చరిత్రలో క్యాలెండర్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ రోజు ఉపయోగించే క్యాలెండర్ జూలియస్ సీజర్ లేదా పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించిన క్యాలెండర్ లాంటిది కాదు. ప్రస్తుతం మనం వాడుతున్నది 1582 ADలో పోప్ గ్రెగొరీ-XIII తీసుకొచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది సూర్యుని చుట్టూ భూమి కదలికలపై ఆధారపడి ఉంటుంది (అంటే ఇది సోలార్ క్యాలెండర్). ఇందులో లీపు సంవత్సరాలు కూడా ఉంటాయి.
అసలు ఏడాదికి 12 నెలలే ఎందుకు ఉండాలి? 13 నెలలు ఎందుకు ఉండకూడదు? అని ఎప్పుడైనా అనిపించిందా!? సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ ఎపుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి.
'మనకు ఏడాదిలో 12 బదులుగా 13 నెలలు ఉంటే, ప్రతి నెల సరిగ్గా 28 రోజులు ఉండాలి. సోమవారం మాత్రం నెల ప్రారంభం కావాలి. అలాగే మంత్ ఎండింగ్ ఎపుడూ ఆదివారంగా ఉండాలి. ప్రతి నెలలో 4.257కి బదులుగా సరిగ్గా 4 వారాలు ఉండాలి' అనే ఇమేజ్ ఒకటి వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 'ప్రతి నెలలో నాలుగు వారాలు, వారానికి ఏడు రోజులు, మొత్తం 28 రోజులు.. సంవత్సరానికి 13 నెలలు.' ఇలా ఏడాదికి 364 రోజులు వేసవి కాలం గుర్తుగా జూన్, జూలై మధ్య "సోల్" అని పిలువబడే కొత్త నెల ఉంటుంది. మిగిలిపోయిన రోజు ప్రత్యేక సంవత్సర దినం, ప్రతి నాలుగు సంవత్సరాలకు రెండు రోజులు ఉంటాయి.
13 నెలల 28 రోజులు ఉండే క్యాలెండర్ ఏది?
అంతర్జాతీయ ఫిక్స్‌డ్.. నెలకు 28రోజుల చొప్పున క్యాలెండర్ సంవత్సరాన్ని 13 నెలలుగా విభజించింది. ఇంటర్నేషనల్ ఫిక్స్‌డ్ క్యాలెండర్ (IFC, కాట్స్‌వర్త్ ప్లాన్, కాట్స్‌వర్త్ క్యాలెండర్, ఈస్ట్‌మన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు) అనేది మోసెస్ బి. కాట్స్‌వర్త్ రూపొందించిన ప్రతిపాదిత క్యాలెండర్ సంస్కరణ. దీనిని మొదటిసారిగా 1902లో సమర్పించారు.
రోజును 24 గంటలుగా ఎందుకు విభజించారు?
పురాతన ఈజిప్షియన్లు రోజును 24 గంటలుగా విభజించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 గంటలు పగలుగా, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మరో 12 గంటలు రాత్రిగా విభజించారు.
నిమిషాలు, గంటలను 60గా ఎందుకు విభజించారు?
60 సెకన్లతో కూడిన గంటను 60 నిమిషాలుగా విభజించినప్పుడు.. ఇది శేషం లేకుండా భాగించబడుతుంది గనుక, దాని గణిత సౌలభ్యం కోసం 60 సంఖ్యను ఎంపిక చేసి ఉండవచ్చు.
సంవత్సరానికి 13 నెలలకు బదులుగా 12 నెలలు ఎందుకు ఉన్నాయి?
జూలియస్ సీజర్, ఖగోళ శాస్త్రవేత్తలు రుతువులను దృష్టిలో ఉంచుకుని 12 నెలలో ఒక ఏడాదినీ, నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరాన్ని జోడించారు. సంవత్సరంలో 12 నెలల అవసరాన్ని అలాగే, రుతువులతో సమకాలీకరించడానికి లీపు సంవత్సరాన్ని జోడించడాన్ని వివరించారు. ఎవరెన్ని వాదనలు చేసినా జూలియస్ సీజర్, ఫ్రెంచ్ విప్లవకారులు కనుగొన్నట్లుగా ఖచ్చితమైన క్యాలెండర్‌ను రూపొందించడం అంత సులభం కాదు అనేది విజ్ఞులు తేల్చిన మాట.
ఇవన్నీ ఏమోకానీ నెల రోజుల వాలిడిటీ అంటూ 28 రోజులకు కనెక్షన్ కట్ చేసే టెలికాం ప్రొవైడర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని, వినియోగదారులకు రెండు రోజుల డేటా కలిసొస్తుందని యూజర్లు ఫన్నీగా కామెంట్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment