోమవారం మాత్రం నెల ప్రారంభం కావాలి. అలాగే మంత్ ఎండింగ్ ఎపుడూ ఆదివారంగా ఉండాలి. ప్రతి నెలలో 4.257కి బదులుగా సరిగ్గా 4 వారాలు ఉండాలి' అనే ఇమేజ్ ఒకటి వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 'ప్రతి నెలలో నాలుగు వారాలు, వారానికి ఏడు రోజులు, మొత్తం 28 రోజులు.. సంవత్సరానికి 13 నెలలు.' ఇలా ఏడాదికి 364 రోజులు వేసవి కాలం గుర్తుగా జూన్, జూలై మధ్య "సోల్" అని పిలువబడే కొత్త నెల ఉంటుంది. మిగిలిపోయిన రోజు ప్రత్యేక సంవత్సర దినం, ప్రతి నాలుగు సంవత్సరాలకు రెండు రోజులు ఉంటాయి. 13 నెలల 28 రోజులు ఉండే క్యాలెండర్ ఏది? అంతర్జాతీయ ఫిక్స్డ్.. నెలకు 28రోజుల చొప్పున క్యాలెండర్ సంవత్సరాన్ని 13 నెలలుగా విభజించింది. ఇంటర్నేషనల్ ఫిక్స్డ్ క్యాలెండర్ (IFC, కాట్స్వర్త్ ప్లాన్, కాట్స్వర్త్ క్యాలెండర్, ఈస్ట్‌మన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు) అనేది మోసెస్ బి. కాట్స్వర్త్ రూపొందించిన ప్రతిపాదిత క్యాలెండర్ సంస్కరణ. దీనిని మొదటిసారిగా 1902లో సమర్పించారు. రోజును 24 గంటలుగా ఎందుకు విభజించారు? పురాతన ఈజిప్షియన్లు రోజును 24 గంటలుగా విభజించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 గంటలు పగలుగా, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మరో 12 గంటలు రాత్రిగా విభజించారు. నిమిషాలు, గంటలను 60గా ఎందుకు విభజించారు? 60 సెకన్లతో కూడిన గంటను 60 నిమిషాలుగా విభజించినప్పుడు.. ఇది శేషం లేకుండా భాగించబడుతుంది గనుక, దాని గణిత సౌలభ్యం కోసం 60 సంఖ్యను ఎంపిక చేసి ఉండవచ్చు. సంవత్సరానికి 13 నెలలకు బదులుగా 12 నెలలు ఎందుకు ఉన్నాయి? జూలియస్ సీజర్, ఖగోళ శాస్త్రవేత్తలు రుతువులను దృష్టిలో ఉంచుకుని 12 నెలలో ఒక ఏడాదినీ, నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరాన్ని జోడించారు. సంవత్సరంలో 12 నెలల అవసరాన్ని అలాగే, రుతువులతో సమకాలీకరించడానికి లీపు సంవత్సరాన్ని జోడించడాన్ని వివరించారు. ఎవరెన్ని వాదనలు చేసినా జూలియస్ సీజర్, ఫ్రెంచ్ విప్లవకారులు కనుగొన్నట్లుగా ఖచ్చితమైన క్యాలెండర్‌ను రూపొందించడం అంత సులభం కాదు అనేది విజ్ఞులు తేల్చిన మాట. ఇవన్నీ ఏమోకానీ నెల రోజుల వాలిడిటీ అంటూ 28 రోజులకు కనెక్షన్ కట్ చేసే టెలికాం ప్రొవైడర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని, వినియోగదారులకు రెండు రోజుల డేటా కలిసొస్తుందని యూజర్లు ఫన్నీగా కామెంట్ చేయడం విశేషం. -
అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ..
ఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. నవ్వుతూ ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తన తండ్రి దేనికి తలవంచరని పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రశ్నించకుండా ఉండేందుకే తన తండ్రిపై కేంద్ర ప్రభుత్వం అవినీతి కేసులను మోపిందని ఆరోపించారు. 'ఆయనకు భయం అంటే ఎంటో తెలియదు. దేనికీ భయపడరు. ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. చివరికి తప్పక విజయం సాధిస్తారు' అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. View this post on Instagram A post shared by Tejashwi Yadav (@tejashwipdyadav) పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య కారణాల వల్ల బెయిల్‌పై విడుదలయ్యారు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. ఆయన కుమార్తె ఒక కిడ్నీని దానం చేయగా చికిత్స పూర్తి అయింది. గతేడాది డిసెంబరులో శస్ర్త చికిత్స అనంతరం దిల్లీకి తిరిగి వచ్చారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. -
ఆర్నెల్లలో గోవధ, విక్రయాలు నిషేధించండి..!
సిమ్లాః దేశంలో ఆరు నెలల్లో గోవధ నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆవు, దూడలు, గొడ్డు మాంసం వాటి ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులతోపాటు, విక్రయాలను సైతం నిషేధించాలని పేర్కొంది. ఇచ్చిన వ్యవధిలోపు నిషేధంపై పూర్తిశాతం చర్యలు తీసుకోవాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బీఫ్ బ్యాన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా గోవులు, లేగదూడల అమ్మకాలు, మాంసం ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులపై నిషేధం విధించాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. బీఫ్ బ్యాన్ సమస్య ఆయా రాష్ట్రాల పరిథిలోనికి వస్తుందంటూ గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తిరస్కరించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 అక్టోబర్ 2015 న కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించిన జస్టిస్ రాజీవ్ శర్మ, కస్టిస్ సురేష్ వార్ థాకుర్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి చురకలు వేసింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఇప్పటినుంచీ ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలకు సంబంధించిన ఓ కాపీని జాతీయ లా కమిషన్ కు కూడా పంపించింది. గోవులు ప్రజలకు ఆహారాన్ని, ఔషధాలను, అవస్థాపనను అందించే గోవులను వధించడం దారుణమని... ఆవుల రవాణాను నిలిపివేయాలని, వాటి రక్షణకోసం ప్రత్యేకంగా గోశాలలు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ హిమాచల్ రాష్ట్రానికి చెందిన హిందూమత సంస్థ భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్థన్ పరిషద్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ విధంగా ప్రతిస్పందించింది. మొత్తం 71 పేజీల తీర్పులో ఆర్థిక, మత పరమైన రెండింటిలోనూ ఆవు యొక్క ప్రాముఖ్యతను గుర్తించినట్లు కోర్టు తెలియజేసింది. గోరక్షణలో భాగంగానే హిందువులు సైతం గోవును దైవంగా నమ్ముతారని, పవిత్రంగా భావిస్తారని తెలిపింది. -
'ఆడ్ ఈవెన్' ఎత్తుకు పై ఎత్తు!
నోయిడాః ఢిల్లీలో ప్రవేశ పెట్టిన 'ఆడ్ ఈవెన్ స్కీమ్' ఆటో మేకర్స్ కు కలసి వచ్చింది. నోయిడా ఆర్టీవో లెక్కలను బట్టి చూస్తే సరి బేసి పద్ధతిని ప్రవేశ పెట్టిన జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. వాహనం లేనిదే ప్రయాణం చేయలేని వినియోగదారులు ఆడ్ ఈవెన్ పద్ధతిని అధిగమించేందుకు ఏకంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకూ వెనుకాడటం లేదు. ఢిల్లీలో అమల్లోకి తెచ్చిన సరి బేసి పథకం సమస్య నుంచి బయట పడేందుకు నగరవాసులు కొత్వ వాహనాల కొనుగోళ్ళు చేపడుతున్నారు. నోయిడా వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఢిల్లీ, గుర్గాంవ్ లో ఉద్యోగాలకు, పనులకు వెళ్ళాల్సిన ప్రజలు... అత్యధిక దూరం ప్రయాణించాల్సి రావడంతో సిస్టమ్ ను అధిగమించే మరో మార్గం లేక వాహనాల కొనుగోళ్ళకు సిద్ధపడుతున్నారు. ఒక్క జనవరి నెలలోనే నోయిడాలో 1,887 ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది డిసెంబర్ లోని 1,614 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే సుమారు 17 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లో కొంత శాతం తగ్గినా తిరిగి ఏప్రిల్ లో అత్యధిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం సరి బేసి పథకం అమలు కాని నెలల్లో అత్యధిక కొనుగోళ్ళు జరిగినట్లు తెలుస్తోంది. మొదటి పది రోజుల్లో పెద్దగా రిజిస్ట్రేషన్లు లేకపోయినా ఏప్రిల్ 15 నుంచి 'ఆడ్ ఈవెన్' పద్ధతి అమల్లోకొస్తుందని తెలియడంతో నోయిడా ఆర్టీవో పరిథిలో ఏకంగా 712 కార్లు రిజిస్టర్ అవ్వడం పరిస్థితిని అవగతం చేస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఏప్రిల్ నెలాఖరు నాటికి 2,136 కార్ల వరకూ... అంటే సుమారు 36 శాతం రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరి బేసి పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత డిసెంబర్ లో 3,676 గా ఉన్న ద్విచక్రవాహనాలు సహా ప్రైవేటు వాహనాల కొనుగోళ్ళు జనవరి నాటికి 5,237 కు పెరిగాయని దీన్ని బట్టి 42 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. -
చిచ్చురేపిన కుటుంబ కలహాలు
మహబూబ్‌నగర్ క్రైం : నవ మాసాలు మోసిన ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కాని తన ఆరుగురు పిల్లలకు విషం తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా అందరూ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే... బాలానగర్ మండలం రాజాపూర్‌కు చెం దిన ఖాజాబేగం, ఖాసీం దంపతులు కూలిపని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమార్తెలు పదేళ్ల మైమూ దా, ఎనిమిదేళ్ల అబీదా, ఏడేళ్ల సబా, ఐదేళ్ల షాహీన్, కుమారులు రెండేళ్ల మస్తాన్, 11 నెలల నవాజ్ ఉన్నారు. కొన్ని రోజు లుగా కుటుంబంలో భార్యాభర్తలతోపాటు అత్తమామలకు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం తల్లి తన ఆరుగురు పిల్లలను తీసుకుని భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లోని దర్గాను దర్శించుకునేందుకు వెళ్లింది. వెంట తెచ్చుకున్న ఎలుకల మందును పిల్లలకు తాగించి తానూ తాగింది. పక్కనే పోలీస్‌స్టేషన్ ఉండటంతో కానిస్టేబుల్ గమనించి వెంటనే 108కి సమాచారమిచ్చారు. హుటాహుటిన వాహనంలో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించగానే తల్లి సృహలోకి వచ్చింది. మిగతా పిల్లలకు వైద్య చికిత్సలు అందించారు. వీరిలో మస్తాన్ నవాజ్ పరిస్థితి అందోళనకరంగా ఉందని ైవె ద్యులు తెలిపారు. ఖాజాబేగానికి కల్లు తాగే అలవాటు ఉందని, మద్యం మత్తులో ఈ సంఘటనకు పాల్పడి ఉంటుందని భర్త చెప్పారు. అనంతరం జడ్చర్ల రూరల్ సీఐ గిరిబాబు ఆస్పత్రికి వచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.