సాక్షి, హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. కేంద్రం బుధవారమే సెలవుగా నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్‌లో మాత్రం గురువారం సెలవుదినంగా పేర్కొంది. దీనిపై చర్చ జరిగినా చివరికి గురువారాన్నే సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.