‘సై’ అంటే ‘సై’... మెగా ఈవెంట్స్‌తో కొత్త ఏడాదికి స్వాగతం | Welcome the New Year with mega events | Sakshi
Sakshi News home page

‘సై’ అంటే ‘సై’... మెగా ఈవెంట్స్‌తో కొత్త ఏడాదికి స్వాగతం

Published Wed, Jan 1 2025 3:13 AM | Last Updated on Wed, Jan 1 2025 8:20 AM

Welcome the New Year with mega events

క్రీడాభిమానులకు కనువిందు చేయనున్న 2025 

 మెగా ఈవెంట్స్‌తో కొత్త ఏడాదికి స్వాగతం

మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్లకి ప్రతి రోజూ కొత్త అవకాశమే... అప్పటి వరకు అద్భుతాలు చేసినా, వైఫల్యాలతో అట్టడుగున నిలిచినా మళ్లీ పైకి లేచేందుకు సిద్ధం కావడమే... ఇక కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త టోర్నీలు, సరికొత్త తరహా ఆటతో అత్యుత్తమ ప్రదర్శనకు ‘సై’ అనడమే... ముగిసిన సంవత్సరంలో త్రుటిలో విజయాలు చేజార్చుకున్న క్షణాలు, అనూహ్యంగా ఎదురైన అపజయాలను మరచిపోయేలా అక్కడే, అదే వేదికపై తప్పులు దిద్దుకొని సత్తా చాటేందుకు కొత్త ఏడాది ఇస్తున్న మరో చాన్స్‌ అనుకొని చెలరేగిపోవడమే... 

మరోవైపు అభిమానులకు ఏడాదంతా ఆటలతో పండగనే... క్రీడాంశం ఏదైనా, టోర్నీ పేరు ఏదైనా మైదానంలోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడి నుంచైనా తాము ఆశించిన వినోదం కోసం వారు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పోటీలైనా... ప్రతీ ఏటా పలకరించే వార్షిక టోర్నీలైనా... ఫ్యాన్స్‌ మళ్లీ మళ్లీ ‘జై’ కొట్టేందుకు సిద్ధమైపోతారు... అందుకే క్యాలెండర్‌లో సంవత్సరం మారగానే కొత్త ఏడాదిలో వచ్చే ఈవెంట్‌లపై అందరికీ ఎప్పటిలాగే ఆసక్తి ఉంటుంది.

2025 అలాంటి కొన్ని ఉత్సాహవంతమైన క్రీడా పోటీలతో సిద్ధమైంది. క్రికెట్‌ అభిమానుల కోసం వన్డే వరల్డ్‌కప్‌కు సమఉజ్జీలాంటి చాంపియన్స్‌ ట్రోఫీ ఏడాది ఆరంభంలోనే కనువిందు చేయనుంది. ఈ టోర్నీకి ముందు మలేసియా వేదికగా అండర్‌–19 మహిళల వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్‌ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. ఆ తర్వాత మహిళల క్రికెట్‌లో వన్డే వరల్డ్‌కప్‌నకు మన దేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. 

ఆటగాళ్లు అటు ఇటు మారడం మినహా ఎప్పటిలాగే ఐపీఎల్‌ వేసవిలో అలరించనుంది. టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌లు, బ్యాడ్మింటన్‌లో బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ టోర్నీలు ఏడాదంతా కొత్త చాంపియన్ల కోసం తివాచీ పరచడం ఖాయం కాగా... భారత్‌ వేదికగానే జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌ యువ ఆటగాళ్లను పరిచయం చేయనుంది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్‌వంటి క్రీడాంశాల్లో విశ్వ వేదికలపై మన ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

గత ఏడాదిలో అసాధారణ ప్రదర్శనలతో అలరించిన మన చదరంగం కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఎత్తులు పై ఎత్తులతో కొత్త ఎత్తులకు చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన ఈవెంట్లతో కూడిన క్రీడా క్యాలెండర్‌ మీ కోసం...       –సాక్షి క్రీడా విభాగం

క్రికెట్‌ 
జనవరి 3–7: ఆ్రస్టేలియాతో ఐదో టెస్టు (సిడ్నీ) 
భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటన 
జనవరి 22: తొలి టి20 (చెన్నై) 
జనవరి 25: రెండో టి20 (కోల్‌కతా) 
జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌) 
జనవరి 31: నాలుగో టి20 (పుణే) 
ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబై) 
ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌) 
ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌) 
ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌) 
చాంపియన్స్‌ ట్రోఫీ (దుబాయ్‌) 
ఫిబ్రవరి 20: భారత్‌ X బంగ్లాదేశ్‌ 
ఫిబ్రవరి 23: భారత్‌ Xపాకిస్తాన్‌ 
మార్చి 2: భారత్‌ X న్యూజిలాండ్‌ 
మార్చి 4: సెమీఫైనల్‌ (అర్హత సాధిస్తే) 
మార్చి 9: ఫైనల్‌ (అర్హత సాధిస్తే) 
ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన 
జూన్‌ 20–24: తొలి టెస్టు (హెడింగ్లే) 
జూలై 2–6: రెండో టెస్టు (ఎడ్జ్‌బాస్టన్‌) 
జూలై 10–14: మూడో టెస్టు (లార్డ్స్‌) 
జూలై 23–27: నాలుగో టెస్టు (మాంచెస్టర్‌) 
జూలై 31–ఆగస్టు 4: (ఓవల్‌) 
బంగ్లాదేశ్‌లో భారత్‌ పర్యటన 
ఆగస్టు: 3 వన్డేలు, 3 టి20లు 
భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన 
అక్టోబర్‌: 2 టెస్టులు 
ఆ్రస్టేలియాలో భారత్‌ పర్యటన 
నవంబర్‌: 3 వన్డేలు, 5 టి20లు 
భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన 
నవంబర్‌–డిసెంబర్‌: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు 
ఇంగ్లండ్‌లో భారత మహిళల జట్టు పర్యటన 
జూన్‌–జూలైలో ఐదు టి20లు, మూడు వన్డేలు

మహిళల అండర్‌–19 టి20 ప్రపంచకప్‌  
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు 
వేదిక: మలేసియా 
పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీ 
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు 
వేదిక: పాకిస్తాన్, దుబాయ్‌ 
ఐపీఎల్‌ టోర్నీ 
మార్చి 14 నుంచి మే 25 వరకు 
మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ 
ఆగస్టు–సెప్టెంబర్      
వేదిక: భారత్‌  

బ్యాడ్మింటన్‌ 
జనవరి 7–12: మలేసియా ఓపెన్‌–1000 టోర్నీ (కౌలాలంపూర్‌) 
జనవరి 14–19: ఇండియా ఓపెన్‌–750 టోర్నీ (న్యూఢిల్లీ) 
ఫిబ్రవరి 11–16: ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (కింగ్‌డావో, చైనా) 
మార్చి 11–16: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ (బరి్మంగ్‌హమ్‌) 
ఏప్రిల్‌ 8–13: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (నింగ్బో, చైనా) 
ఏప్రిల్‌ 27–మే 4: సుదిర్మన్‌ కప్‌ (జియామెన్, చైనా) 
మే 27–జూన్‌ 1: సింగపూర్‌ ఓపెన్‌–750 టోర్నీ (సింగపూర్‌ సిటీ) 
జూన్‌ 3–8: ఇండోనేసియా ఓపెన్‌–1000 టోర్నీ (జకార్తా) 
జూలై 15–20: జపాన్‌ ఓపెన్‌–750 టోర్నీ (టోక్యో) 
జూలై 22–27: చైనా ఓపెన్‌–1000 టోర్నీ (చాంగ్జౌ) 
ఆగస్టు 25–31: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (పారిస్‌) 
సెప్టెంబర్ 16–21: చైనా మాస్టర్స్‌–750 టోర్నీ (షెన్‌జెన్‌) 
అక్టోబర్‌ 6–19: ప్రపంచ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (గువాహటి, భారత్‌) 
అక్టోబర్‌ 14–19: డెన్మార్క్‌ ఓపెన్‌–750 టోర్నీ (ఒడెన్స్‌) 
అక్టోబర్‌ 21–26: ఫ్రెంచ్‌ ఓపెన్‌–750 టోర్నీ (పారిస్‌) 
డిసెంబర్‌ 10–14: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ (హాంగ్జౌ, చైనా)

ఫార్ములావన్‌
మార్చి 16: ఆ్రస్టేలియన్‌ గ్రాండ్‌ప్రి (మెల్‌బోర్న్‌) 
మార్చి 23: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) 
ఏప్రిల్‌ 6: జపాన్‌ గ్రాండ్‌ప్రి (సుజుకా) 
ఏప్రిల్‌ 13: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి (సాఖిర్‌) 
ఏప్రిల్‌ 20: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి (జిద్దా) 
మే 4: అమెరికా గ్రాండ్‌ప్రి (మయామి) 
మే 18: ఇటలీ గ్రాండ్‌ప్రి (ఇమోలా) 
మే 25: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) 
జూన్‌ 1: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) 
జూన్‌ 15: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్‌) 
జూన్‌ 29: ఆ్రస్టియా గ్రాండ్‌ప్రి (స్పీల్‌బర్గ్‌) 
జూలై 6: బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్‌) 
జూలై 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్‌చాంప్స్‌) 
ఆగస్టు 3: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్‌) 
ఆగస్టు 31: డచ్‌ గ్రాండ్‌ప్రి (జాండ్‌వూర్ట్‌) 
సెప్టెంబర్      7: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) 
సెప్టెంబర్      21: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి (బాకు) 
అక్టోబర్‌ 5: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి (సింగపూర్‌ సిటీ) 
అక్టోబర్‌ 19: యూఎస్‌ఏ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్‌) 
అక్టోబర్‌ 26: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) 
నవంబర్‌ 9: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి (సావోపాలో) 
నవంబర్‌ 22: లాస్‌వేగస్‌ గ్రాండ్‌ప్రి (అమెరికా) 
నవంబర్‌ 30: ఖతర్‌ గ్రాండ్‌ప్రి (దోహా) 
డిసెంబర్‌ 7: అబుదాబి గ్రాండ్‌ప్రి (యూఏఈ)

టెన్నిస్‌ 
జనవరి 12–26: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (మెల్‌బోర్న్‌) 
మే 25–జూన్‌ 8: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (పారిస్‌) 
జూన్‌ 30–జూలై 13: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (లండన్‌) 
ఆగస్టు 25–సెప్టెంబర్      7: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ (న్యూయార్క్‌). 
మార్చి 5–16: ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ (కాలిఫోర్నియా) 
మార్చి 19–30: మయామి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ (ఫ్లోరిడా) 
ఏప్రిల్‌ 5–13: మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ (మొనాకో) 
ఏప్రిల్‌ 22–మే 4: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ (స్పెయిన్‌) 
మే 6–18: రోమ్‌ ఓపెన్‌ 
మాస్టర్స్‌–1000 టోర్నీ (ఇటలీ) 
జూలై: టొరంటో ఓపెన్‌ 
మాస్టర్స్‌–1000 టోర్నీ (కెనడా) 
ఆగస్టు: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ (ఒహాయో) 
అక్టోబర్‌ 1–13: షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీ (చైనా) 
అక్టోబర్‌ 25–నవంబర్‌ 2: పారిస్‌ ఓపెన్‌ 
మాస్టర్స్‌–1000 టోర్నీ (ఫ్రాన్స్‌) 
నవంబర్‌ 9–16: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ (ఇటలీ) 
నవంబర్‌ 18–23: డేవిస్‌కప్‌ ఫైనల్స్‌ టోర్నీ (ఇటలీ)  

ఆర్చరీ
ఫిబ్రవరి 16–23: ఆసియా కప్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ టోర్నీ (బ్యాంకాక్‌) 
ఏప్రిల్‌ 8–13: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–1 టోర్నీ (ఫ్లోరిడా, అమెరికా) 
మే 6–11: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–2 టోర్నీ (షాంఘై, చైనా) 
జూన్‌ 3–8: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–3 టోర్నీ (అంటాల్యా, టర్కీ) 
జూలై 8–13: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–4 టోర్నీ (మాడ్రిడ్, స్పెయిన్‌) 
ఆగస్టు 17–24: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ (విన్నీపెగ్, కెనడా) 
సెప్టెంబర్‌ 5–12: వరల్డ్‌ చాంపియన్‌
షిప్‌ (గ్వాంగ్‌జు, దక్షిణ కొరియా)

రెజ్లింగ్‌ 
మార్చి 25–30: ఆసియా చాంపియన్‌షిప్‌ (అమ్మాన్, జోర్డాన్‌) 
జూన్‌ 14–23: ఆసియా అండర్‌–17, అండర్‌–23 చాంపియన్‌షిప్‌ (వియత్నాం) 
జూలై 5–13: ఆసియా అండర్‌–15, అండర్‌–20 చాంపియన్‌షిప్‌ (కిర్గిస్తాన్‌) 
జూలై 28–ఆగస్టు 3: వరల్డ్‌ అండర్‌–17 
చాంపియన్‌షిప్‌ (ఏథెన్స్, గ్రీస్‌) 
ఆగస్టు 18–24: వరల్డ్‌ అండర్‌–20 చాంపియన్‌షిప్‌ (సోఫియా, బల్గేరియా) 
సెప్టెంబర్   13–21: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (జాగ్రెబ్, క్రొయేషియా) 
అక్టోబర్‌ 20–26: ప్రపంచ అండర్‌–23 చాంపియన్‌షిప్‌ (నోవిసాద్, సెర్బియా)

టేబుల్‌ టెన్నిస్‌
జనవరి 30–ఫిబ్రవరి 9: సింగపూర్‌ స్మాష్‌ టోర్నీ 
మార్చి 11–16: చాంపియన్స్‌ టోర్నీ (చైనా) 
ఏప్రిల్‌ 1–6: చాంపియన్స్‌ టోర్నీ (కొరియా) 
ఏప్రిల్‌ 14–20: పురుషుల, మహిళల వరల్డ్‌ కప్‌ (మకావు) 
జూన్‌ 26–జూలై 2: ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌ (తాషె్కంట్‌) 
జూలై 3–13: యూఎస్‌ఏ స్మాష్‌ టోర్నీ  
ఆగస్టు 7–11: చాంపియన్స్‌ టోర్నీ (జపాన్‌) 
ఆగస్టు 14–24: గ్రాండ్‌స్మాష్‌ టోర్నీ 
సెప్టెంబర్   9–14: చాంపియన్స్‌ టోర్నీ (మకావు) 
సెప్టెంబర్   25–అక్టోబర్‌ 5: చైనా స్మాష్‌ టోర్నీ 
అక్టోబర్‌ 11–15: ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ (భారత్‌) 
అక్టోబర్‌ 28–నవంబర్‌ 2: చాంపియన్స్‌ టోర్నీ (ఫ్రాన్స్‌) 
నవంబర్‌ 23–30: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ (రొమేనియా)  

షూటింగ్‌
ఫిబ్రవరి 9–22: ఆసియా రైఫిల్, పిస్టల్‌ కప్‌ (బ్యాంకాక్‌) 
ఏప్రిల్‌ 1–11: వరల్డ్‌ కప్‌–1 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ (బ్యూనస్‌ ఎయిర్స్‌) 
ఏప్రిల్‌ 13–22: వరల్డ్‌ కప్‌–2 రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ టోర్నీ (లిమా) 
మే 3–12: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ టోర్నీ (సైప్రస్‌) 
జూన్‌ 1–12: ఆసియాకప్‌ షాట్‌గన్‌ టోర్నీ (చైనా) 
జూన్‌ 8–15: వరల్డ్‌కప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ (జర్మనీ) 
జూలై 4–14: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ టోర్నీ (ఇటలీ) 
ఆగస్టు 16–30: ఆసియా చాంపియన్‌షిప్‌ (కజకిస్తాన్‌) 
సెప్టెంబర్‌ 13–21: వరల్డ్‌కప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ (చైనా) 
అక్టోబర్‌ 8–19: ప్రపంచ చాంపియన్‌షిప్‌ షాట్‌గన్‌ టోర్నీ (గ్రీస్‌) 
నవంబర్‌ 6–16: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రైఫిల్, పిస్టల్‌ టోర్నీ (ఈజిప్‌్ట)  

హాకీ 
డిసెంబర్‌ 28–ఫిబ్రవరి 1: పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (భారత్‌) 
జనవరి 12–26: మహిళల హాకీ ఇండియా లీగ్‌ (భారత్‌) 
ఫిబ్రవరి 15–జూన్‌ 29: ప్రొ హాకీ లీగ్‌ (మహిళలు) 
ఫిబ్రవరి 15–జూన్‌ 22: ప్రొ హాకీ లీగ్‌ (పురుషులు) 
డిసెంబర్‌: జూనియర్‌ పురుషుల వరల్డ్‌కప్‌ (భారత్‌)

చెస్‌ 
ఫిబ్రవరి 17–28: మహిళల గ్రాండ్‌ప్రి మూడో సిరీస్‌ (మొనాకో) 
ఫిబ్రవరి 23–మార్చి 8: ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌ (మోంటెనిగ్రో) 
మార్చి 14–25: మహిళల గ్రాండ్‌ప్రి నాలుగో సిరీస్‌ (సైప్రస్‌) 
ఏప్రిల్‌ 13–24: మహిళల గ్రాండ్‌ప్రి ఐదో సిరీస్‌ (భారత్‌) 
మే 6–17: మహిళల గ్రాండ్‌ప్రి ఆరో సిరీస్‌ (ఆ్రస్టియా) 
జూలై 5–29: మహిళల వరల్డ్‌కప్‌ టోర్నీ (జార్జియా)  

అథ్లెటిక్స్‌ 
సెప్టెంబర్‌ 13–21: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (జపాన్‌)

బాక్సింగ్‌ 
మార్చి 6–18: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ 
చాంపియన్‌షిప్‌ (బెల్‌గ్రేడ్‌) మే–జూన్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌  చాంపియన్‌షిప్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement