అలరించిన సంగీత విభావరి | music concert at srisailam | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత విభావరి

Published Sat, Dec 31 2016 12:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

అలరించిన సంగీత విభావరి - Sakshi

అలరించిన సంగీత విభావరి

శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద మూడో రోజు శుక్రవారం ఏర్పాటు చేసిన భక్తి సంగీత విభావరి భక్తులను అలరించింది. 2గంటల పాటు సాగిన సంగీత విభావరిలో గణపతి స్తుతి, దుర్గాస్తుతి, పలు శివస్తోత్రాలు, శంకర మహాదేవ, నమామి భూశం, చంద్రమణీలలాటబోలా, ఓం మంగళం, ఓం కార మంగళం మొదలైన కీర్తనలను ముంబయ్‌ సంజయ్‌ విద్యార్థి బృందం ఆలపించింది. బృందం సభ్యులు హరీష్‌ మోయాల్, వికాస్‌ అంబారరే, రేఖరామ్‌లు గీతాలను ఆలపించగా, ఆశీజ్‌జా, ఓంకార్‌ దర్హీ, శశికాంత్‌ శర్మ, తరుణ్, ప్రకాశ్, నెవెల్, ప్రదీప్, ఠాగూర్, చందాసింగ్‌లు తబల, డోలక్, గిటార్, వాయూలీనం, డ్రమ్స్‌ మొదలైన వాయిద్య సహకారాలను అందించారు. ఈ కార్యక్రమంలో 21 మంది ప్రసిద్ధ కళాకారులు పాల్గొన్నారు. అనంతరం ఈఓ నారాయణభరత్‌ గుప్త మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలను సంపూర్ణంగా జరిపేందుకు కళా నీరాజనం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, దేవస్థానం సంబంధిత విభాగాధిపతులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement