2017 శ్రీశైలం దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరణ
2017 శ్రీశైలం దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరణ
Published Tue, Dec 6 2016 11:13 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: ఏపీ సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం ప్రచురించిన 2017 క్యాలెండర్‌ను మంగళవారం దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు సత్యబ్రహ్మచార్య, బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ క్యాలెండర్‌లో దేవస్థానంలో జరిగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల వివరాలను ప్రత్యేకంగా పొందుపర్చామన్నారు. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ క్యాలెండర్‌లోని పంచాంగాన్ని రూపొందించారన్నారు.
Advertisement
Advertisement