calender
-
‘సై’ అంటే ‘సై’... మెగా ఈవెంట్స్‌తో కొత్త ఏడాదికి స్వాగతం
మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లకి ప్రతి రోజూ కొత్త అవకాశమే... అప్పటి వరకు అద్భుతాలు చేసినా, వైఫల్యాలతో అట్టడుగున నిలిచినా మళ్లీ పైకి లేచేందుకు సిద్ధం కావడమే... ఇక కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త టోర్నీలు, సరికొత్త తరహా ఆటతో అత్యుత్తమ ప్రదర్శనకు ‘సై’ అనడమే... ముగిసిన సంవత్సరంలో త్రుటిలో విజయాలు చేజార్చుకున్న క్షణాలు, అనూహ్యంగా ఎదురైన అపజయాలను మరచిపోయేలా అక్కడే, అదే వేదికపై తప్పులు దిద్దుకొని సత్తా చాటేందుకు కొత్త ఏడాది ఇస్తున్న మరో చాన్స్ అనుకొని చెలరేగిపోవడమే... మరోవైపు అభిమానులకు ఏడాదంతా ఆటలతో పండగనే... క్రీడాంశం ఏదైనా, టోర్నీ పేరు ఏదైనా మైదానంలోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడి నుంచైనా తాము ఆశించిన వినోదం కోసం వారు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పోటీలైనా... ప్రతీ ఏటా పలకరించే వార్షిక టోర్నీలైనా... ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ‘జై’ కొట్టేందుకు సిద్ధమైపోతారు... అందుకే క్యాలెండర్లో సంవత్సరం మారగానే కొత్త ఏడాదిలో వచ్చే ఈవెంట్లపై అందరికీ ఎప్పటిలాగే ఆసక్తి ఉంటుంది.2025 అలాంటి కొన్ని ఉత్సాహవంతమైన క్రీడా పోటీలతో సిద్ధమైంది. క్రికెట్ అభిమానుల కోసం వన్డే వరల్డ్‌కప్‌కు సమఉజ్జీలాంటి చాంపియన్స్ ట్రోఫీ ఏడాది ఆరంభంలోనే కనువిందు చేయనుంది. ఈ టోర్నీకి ముందు మలేసియా వేదికగా అండర్–19 మహిళల వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. ఆ తర్వాత మహిళల క్రికెట్లో వన్డే వరల్డ్‌కప్‌నకు మన దేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఆటగాళ్లు అటు ఇటు మారడం మినహా ఎప్పటిలాగే ఐపీఎల్ వేసవిలో అలరించనుంది. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లు, బ్యాడ్మింటన్‌లో బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలు ఏడాదంతా కొత్త చాంపియన్ల కోసం తివాచీ పరచడం ఖాయం కాగా... భారత్ వేదికగానే జూనియర్ హాకీ వరల్డ్ కప్ యువ ఆటగాళ్లను పరిచయం చేయనుంది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్వంటి క్రీడాంశాల్లో విశ్వ వేదికలపై మన ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాదిలో అసాధారణ ప్రదర్శనలతో అలరించిన మన చదరంగం కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఎత్తులు పై ఎత్తులతో కొత్త ఎత్తులకు చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన ఈవెంట్లతో కూడిన క్రీడా క్యాలెండర్ మీ కోసం... –సాక్షి క్రీడా విభాగంక్రికెట్ జనవరి 3–7: ఆ్రస్టేలియాతో ఐదో టెస్టు (సిడ్నీ) భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన జనవరి 22: తొలి టి20 (చెన్నై) జనవరి 25: రెండో టి20 (కోల్‌కతా) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్) జనవరి 31: నాలుగో టి20 (పుణే) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబై) ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్) చాంపియన్స్ ట్రోఫీ (దుబాయ్) ఫిబ్రవరి 20: భారత్ X బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23: భారత్ Xపాకిస్తాన్ మార్చి 2: భారత్ X న్యూజిలాండ్ మార్చి 4: సెమీఫైనల్ (అర్హత సాధిస్తే) మార్చి 9: ఫైనల్ (అర్హత సాధిస్తే) ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన జూన్ 20–24: తొలి టెస్టు (హెడింగ్లే) జూలై 2–6: రెండో టెస్టు (ఎడ్జ్‌బాస్టన్) జూలై 10–14: మూడో టెస్టు (లార్డ్స్) జూలై 23–27: నాలుగో టెస్టు (మాంచెస్టర్) జూలై 31–ఆగస్టు 4: (ఓవల్) బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటన ఆగస్టు: 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో వెస్టిండీస్ పర్యటన అక్టోబర్: 2 టెస్టులు ఆ్రస్టేలియాలో భారత్ పర్యటన నవంబర్: 3 వన్డేలు, 5 టి20లు భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నవంబర్–డిసెంబర్: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఇంగ్లండ్‌లో భారత మహిళల జట్టు పర్యటన జూన్–జూలైలో ఐదు టి20లు, మూడు వన్డేలుమహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు వేదిక: మలేసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు వేదిక: పాకిస్తాన్, దుబాయ్ ఐపీఎల్ టోర్నీ మార్చి 14 నుంచి మే 25 వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ ఆగస్టు–సెప్టెంబర్ వేదిక: భారత్ బ్యాడ్మింటన్ జనవరి 7–12: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 14–19: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) ఫిబ్రవరి 11–16: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (కింగ్డావో, చైనా) మార్చి 11–16: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్ (బరి్మంగ్‌హమ్) ఏప్రిల్ 8–13: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (నింగ్బో, చైనా) ఏప్రిల్ 27–మే 4: సుదిర్మన్ కప్ (జియామెన్, చైనా) మే 27–జూన్ 1: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ (సింగపూర్ సిటీ) జూన్ 3–8: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) జూలై 15–20: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) జూలై 22–27: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) ఆగస్టు 25–31: ప్రపంచ చాంపియన్‌షిప్ (పారిస్) సెప్టెంబర్ 16–21: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) అక్టోబర్ 6–19: ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్ (గువాహటి, భారత్) అక్టోబర్ 14–19: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) అక్టోబర్ 21–26: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) డిసెంబర్ 10–14: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా)ఫార్ములావన్మార్చి 16: ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) మార్చి 23: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 6: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) ఏప్రిల్ 13: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 20: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి (జిద్దా) మే 4: అమెరికా గ్రాండ్‌ప్రి (మయామి) మే 18: ఇటలీ గ్రాండ్‌ప్రి (ఇమోలా) మే 25: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 1: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) జూన్ 15: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 29: ఆ్రస్టియా గ్రాండ్‌ప్రి (స్పీల్బర్గ్) జూలై 6: బ్రిటన్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జూలై 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) ఆగస్టు 3: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 31: డచ్ గ్రాండ్‌ప్రి (జాండ్‌వూర్ట్) సెప్టెంబర్ 7: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబర్ 21: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) అక్టోబర్ 5: సింగపూర్ గ్రాండ్‌ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబర్ 19: యూఎస్ఏ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్) అక్టోబర్ 26: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబర్ 9: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబర్ 22: లాస్‌వేగస్ గ్రాండ్‌ప్రి (అమెరికా) నవంబర్ 30: ఖతర్ గ్రాండ్‌ప్రి (దోహా) డిసెంబర్ 7: అబుదాబి గ్రాండ్‌ప్రి (యూఏఈ)టెన్నిస్ జనవరి 12–26: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 25–జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (పారిస్) జూన్ 30–జూలై 13: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 25–సెప్టెంబర్ 7: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (న్యూయార్క్). మార్చి 5–16: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కాలిఫోర్నియా) మార్చి 19–30: మయామి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్లోరిడా) ఏప్రిల్ 5–13: మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (మొనాకో) ఏప్రిల్ 22–మే 4: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (స్పెయిన్) మే 6–18: రోమ్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఇటలీ) జూలై: టొరంటో ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (కెనడా) ఆగస్టు: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఒహాయో) అక్టోబర్ 1–13: షాంఘై ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (చైనా) అక్టోబర్ 25–నవంబర్ 2: పారిస్ ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 9–16: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) నవంబర్ 18–23: డేవిస్‌కప్ ఫైనల్స్ టోర్నీ (ఇటలీ) ఆర్చరీఫిబ్రవరి 16–23: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ (బ్యాంకాక్) ఏప్రిల్ 8–13: వరల్డ్ కప్ స్టేజ్–1 టోర్నీ (ఫ్లోరిడా, అమెరికా) మే 6–11: వరల్డ్ కప్ స్టేజ్–2 టోర్నీ (షాంఘై, చైనా) జూన్ 3–8: వరల్డ్ కప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, టర్కీ) జూలై 8–13: వరల్డ్ కప్ స్టేజ్–4 టోర్నీ (మాడ్రిడ్, స్పెయిన్) ఆగస్టు 17–24: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (విన్నీపెగ్, కెనడా) సెప్టెంబర్ 5–12: వరల్డ్ చాంపియన్‌షిప్ (గ్వాంగ్జు, దక్షిణ కొరియా)రెజ్లింగ్ మార్చి 25–30: ఆసియా చాంపియన్‌షిప్ (అమ్మాన్, జోర్డాన్) జూన్ 14–23: ఆసియా అండర్–17, అండర్–23 చాంపియన్‌షిప్ (వియత్నాం) జూలై 5–13: ఆసియా అండర్–15, అండర్–20 చాంపియన్‌షిప్ (కిర్గిస్తాన్) జూలై 28–ఆగస్టు 3: వరల్డ్ అండర్–17 చాంపియన్‌షిప్ (ఏథెన్స్, గ్రీస్) ఆగస్టు 18–24: వరల్డ్ అండర్–20 చాంపియన్‌షిప్ (సోఫియా, బల్గేరియా) సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్ (జాగ్రెబ్, క్రొయేషియా) అక్టోబర్ 20–26: ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్ (నోవిసాద్, సెర్బియా)టేబుల్ టెన్నిస్జనవరి 30–ఫిబ్రవరి 9: సింగపూర్ స్మాష్ టోర్నీ మార్చి 11–16: చాంపియన్స్ టోర్నీ (చైనా) ఏప్రిల్ 1–6: చాంపియన్స్ టోర్నీ (కొరియా) ఏప్రిల్ 14–20: పురుషుల, మహిళల వరల్డ్ కప్ (మకావు) జూన్ 26–జూలై 2: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (తాషె్కంట్) జూలై 3–13: యూఎస్ఏ స్మాష్ టోర్నీ ఆగస్టు 7–11: చాంపియన్స్ టోర్నీ (జపాన్) ఆగస్టు 14–24: గ్రాండ్స్మాష్ టోర్నీ సెప్టెంబర్ 9–14: చాంపియన్స్ టోర్నీ (మకావు) సెప్టెంబర్ 25–అక్టోబర్ 5: చైనా స్మాష్ టోర్నీ అక్టోబర్ 11–15: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (భారత్) అక్టోబర్ 28–నవంబర్ 2: చాంపియన్స్ టోర్నీ (ఫ్రాన్స్) నవంబర్ 23–30: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (రొమేనియా) షూటింగ్ఫిబ్రవరి 9–22: ఆసియా రైఫిల్, పిస్టల్ కప్ (బ్యాంకాక్) ఏప్రిల్ 1–11: వరల్డ్ కప్–1 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బ్యూనస్ ఎయిర్స్) ఏప్రిల్ 13–22: వరల్డ్ కప్–2 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (లిమా) మే 3–12: వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీ (సైప్రస్) జూన్ 1–12: ఆసియాకప్ షాట్‌గన్ టోర్నీ (చైనా) జూన్ 8–15: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జర్మనీ) జూలై 4–14: వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీ (ఇటలీ) ఆగస్టు 16–30: ఆసియా చాంపియన్‌షిప్ (కజకిస్తాన్) సెప్టెంబర్ 13–21: వరల్డ్‌కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (చైనా) అక్టోబర్ 8–19: ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌గన్ టోర్నీ (గ్రీస్) నవంబర్ 6–16: వరల్డ్ చాంపియన్‌షిప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (ఈజిప్‌్ట) హాకీ డిసెంబర్ 28–ఫిబ్రవరి 1: పురుషుల హాకీ ఇండియా లీగ్ (భారత్) జనవరి 12–26: మహిళల హాకీ ఇండియా లీగ్ (భారత్) ఫిబ్రవరి 15–జూన్ 29: ప్రొ హాకీ లీగ్ (మహిళలు) ఫిబ్రవరి 15–జూన్ 22: ప్రొ హాకీ లీగ్ (పురుషులు) డిసెంబర్: జూనియర్ పురుషుల వరల్డ్‌కప్ (భారత్)చెస్ ఫిబ్రవరి 17–28: మహిళల గ్రాండ్‌ప్రి మూడో సిరీస్ (మొనాకో) ఫిబ్రవరి 23–మార్చి 8: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (మోంటెనిగ్రో) మార్చి 14–25: మహిళల గ్రాండ్‌ప్రి నాలుగో సిరీస్ (సైప్రస్) ఏప్రిల్ 13–24: మహిళల గ్రాండ్‌ప్రి ఐదో సిరీస్ (భారత్) మే 6–17: మహిళల గ్రాండ్‌ప్రి ఆరో సిరీస్ (ఆ్రస్టియా) జూలై 5–29: మహిళల వరల్డ్‌కప్ టోర్నీ (జార్జియా) అథ్లెటిక్స్ సెప్టెంబర్ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్ (జపాన్)బాక్సింగ్ మార్చి 6–18: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ (బెల్గ్రేడ్) మే–జూన్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ -
జాబ్ కేలండర్‌ను శాసనసభకు సమర్పించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ప్రపంచం మొత్తం ఇంచుమించుగా ఒకే ఏడాదినే ఫాలో అవుతుంది. ఆయా దేశ కాలమాన పరిస్థితుల రీత్యా న్యూ ఇయర్ వేడుకులు వేర్వేరుగా జరగుతాయేమో..! గానీ అన్ని చోట సంవత్సరం ఒకటే ఉంటుంది. ఆయా స్థానిక సంప్రదాయాలు, మతాలు రీత్యా ఉండే ఏడాదులు వేరుగా ఉంటాయి. కానీ అంతర్జాతీయంగా ఫాలో అయ్యే ఇయర్ అనేది ప్రపంచమంతా ఒకటే ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ఇంకా 2016వ సంవత్సరంలోనే ఉంది. ఇదేంటీ..? అనుకోకండి. ఎందుకుంటే..? అక్కడ దాదాపు ఏడేళ్లు వెనుక్కు ఉంటారట. మరీ వేరే దేశాలతో జరిగే కార్యకలాపాల్లో ఎలా..? అనే కదా..!. అందుకు వారేం చేస్తారంటే..ఇధియోపియా ఇంకా 2016వ ఏడాదిలోనే ఉంది. వచ్చే సెప్టంబర్11కి 2017 ఏడాదిలోకి అడుగుపెడుతుందట. దాదాపు ఎనిమిదేళ్ల వ్యత్యాసమా అని ఆశ్చర్యంగా ఉన్నా. ఇది వాస్తవం. ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన ఇధియోపియా దేశం తమ సంప్రదాయ సమయపాలనకు కట్టుబడి ఉంది. ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయితే..అక్కడ మాత్రం ఆర్థోడాక్స్ చర్చి క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ఏడు లేదా ఎనిమిదేళ్లు వెనుక్కు ఉంటుంది. చెప్పాలంటే ఇథియోపియా దేశం తమ సాంప్రదాయిక వ్యవస్థన పట్ల ఉన్న నిబద్ధతను చాటేలా.. తన సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా తాప్రతయపడుతోంది. అందుకోసమే ఇలా ప్రత్యేక క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. అంతేగాదు తాము వలస రాజ్యాన్ని వంటబట్టించుకోలేదని, మాకు స్వంత క్యాలేండర్, స్వంత వర్ణమాల ఉందని సగౌర్వంగా చెబుతున్నారు ఇథియోపియా వాసులు. ఇక ఇధియోఫియా క్యాలెండర్లో ఏకంగా 13 నెలలు ఉంటాయి. వాటిలో 12 నెలల్లో ఒక్కొక్కటి 30 రోజులు ఉండగా చివరినెల ఒక విధమైన సమయపాలను ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెండు క్యాలెండర్లును ఫాలో అవ్వుతారు. అందరూ ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ తోపాటు తమ దేశ క్యాలెండర్‌ని అనుసరిస్తారు. అందువల్ల ఇక్కడ ప్రజలు బర్త్ సర్టిఫికేట్లు రెండు ఉంటాయి. వాటిని ప్రాంతాల వారిగా ఒక తేదీ, అంతర్జాతీయంగా మరో తేదీ ఉంటుంది. ఇది కాస్త గందరగోళానికి గురి చేసే వ్యవహారమే అయినా వాళ్లు మాత్రం అలానే అనుసరించడం విశేషం. ఇథియోపియాలో పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కూడా. అయితే అక్కడ ప్రజలకు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదు. వాళ్లు చాలా సులభంగా రెండు క్యాలెండర్లను అనుసరిస్తారు.(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్ సంగతులు
Leap year 2024: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి 365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి, దాదాపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఒక రోజు వస్తుంది. అలా 366 రోజులు ఉండే సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటాం. అలా 2024 ఏడాదికి 366 రోజులుంటాయి. లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది? ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది అనుకున్నాం కదా! లీప్ సంవత్సరాన్ని నాలుగుతో భాగిస్తే శేషం ఖచ్చితంగా సున్నా వస్తుంది. కానీ 100తో కూడా భాగింపబడితే మాత్రం అది లీప్ సంవత్సరం కాదు. ప్రతీ ఏడాదిలా కాకుండా లీప్ ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి నాలుగేళ్లకొకసారి లీప్ డే ఉంటుందా? ఇంట్రస్టింగ్ లెక్కలు అయితే, ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ డే జోడించడదనీ, క్యాలెండర్‌ను 44 నిమిషాలు పొడిగింపు మాత్రమే ఉంటుందని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా, అంటే వేసవి నవంబర్‌లో వస్తుందని బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ బోధకుడు యూనాస్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్లకొకసారి లీప్ ఇయర్ వస్తుందనీ, 1700, 1800, 1900 సంవత్సరాల్లో లీప్ డే లేదని తెలిపారు. 2000 సంవత్సరంలో ఒక లీప్ డే ఉంది, ఎందుకంటే ఇది 100, 400 రెండింటితో భాగించబడే సంవత్సరం. అలాగే తరువాతి 500 సంవత్సరాలలో 2100, 2200, 2300 , 2500లో కూడా లీప్ డే ఉండదు. మళ్లీ 2028, 2032, 2036లో లీప్ డేస్ ఉంటాయి. లీప్ డే ఆలోచన కాలక్రమేణా క్యాలెండర్ మార్పు అభివృద్ధి చెందిందని నిపుణులు అంటున్నారు. లీప్ డే కలపపోతే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు, అంటే 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక నాలుగేళ్ల పాటు నాలుగు పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఫిబ్రవరిలో నెలలో పెట్టారు. ఈ లీప్ డే లేకపోతే, రైతులు సరైన సీజన్లో నాటడానికి ఇబ్బంది పడవచ్చంటారు ఖాన్. అంతేకాదు క్రిస్మస్ వేసవిలో వస్తుంది. అప్పుడు స్నో ఉండదూ.. క్రిస్మస్ ఫీలింగూ ఉండదు అంటారాయన. నాసా ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం 365 రోజుల కంటే దాదాపు ఆరు గంటలు ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకొకసారి ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులొస్తాయని నాసా చెబుతోంది. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు. ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అయనాంతం వంటి వార్షిక సంఘటనలకు నెలలు కనెక్ట్ అయ్యేలా చూసుకోవడానికి ఈ అదనపు రోజు ఉపయోగిస్తారని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. -
ఏడాదికి 12 నెలలే ఎందుకు? 13 నెలలు ఉండాలి బ్రో..?
చరిత్రలో క్యాలెండర్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ రోజు ఉపయోగించే క్యాలెండర్ జూలియస్ సీజర్ లేదా పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించిన క్యాలెండర్ లాంటిది కాదు. ప్రస్తుతం మనం వాడుతున్నది 1582 ADలో పోప్ గ్రెగొరీ-XIII తీసుకొచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది సూర్యుని చుట్టూ భూమి కదలికలపై ఆధారపడి ఉంటుంది (అంటే ఇది సోలార్ క్యాలెండర్). ఇందులో లీపు సంవత్సరాలు కూడా ఉంటాయి. అసలు ఏడాదికి 12 నెలలే ఎందుకు ఉండాలి? 13 నెలలు ఎందుకు ఉండకూడదు? అని ఎప్పుడైనా అనిపించిందా!? సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ ఎపుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. 'మనకు ఏడాదిలో 12 బదులుగా 13 నెలలు ఉంటే, ప్రతి నెల సరిగ్గా 28 రోజులు ఉండాలి. సోమవారం మాత్రం నెల ప్రారంభం కావాలి. అలాగే మంత్ ఎండింగ్ ఎపుడూ ఆదివారంగా ఉండాలి. ప్రతి నెలలో 4.257కి బదులుగా సరిగ్గా 4 వారాలు ఉండాలి' అనే ఇమేజ్ ఒకటి వైరల్‌గా మారింది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 'ప్రతి నెలలో నాలుగు వారాలు, వారానికి ఏడు రోజులు, మొత్తం 28 రోజులు.. సంవత్సరానికి 13 నెలలు.' ఇలా ఏడాదికి 364 రోజులు వేసవి కాలం గుర్తుగా జూన్, జూలై మధ్య "సోల్" అని పిలువబడే కొత్త నెల ఉంటుంది. మిగిలిపోయిన రోజు ప్రత్యేక సంవత్సర దినం, ప్రతి నాలుగు సంవత్సరాలకు రెండు రోజులు ఉంటాయి. 13 నెలల 28 రోజులు ఉండే క్యాలెండర్ ఏది? అంతర్జాతీయ ఫిక్స్డ్.. నెలకు 28రోజుల చొప్పున క్యాలెండర్ సంవత్సరాన్ని 13 నెలలుగా విభజించింది. ఇంటర్నేషనల్ ఫిక్స్డ్ క్యాలెండర్ (IFC, కాట్స్వర్త్ ప్లాన్, కాట్స్వర్త్ క్యాలెండర్, ఈస్ట్‌మన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు) అనేది మోసెస్ బి. కాట్స్వర్త్ రూపొందించిన ప్రతిపాదిత క్యాలెండర్ సంస్కరణ. దీనిని మొదటిసారిగా 1902లో సమర్పించారు. రోజును 24 గంటలుగా ఎందుకు విభజించారు? పురాతన ఈజిప్షియన్లు రోజును 24 గంటలుగా విభజించారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 గంటలు పగలుగా, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మరో 12 గంటలు రాత్రిగా విభజించారు. నిమిషాలు, గంటలను 60గా ఎందుకు విభజించారు? 60 సెకన్లతో కూడిన గంటను 60 నిమిషాలుగా విభజించినప్పుడు.. ఇది శేషం లేకుండా భాగించబడుతుంది గనుక, దాని గణిత సౌలభ్యం కోసం 60 సంఖ్యను ఎంపిక చేసి ఉండవచ్చు. సంవత్సరానికి 13 నెలలకు బదులుగా 12 నెలలు ఎందుకు ఉన్నాయి? జూలియస్ సీజర్, ఖగోళ శాస్త్రవేత్తలు రుతువులను దృష్టిలో ఉంచుకుని 12 నెలలో ఒక ఏడాదినీ, నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరాన్ని జోడించారు. సంవత్సరంలో 12 నెలల అవసరాన్ని అలాగే, రుతువులతో సమకాలీకరించడానికి లీపు సంవత్సరాన్ని జోడించడాన్ని వివరించారు. ఎవరెన్ని వాదనలు చేసినా జూలియస్ సీజర్, ఫ్రెంచ్ విప్లవకారులు కనుగొన్నట్లుగా ఖచ్చితమైన క్యాలెండర్‌ను రూపొందించడం అంత సులభం కాదు అనేది విజ్ఞులు తేల్చిన మాట. ఇవన్నీ ఏమోకానీ నెల రోజుల వాలిడిటీ అంటూ 28 రోజులకు కనెక్షన్ కట్ చేసే టెలికాం ప్రొవైడర్ల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని, వినియోగదారులకు రెండు రోజుల డేటా కలిసొస్తుందని యూజర్లు ఫన్నీగా కామెంట్ చేయడం విశేషం. -
జనాభా ప్రాతిపదికన అవకాశాలివ్వాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గురువారం బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గడిచిన 75 ఏళ్లలో ఏ రంగంలోనూ బీసీలకు కనీస వాటా కూడా లభించలేదని విమర్శించారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇచ్చారని, రాజకీయ రంగంలో బీసీలకు 50 శాతం వాటాను అన్ని స్థాయిల్లో కల్పించారన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని కోరారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్, బీసీ వి ద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్‌పై సీఎం జగన్ రివ్యూ
-
AP: నిరుద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. బ్యాక్‌లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్ మెంట్‌ను సమగ్రంగా సీఎం జగన్ సమీక్షించారు. 2021–22లో 39,654ల పోస్టుల భర్తీ: – 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా వెల్లడించిన అధికారులు. – ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ. – గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. – 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉంది. – భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయి. రిక్రూట్ మెంట్‌పై సీఎం ఆదేశాలు.. – 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేశాము. – వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చాము. – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నాము. – ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదు. భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు అని సీఎం జగన్ తెలిపారు. ఉన్నతవిద్యలో టీచింగ్ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్ద పీటవేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రెగ్యులర్ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలి. దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్పై యాక్షన్ ప్లాన్.. పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో సీఎంకు నివేదించాలన్న చెప్పారు. కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్త, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు మరియు హెచ్ఆర్ఎం) హెచ్ అరుణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’ -
మనం 2022లో ఉంటే.. ఇథియోపియా ఇంకా 2014లోనే!
ఇవాళ తేదీ 14–05–2022.. ఇది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పేదేముంది అంటారా! అవును.. ఇది మనకైతే కరెక్టే. కానీ ఇథియోపియాలో మాత్రం కాదు. ఈ రోజు వాళ్ల తేదీ ఏమిటో తెలుసా.. 6–9–2014. ఇదేదో చిత్రంగా ఉందనిపిస్తోందా? ఈ వివరాలేమిటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వలస పాలన ప్రభావం తప్పించుకుని.. 16, 17, 18వ శతాబ్దాల్లో యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వలస పాలన నెలకొల్పడమే.. గ్రెగోరియన్ కేలండర్ విస్తృతికి ముఖ్య కారణం. అయితే ఇథియోపియా ఎన్నడూ వలస పాలనప్రభావానికి లోనుకాలేదు. 1935లో ముస్సోలినీ ఆధ్వర్యంలోని ఇటలీ నియంతృత్వ ప్రభుత్వం ఇథియోపియాను ఆక్రమించినా అది1941లోనే ముగియడంతో.. ప్రభావంపడలేదు.ఇథియోపియన్లు తమ సొంత కేలండర్, సమయం వంటివి కొనసాగించుకున్నారు. సొంత కేలండర్‌తో.. ప్రస్తుతం మన దేశంతోపాటు ప్రపంచమంతా వినియోగిస్తున్న తేదీ, సమయం విధానాన్ని గ్రెగోరియన్ కేలండర్ అంటారు. సుమారు రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ఇదే అధికారిక కేలండర్‌గా కొనసాగుతోంది. కానీ ఇథియోపియా మాత్రం తమ దేశంలో భిన్నమైన సొంత కేలండర్‌ను వినియోగిస్తోంది. ఇది ప్రపంచదేశాల కంటే సుమారు ఏడున్నరేళ్లు వెనుక కొనసాగుతుంది. వారికి 13 నెలలు.. మనకు ఏడాదిలో 12 నెలలుంటే.. ఇథియోపియాలో 13 నెలలు ఉంటా యి. 12 నెలలపాటు ప్రతినెలా 30 రోజులు ఉంటాయి. 13వ నెల మాత్రం మామూలు సంవత్సరాల్లో ఐదు రోజులు, లీప్ సంవత్సరంలో ఆరు రోజులు ఉంటుంది. ఈ నెలను పగ్యూమ్గా పిలుస్తారు. పగ్యూమ్ అనే పేరు గ్రీక్ భాషలోని ‘ఎపగోమీన్’ నుంచి వచ్చిందని చెప్తారు.. ‘ఏడాదిలో సమయాన్ని లెక్కిస్తూ మరిచిపోయిన రోజులివి’ అని ఈ పదానికి అర్థమట. ఉదయం ఆరు తర్వాతే రోజు మొదలు.. ఇథియోపియాలో సమయాన్ని లెక్కించే విధానమూ భిన్నమే. మన కేలండర్లో అర్ధరాత్రి 12 తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ వారికి ఉదయం ఆరు గంటలకు మరుసటి రోజు మొదలవు తుంది. ూ ఉదాహరణకు మనం శనివారం పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. ఆ రోజంతా శనివారమే ఉంటుంది. ఇథియోపియాలో పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. అప్పటికి ఇంకా శుక్రవారమే. ఇంకో అరగంట గడిచి ఆరు దాటితేనే శనివారం మొదలైనట్టు. బైబిల్ ఆధారం.. ఆలోచనల సముద్రం! ఇథియోపియన్లు బైబిల్ ఆధారంగా తమ కేలండర్‌ను రూపొందించుకున్నారు. దీనిని వారు ‘సీ ఆఫ్ థాట్స్ (ఆలోచనల సముద్రం)’గా చెప్పుకొంటారు. దేవుడి తొలి సృష్టి అయిన ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరూ ఏడేళ్లపాటు గార్డెన్ ఆఫ్ ఈడెన్‌లో నివసించారని.. తర్వాత వారి పాపాల ఫలితంగా బయటికి పంపేయబడ్డారని.. వారు పశ్చాత్తాపడటంతో 5,500 ఏళ్ల తర్వాత వారిని రక్షిస్తానని దేవుడు మాటిచ్చాడని బైబిల్ లోని వాక్యాలను గుర్తుచేస్తారు. ఈడెన్ గార్డెన్లో ఆడమ్అండ్ ఈవ్ గడిపిన ఏడేళ్లను తమ కేలండర్ నుంచి తొలగించారని చెప్తారు. ప్రపంచమంతా జీసస్ పుట్టినది క్రీస్తుశకం 1వ సంవత్సరంలోనని గుర్తిస్తే.. ఇథియోపియన్లు మాత్రం అంతకు ఏడేళ్ల ముందు క్రీస్తుపూర్వం 7వసంవత్సరంలో జీసస్ జన్మించాడని నమ్ముతారు. ఇథియోపియా కేలండర్లో వారంలో మొదటిరోజును ‘ఎహుద్’గా పిలుస్తారు. బైబిల్ ప్రకారం దేవుడు భూమిని, స్వర్గాన్ని సృష్టించడం మొదలుపెట్టిన రోజు అని దీని అర్థం. ప్రపంచమంతా జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకొంటే.. ఇథియోపియన్లు సెప్టెంబర్ 11న (లీప్ సంవత్సరమైతే 12వ తేదీన) సంబరాలు చేసుకుంటారు. వారి వార్షిక కేలండర్ ఆ రోజు నుంచే మొదలవుతుంది. లీప్ సంవత్సరం వచ్చే ప్రతి నాలుగు ఏళ్లను బైబిల్ ఎవాంజలిస్టులు అయిన నలుగురి పేర్లతో పిలుస్తారు. మొదటి ఏడాదిని జాన్ ఇయర్‌గా, రెండో ఏడాదిని మ్యాథ్యూ ఇయర్, మూడో ఏడాదిని మార్క్ ఇయర్, నాలుగో ఏడాదిని ల్యూక్ ఇయర్‌గా వ్యవహరిస్తారు. ఈసారి వారి 2015 నూతన సంవత్సర వేడుకలు ‘2022 సెప్టెంబర్ 11’న జరగనున్నాయి. -
ఇది పేదవర్గాలకు వెల్ఫేర్.. చంద్రబాబుకి ఫేర్వెల్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్ కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సెషన్ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారాయన. ఈ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను స్వయంగా చదివి వినిపించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ఇది పేద వర్గాలకు వెల్ఫేర్ క్యాలెండర్ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ఏమాత్రం రుచించని క్యాలెండర్ అని, ఒకరకంగా గుబులు పుట్టించే క్యాలెండర్ అని వైఎస్ జగన్ చమత్కరించారు. పైగా ఇది చంద్రబాబుకు ఫేర్వెల్ క్యాలెండర్ అవుతుందని చెప్పారు సీఎం వైఎస్ జగన్. కరోనా లాంటి సమయంలోనూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎక్కడా ఆగలేదని గుర్తు చేశారు సీఎం జగన్. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్లే అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారాయన. పైగా లబ్ధిదారులు ప్లాన్ చేసుకునేందుకు వీలుగానే కాకుండా.. పారదర్శకంగా, అవినీతి, వివక్షకు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్ వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ.. భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం వైఎస్జగన్ అన్నారు. మంచి బడ్జెట్.. దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెబుతూ ప్రసంగం ముగించారు. అనంతరం జనరంజకమైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించిన స్పీకర్.. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2022-2023 మార్చి సంక్షేమ పథకాల క్యాలెండర్ ► 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు ► మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా ► జూన్‌లో అమ్మ ఒడి పథకం ► జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు. ► ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెన్టివ్, నేతన్న నేస్తం. ► సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత ► అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా ► నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు ► డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు ►2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు ► ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు ► మార్చిలో వసతి దీవెన అమలు -
22/02/2022: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..
సాక్షి, అనంతపురం: క్యాలెండర్లో 365 రోజులున్నా కొన్ని అరుదైన రోజులు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి అరుదైన రోజు మంగళవారం రానే వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ రోజు తేదీ 22. 2వ నెల. 22వ సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.2.22ని సూచిస్తుంది. వికటకవిలా ఎటు నుంచి చూసినా ఒక్కటిగానే కనిపిస్తోంది కదూ! అందుకే ఈ రోజు ప్రత్యేక జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ తేదీకి సంబంధించిన ఫొటోలు, సినిమా పాటలు.. నెట్టింట వైరల్ అవుతుండడం గమనార్హం. -
Andhra Pradesh: 'ఉద్యోగ' పండగ
అప్పటి కేంద్ర ప్రభుత్వంలో గత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రెండు మంత్రి పదవులు అనుభవించారు. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడటం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి, లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి, ఈ రోజు మనం పదేపదే అడగడం తప్ప చేయగలిగింది ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాం. దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారతాయని సంపూర్ణంగా నమ్ముతున్నాను. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దళారులు, పైరవీలు, రికమండేషన్లకు తావు లేకుండా కేవలం రాత పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలోని 9 నెలల్లో 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. చదువుకుంటున్న తమ్ముళ్లు, చెల్లెళ్ల కోసం జాబ్ క్యాలెండర్‌ను తీసుకువచ్చామని, ఏ నోటిఫికేషన్ ఏ సమయంలో వస్తుందో ఈ క్యాలెండర్ ద్వారా స్పష్టంగా చెపుతున్నామన్నారు. ఇంటర్వ్యూల విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నామని తెలిపారు. కేవలం ఈ రెండేళ్లలో ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు.. 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని స్పష్టం చేశారు. చాలీచాలని జీతాలతో ఉన్న 7,02,656 మంది ఉద్యోగులకు జీతాలు పెంచగలిగామని చెప్పారు. శుక్రవారం ఆయన వచ్చే ఏడాది మార్చి వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలతో కూడిన 2021–22 జాబ్ క్యాలెండర్‌ను తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, అదిగో ఇదిగో వస్తుందని మీడియాకు లీకులు ఇచ్చేవారని, కళ్లు కాయలు కాచే పరిస్థితిని మనం చూశామన్నారు. ‘నిరుద్యోగులు జిల్లా కేంద్రాలు, సిటీలకు వెళ్లి.. నెలల తరబడి ఇల్లు అద్దెకు తీసుకుని కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితిలో ఒక్కోసారి పిల్లలు మనోధైర్యం కోల్పోయే పరిస్థితి ఎదురవుతూ ఉండేది. ఈ పరిస్థితులను మారుస్తూ, వచ్చే తొమ్మిది నెలల కాలంలో అంటే జూలై నుంచి మార్చి 2022 వరకు ఏఏ ఉద్యోగాలు, వాటికి ఏ నెలలో మనందరి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతోందనే దానిపై జాబ్ క్యాలెండర్‌ను ఈ రోజు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వం వదిలేసిన బ్యాక్లాగ్ పోస్టులతో సహా రానున్న 9 నెలల్లో ఏఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామో ఈ రోజు (శుక్రవారం) అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆప్కాస్ ద్వారా దళారీ వ్యవస్థకు చెక్ ►అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో గతంలో రూ.12 వేలు ప్రభుత్వం ఇస్తే.. అది ఉద్యోగికి చేరే సరికి ఏడు, ఎనిమిది వేల రూపాయలకు పడిపోయేది. మధ్యలో దళారీలు.. లంచాలు.. కటింగ్‌లు.. పలు విధాలా నష్టపోయేవారు. ఇవాళ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి నెలా ఒకటవ తేదీన నేరుగా వారికే జీతాలు ఇస్తున్నాం. ►అన్ని ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఉద్యోగాల నియామకాల కోసం ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్)ను ఏర్పాటు చేసి, దాని ద్వారా దాదాపు 95 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఇచ్చే జీతాలకన్నా, ఈ రోజు చాలా మెరుగైన జీతాలు ఇచ్చేలా చేయగలిగామని సగర్వంగా తెలియచేస్తున్నాను. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత ►దశాబ్ధాల కాలంగా ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, మా బతుకులు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ.. ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతున్నా, చిరునవ్వుతో స్వీకరించాం. ►ఇచ్చిన మాట ప్రకారం 51,387 మంది ఆర్టీíసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి, వారికి ఉద్యోగ భద్రతను ఇవ్వగలిగాం. వీరి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచామని సగర్వంగా తెలియచేస్తున్నాను. ప్రతికూలతలోనూ ఆగని వాగ్దానాలు ►ఈ రోజు మనం కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ తగ్గింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఎక్కడా కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. ►నవరత్నాల అమలు, బడుల నిర్మాణం ఆగలేదు. రైతులు, అక్కచెల్లెమ్మలకు, చదువుకునే పిల్లలకు, అవ్వాతాతలకు, ప్రతి సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తూ దేవుడి దయతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం సాగుతూనే ఉంది. గ్రామాల ముఖచిత్రం మారుతోంది ►ఇదివరకు ప్రైవేటు ఉద్యోగాల కోసం రాజధాని హైదరాబాద్‌కు పరిగెత్తుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితులు మారుతున్నాయి. మన గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు వికేంద్రీకరణతో జాబ్ మార్కెట్ కూడా విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది. ►గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావçస్థలో ఉన్న బడులన్నీ నాడు–నేడుతో పూర్తిగా రూపం మార్చుకుని, ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేస్తున్నాయి. మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇక్కడే కనిపిస్తోందనే సంకేతాలు ఇస్తున్నాయి. ►మన కళ్ల ముందే విలేజ్ క్లినిక్‌లు కొద్ది రోజుల్లో పూర్తవ్వబోతున్నాయి. మన గ్రామంలోనే విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు అడుగడుగునా చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థతో ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలోనే గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు తీసుకువస్తున్నాం. ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, అసైన్డ్ ఎక్విప్మెంట్లు, డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. మన పిల్లలకు మన గ్రామాల్లోనే ఉద్యోగాలు ►మనం ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎనిమిది చోట్ల నిర్మించే హార్బర్లు, 16 కొత్త మెడికల్ కాలేజీలు.. ఆసరా, చేయూత పథకాలను లింక్ చేస్తూ అమూల్, రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, ఐటీసీ వంటి సంస్థల ద్వారా ఎంతో మందిని ఉపాధి, ఉద్యోగాల విప్లవానికి చేరువ చేస్తున్నాం. ఇందుకు గ్రామ స్థాయిలోనే నాంది పలికామని సగర్వంగా తెలియచేస్తున్నాను. ►పిల్లలను చదివించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేలా విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేషన్ చేసేలా గట్టి సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. ►కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 4 నెలల్లోనే 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ►అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే గ్రామ సచివాలయాలు వెలిశాయి. ఈ నాలుగు నెలల్లోపే దేశంలో ఎక్కడా, ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా ఏకంగా 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సగర్వంగా తెలియచేస్తున్నాను. ►దీంతో పాటు నిరుద్యోగ యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ, సామాజిక సేవతో సమాజానికి ఉపయోగపడేలా వలంటీర్లుగా అవకాశం కల్పించాం. వారికి గౌరవ వేతనం ఇస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. దాదాపు 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములును చేయగలిగాం. ►ఈ రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాం. ఇందులో 1,84,264 శాశ్వత ఉద్యోగాలు, 3,99,791 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, 19,701 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాం. చాలీచాలని జీతాలతో బతుకు బండి ఈడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూర్చేలా, వారందరి వేతనాలను పెంచాం. ►కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ తెచ్చి వారి జీతాలు కూడా పెంచాం. ►గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఆ ఉద్యోగస్తులందరూ కూడా ఎలా బతికారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నా. ఈ రోజు ప్రకటనలో వారి జీతాల్లో అప్పటికి, ఇప్పటికీ తేడాను స్పష్టంగా వివరించాం. హోదాను తాకట్టు పెట్టి మోసం చేశారు ►విభజన సమయంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మేం భర్తీ చేస్తామని, వారి మేనిఫెస్టోలో పెట్టి, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మేనిఫేస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ►చివరికి ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేటు రంగంలో అయినా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న పరిస్థితిని పూర్తిగా తాకట్టు పెట్టారు. లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్ల కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. ►గత ప్రభుత్వంలో ఆరోజు అన్న మాటలు కూడా అందరికీ తెలుసు. ఏరకంగా మాటలతో మోసం చేశారో, భ్రమలు కల్పించారో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఫలానా వ్యక్తి వస్తే జాబు వస్తుందని గొప్పగా చెప్పారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఆ తరువాత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఎన్నికలకు మూడు నెలలకు ముందు మాత్రం ఒక డ్రామా చేశారు. -
ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశాం. ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. మినిమమ్ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాం. 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి. రైతులకు అండగా గ్రామాల్లో ఆర్బీకేలు నిలిచాయి. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలను రాబోతున్నాయి. గ్రామాల అభివృద్ధి ఉద్యోగ విప్లవానికి నాంది పలుకుతుంది’’ అని అన్నారు. చదవండి : నాణ్యమైన విద్యే లక్ష్యం: సీఎం వైఎస్ జగన్ తెలంగాణలోనూ నాడు-నేడు -
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం
సాక్షి, అమరావతి: అమరావతి : దేశంలో ఎక్కడా, ఎవరూ చేపట్టని రీతిలో గత రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాజాగా 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం (నేడు) ఆయన విడుదల చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న సీఎం.. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నారు. 2021–22లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అత్యంత పారదర్శకంగా భర్తీకి ఏర్పాట్లు ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు. పోస్టుల భర్తీలో కొత్త చరిత్ర దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 6,03,756 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264, కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. కేవలం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇన్ని పోస్టులు భర్తీ చేయించిన ఘనత వైఎస్ జగన్‌దే. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. -
ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
2019–పండగల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు–2018లో మంగళవారం 2019 ఏడాదికి సంబంధించి పండగ తేదీలను వేదపండితులు ఖరారు చేశారు. ఈ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చైత్రమాసం ఏప్రిల్ 6న ఉగాది, 13న స్మార్తానాం శ్రీరామనవమి, 14న శ్రీవైష్ణవానాం శ్రీరామనవమి, 17న మహావీర జయంతి, 19న శ్రీ హనుమద్విజయోత్సవం, వైశాఖ మాసం మే నెలలో 7న అక్షతదియ, పరశురామ జయంతి, బసవజయంతి, 17న సర్వేషాం నృసింహజయంతి, 29న శ్రీహనుమజ్జయంతి, జ్యేష్ఠమాసం జూన్ 17న వట సావిత్రీవ్రతం, ఆషాఢ మాసం జులై 4న జగన్నాథ రథయాత్ర, 16న వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ, 21న సికింద్రాబాద్ మహంకాళి జాతర, శ్రావణమాసం ఆగస్టు 4న నాగుల చవితి, 5న నాగ, గరుడ పంచమిలు, 9న వరలక్ష్మీవ్రతం, 14న హయగ్రీవజయంతి, 15న రాఖీ పూర్ణిమ, 23న స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 24 శ్రీవైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, శ్రీవేంకటేశ్వరవ్రతం, భాద్రపద మాసం సెప్టెంబర్ 1న బలరామ జయంతి, 14న మహాలయపక్షారంభం, 28న మహాలయ అమావాస్య, 29న శ్రీ దేవీ శరన్నవరాత్రారంభం, ఆశ్వీజమాసం అక్టోబర్ 5న సరస్వతీ పూజ, గరుడ జయంతి, 6న దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, 8న విజయదశమి, 27న దీపావళి, నరకచతుర్దశి, 31న నాగుల చవితి, కార్తీక మాసం నవంబర్ 12న కార్తీక పూర్ణిమ, మార్గశిరమాసం డిసెంబర్ 2న శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి, 8న గీతాజయంతి, 11న శ్రీదత్త జయంతి, 19న కాలభైరవాష్టమి. జ్యోతిష విజ్ఞానాన్ని అందించడం మా బాధ్యత ధర్మాచరణే లక్ష్యంగా లభించిన జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తమపై ఉందని విద్వత్సభ కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ అన్నారు. ‘పండగల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా చూడాలి. అదే విధంగా జ్యోతిష పండితులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రథమ జ్యోతిష మహాసభలు నిర్వహించామ’న్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుచేయాలి... 31 జిల్లాల నుంచి వచ్చిన పండితులందరూ ఏకాభిప్రాయంగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ధార్మిక మండలి కూడా ఉండాలని కోరారు. గౌరవ వేతనంతో ప్రతి ముఖ్యమైన ఆలయానికి ఆగమ శాస్త్ర సలహాదారుణ్ణి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అదే విధంగా ఆలయ అర్చకుడు ఏం చేయాలి? ఏ నియమాల ఆధారంగా పూజలు నిర్వహించాలి? అర్చకులు, పురోహితులు, వేదపండితులు, ధార్మికవేత్తల విధివిధానాలు ఏంటీ? అనే అంశాలపై అవగాహనకు వర్గల్ సరస్వతి క్షేత్రంలో డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టనున్నాం. కరదీపిక తయారీ... భవిష్యత్ తరాలకు పూజలు ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలనే దానిపై అవగాహన కల్పించేందుకు కరదీపికను సత్వరమే ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. యువతలో ధార్మిక చింతన కల్గించేందుకు చర్యలు తీసుకోనున్నాం. -
ఆంగ్ల శుభాకాంక్షలు
ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఇంగ్లిష్ కాలసూచినే అనుసరిస్తున్నాడు. ఏటా మకర సంక్రమణం ఆ తేదీనాడే చేస్తున్నాడు. ఆంగ్లంలో అధిక మాసాల బెడద లేదు. రెండురోజుల్లో 2018 నూతన సంవత్సరం వస్తోంది. ఇక మనం నిత్యం పద్దెనిమిదిని స్మరిస్తూనే ఉంటాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పుకుంటున్నా. ఏటా ఒకసారి మాత్రమే వచ్చే పండుగ. కావలసినంత వినోదం, ఉల్లాసం, ఉత్సాహం, చిందులేసే సంబరాల సందర్భం. ప్రపంచమంతా ఒక్కసారి జాగృతమవుతుంది. డిసెంబర్ 31 అర్థరాత్రి కోసం జగమంతా జాగారం చేస్తుంది. పాత సంవత్సరపు చివరి సెకను దాటగానే అరుపులు, కేకలు, చప్పట్లు, అభినందనలు నురుగలు కక్కుతాయ్! కొత్త సంవత్సరపు నిర్ణయాలు తీసుకోవడం, మిత్రులు తీర్మానాలు చేయడం ప్రతి గదిలో జరుగుతాయ్. కొన్ని అమలవుతాయి, చాలాకొన్ని అమలు అవవ్ – ప్రభుత్వ పథకాల్లాగే. దానివల్ల ఏమీ ప్రమాదం ఉండదు. భూమిపై భూమధ్య రేఖకు ఎగువన దిగువన ఈ ఒక్కరాత్రి కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుంది. చాలా ప్రభుత్వ ప్రైవేట్ నిబంధనల అమలుకి డిసెంబర్ 31ని డెడ్‌లైన్‌గా నిర్ణయిస్తారు. చాలాసార్లు చూశాను చివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని. ఏమీ జరగలేదుగానీ 16 వెనక్కి తగ్గి 2017 ముందుకు వచ్చింది. నూతన సహస్రాబ్ది ఆవిర్భావ ఘడియలోనే ఏమీ సడీచప్పుడూ లేదు. కానీ సహస్రాబ్ది రెండువేలుగా మారడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వై2కె పుణ్యమా అని ఎందరికో ఉపాధి దొరికింది. అది మరి ఆంగ్ల క్యాలెండర్ పెట్టిన భిక్షేకదా! ఉన్నట్టుండి ఆంగ్ల సంవత్సరాది మీద కొందరు కన్నెర్ర చేస్తున్నారు. నాకు గ్రీటింగ్స్ చెబితే చెప్పిన వారితో గుంజీలు తీయించి శిక్ష వేస్తానని చిలుకూరు అర్చకస్వామి శ్రీముఖం ఇచ్చారు. హైందవాలయాలలో ప్రత్యేక పూజలు వద్దన్నారు. జనవరి 1న దేవుడి ముఖం చూడాలని లక్షలాది మంది పడిగాపులు పడతారు. మన పురాణాలు ఏమి చెప్పాయో పెద్దలు గుర్తు చేసుకోవాలి. ప్రహ్లాదుడు తింటూ, తాగుతూ ఎప్పుడైనా భగవన్నామ స్మరణ చేసుకోమన్నాడు. మనమంతా ఈ ఆంగ్ల క్యాలెండర్లో క్రీస్తుశకంలో పుట్టి పెరిగాం. పొద్దుటే రేడియో పెడితే శాలివాహన శకం వినిపిస్తుంది. ఇప్పుడైతే శుభలేఖల మీద తెలుగు తిథివారాలని మాత్రమే ప్రస్తావిద్దామా? మనం చాంద్రమానులం, మన పక్కనే సౌరమానులున్నారు. తెలుగు యువకుడు తమిళమ్మాయిని పెళ్లాడేటప్పుడు ఏ మానం అనుసరించాలని ధర్మ సందేహం. ముందసలు మన ఐయ్యేఎస్లతో ప్రభవ, విభవలు; చైత్ర వైశాఖాలు; పాడ్యమి విదియ తదియలు భట్టీయం వేయించాలి. ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఇంగ్లిష్ కాలసూచినే అనుసరిస్తున్నాడు. ఏటా మకర సంక్రమణం ఆ తేదీనాడే చేస్తున్నాడు. దేశంలో సమస్యలు గుట్టలుగా పడి ఉండగా, ఈ కొత్త సమస్యని తెర మీదకి తేవడం అవసరమా? తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్లిందని అచ్చ తెలుగు సామెత ఉంది. పత్రికల మీద డేట్లైన్లు పాడ్యమి, విదియలతో ఉండాలి. మిగుళ్లు తగుళ్లు చూసుకోవాలి. మధ్య మధ్య అధికమాసాలొస్తుంటాయి. అప్పుడు రెండు పుట్టిన్రోజులూ, రెండు ఆబ్దికాలూ తప్పదు. ఆంగ్లంలో అధిక మాసాల బెడద లేదు. ఆలోచించుకోండి! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దుర్గమ్మ సేవలో శాతకర్ణి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రబృందం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శుక్రవారం దర్శించుకుంది. హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో రామమోహనరావు హీరో బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, దేవస్థాన క్యాలెండర్ బహూకరించారు. చిత్ర బృందాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు తరలివచ్చారు. -
బ్రాహ్మణ సంఘటన క్యాలెండర్ ఆవిష్కరణ
మచిలీపట్నం టౌన్ : రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్‌ను మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు శనివారం ఆవిష్కరించారు. స్థానిక గొడుగుపేటలోని శంకరమఠంలో ఈ కార్యక్రమం జరిగింది. బాబాప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ క్యాలెండర్‌ను ముద్రించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పీవీ ఫణికుమార్, మోపర్తి సుబ్రహ్మణ్యం, వేమూరి రామకృష్ణ, ఎల్ఎస్ శాస్త్రి, డాక్టర్ ధన్వంతరీ ఆచార్య, బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల సూర్యనారాయణశర్మ, జొన్నలగడ్డ శ్రీకాంత్, తాళ్లపాలెం ఉప సర్పంచ్ కుందా బాలజీ శివరామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
2017 శ్రీశైలం దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీశైలం: ఏపీ సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం ప్రచురించిన 2017 క్యాలెండర్‌ను మంగళవారం దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు సత్యబ్రహ్మచార్య, బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ క్యాలెండర్లో దేవస్థానంలో జరిగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల వివరాలను ప్రత్యేకంగా పొందుపర్చామన్నారు. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ క్యాలెండర్‌లోని పంచాంగాన్ని రూపొందించారన్నారు. -
మారిన విద్యాశాఖ క్యాలెండర్
పాఠశాల విద్య స్థాయిలో మెరుగైన ఫలితాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటి వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించి వెంటనే వేసవి సెలవులు ప్రకటించేవారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతోంది. ఇకపై ఆయా తరగతులకు పరీక్షలు మార్చిలోనే నిర్వహించి, అనంతరం వేసవి సెలవులు వరకూ అంతే దాదాపు 40 రోజుల పాటు పై తరగతుల బోధన చేపట్టాలని నిర్ణయించింది. – బాలాజీచెరువు(కాకినాడ) ఇప్పటి వరకు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు ఏప్రిల్‌లో, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి మూడో వారంలో నిర్వహించేవారు. వేసవి తీవ్రత, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణతో తొమ్మిదో తరగతి వరకు ఒంటిపూట బడుల్ని నిర్వహిస్తున్నారు. ఫలితంగా తరగతుల నిర్వహణ, బోధన సవ్యంగా సాగక.. ఆయా తరగతుల విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన విద్యాశాఖ ఇకపై ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ మార్చి ఏడు నుంచి 22వ తేదీ వరకూ వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలు ముగిసిన వెంటనే పైతరగతులకు సంబంధించిన బోధన చేయించాలని 2016–17 విద్యా విషయక క్యాలండర్లో పేర్కొంది. 6 నుంచి 9వ తరగతి వరకే రాష్ట్ర స్థాయిలో, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ జిల్లా స్థాయిలో ప్రశ్నాపత్రాలు రూపొందించనుంది. ఆరోగ్య, వ్యాయామ విద్యకు ప్రాధాన్యం.. ∙ప్రాథమిక పాఠశాలల్లో ఆరోగ్య, వ్యాయామ విద్యకు మూడు పీరియడ్లకు బదులు ఆరు పీరియడ్లు కేటాయించారు. ∙విలువల విద్య, జీవన నైపుణ్యాలు, కళలు, సాంస్కృతిక విద్యకు సంబంధించి మూడు పీరియడ్లు, గత సంవత్సరం వరకూ సాధారణ పద్ధతిలో జరిగేవి. వీటిని ఇక నుంచి తప్పని సరిగా నిర్వహించాలని అదేశాలు జారీ చేశారు. ∙సెప్టెంబర్ వరకూ జరిగే సిలబస్ ఆధారంగా సెప్టెంబర్ 21 నుంచి 28వ తేదీ వరకూ త్రైమాసిక పరీక్షలు, (ఎస్ఏ–1) నిర్వహించి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ దసరా సెలవులు ప్రకటించారు. ∙జనవరి మూడో తేదీ నుంచి పదో తేదీ వరకూ అర్ధ వార్షిక ఎస్ఏ–2 పరీక్షలు నిర్వహించి, జనవరి 11వ తేదీ నుంచి 19వతేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ∙మార్చి ఏడోతేదీ నుంచి 22వ తేదీ వరకూ వార్షిక పరీక్షలు ఎస్ఏ–3 జరిపి వేసవి సెలవులు ప్రకటించే వరకూ పై తరగతులకు సంబంధించి సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ∙పాఠశాలల పనిగంటల్ని విద్యాహక్కు చట్ట ప్రకారం మార్పు చేసి, ప్రతి పాఠశాలలో వార్సికోత్సవాలు తప్పనిసరిగా నిర్వహించడంతోపాటు ఆ వేడుకల్లో విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలి. ∙వివక్ష తగ్గించే చర్యలో భాగంగా బాలికాచేతన కార్యక్రమాల్ని పొందుపరిచారు. -
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఉండదు
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం లేదు. 2015 అధికమాసం సందర్భంగా జనవరి ఒకటి, తిరిగి డిసెంబరు 21వ తేదీన వైకుంఠ ఏకాదశి నిర్వహించకున్న విషయం తెలిసిందే. తిరిగి 2017 జనవరి 9న, డిసెంబరు 29వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం వస్తుంది. ఈ ఏడాది శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3 నుంచి 11 తేదీ వరకు జరగనున్నాయి. 7వ తేదీన గరుడవాహన సేవ, 8న స్వర్ణరథోత్సవం, 10న రథోత్సవం, 11న చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ ఏడు తిరుమలలో జరిగే ప్రధాన ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 16న పారువేట ఉత్సవం, గోదా పరిణయోత్సవం, ఫిబ్రవరి 14న శ్రీవారి రథసప్తమి, మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు, ఏప్రిల్ 8న ఉగాది ఆస్తానం, 15న శ్రీరామ పట్టాభిషేకం, 19 నుంచి 21వ తేదీ వరకు వసంత్సోవాలు, మే 16 నుంచి 18 వరకు పద్మావతి పరిణయోత్సవం, జూన్ 17 నుంచి 19 వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం, జూలై 16న ఆణివార ఆస్తానం, ఆగస్టు 13 నుంచి 16వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు, 25న గోకులాష్టమి, ఆస్తానం, అక్టోబరు 3 నుంచి 11వ వరకు బ్రహ్మోత్సవాలు, 12న బ్యాక్‌సవారీ, 24న తిరుమల నంబి ఉత్సవం, నవంబరు 7న పుష్పయాగం ఉంటాయి. -
'కాపుల ఉద్యమానికి పెద్దన్నలా సహకరిస్తాం'
-
'కాపుల ఉద్యమానికి పెద్దన్నలా సహకరిస్తాం'
ఏలూరు: కాపుల ఉద్యమానికి పెద్దన్నలా సహకరిస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఏలూరులో నగర తూర్పు కాపు కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తూర్పుకాపులను ఓబీసీల్లో చేర్చేలా ఈ నెలలో జాతీయ కమిషన్‌ను కలువనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కన్వినర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
భార్యా బాధితుల సంఘం కేలండర్ విడుదల
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్న భార్యా బాధితుల సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ‘ఏకం అవ్వండి.. ఏకం అవ్వండి.. ఓ భార్యా బాధితులారా’ అనే నినాదంతో కేలెండర్‌ను తాడేపల్లిగూడెంలో శుక్రవారం విడుదల చేసింది. సంఘం అధ్యక్షుడు జి.బాలాజీ వీటిని స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 498 (9), గృహ హింస కేసుల వల్ల బాధలు పడే భర్తలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతున్నారని, అలాంటి వారు మరో జీవితం పొందడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘాన్ని జాతీయ స్థాయిలో రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. న్యాయపరమైన సలహాలు, సెక్షన్ల గురించి క్యాలెండర్ వెనుక భాగంలో పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.