AP CM YS Jagan Holds Review Meeting On Job Calendar - Sakshi
Sakshi News home page

CM Jagan Review Meeting: నిరుద్యోగులకు శుభవార్త

Published Fri, Jun 17 2022 12:12 PM | Last Updated on Fri, Jun 17 2022 9:02 PM

CM YS Jagan holds Review Meeting on Job Calendar - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమగ్రంగా సమీక్షించారు. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. బ్యాక్‌లాక్‌ పోస్టులు, ఏపీపీఎస్‌సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌ మెంట్‌ను సమగ్రంగా సీఎం జగన్‌ సమీక్షించారు. 

2021–22లో 39,654ల పోస్టుల భర్తీ:
– 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా వెల్లడించిన అధికారులు.
– ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ.
– గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. 
– 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉంది. 
– భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయి.  

రిక్రూట్‌ మెంట్‌పై సీఎం ఆదేశాలు..
– 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేశాము. 
– వైఎ‍స్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇచ్చాము. 
– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నాము. 
– ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది. 

జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్‌ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు.

నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదు. భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు అని సీఎం జగన్‌ తెలిపారు. 
ఉన్నతవిద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్ద పీటవేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రెగ్యులర్‌ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలి. దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై యాక్షన్‌ ప్లాన్‌..
పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో సీఎంకు నివేదించాలన్న చెప్పారు.  కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్త, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు మరియు హెచ్‌ఆర్‌ఎం) హెచ్‌ అరుణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. 25న హెచ్‌సీఎల్‌ ‘వాక్‌ ఇన్‌ డ్రైవ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement