ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం లేదు. 2015 అధికమాసం సందర్భంగా జనవరి ఒకటి, తిరిగి డిసెంబరు 21వ తేదీన వైకుంఠ ఏకాదశి నిర్వహించకున్న విషయం తెలిసిందే. తిరిగి 2017 జనవరి 9న, డిసెంబరు 29వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం వస్తుంది. ఈ ఏడాది శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3 నుంచి 11 తేదీ వరకు జరగనున్నాయి. 7వ తేదీన గరుడవాహన సేవ, 8న స్వర్ణరథోత్సవం, 10న రథోత్సవం, 11న చక్రస్నానం నిర్వహించనున్నారు.
ఈ ఏడు తిరుమలలో జరిగే ప్రధాన ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 16న పారువేట ఉత్సవం, గోదా పరిణయోత్సవం, ఫిబ్రవరి 14న శ్రీవారి రథసప్తమి, మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు, ఏప్రిల్ 8న ఉగాది ఆస్తానం, 15న శ్రీరామ పట్టాభిషేకం, 19 నుంచి 21వ తేదీ వరకు వసంత్సోవాలు, మే 16 నుంచి 18 వరకు పద్మావతి పరిణయోత్సవం, జూన్ 17 నుంచి 19 వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం, జూలై 16న ఆణివార ఆస్తానం, ఆగస్టు 13 నుంచి 16వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు, 25న గోకులాష్టమి, ఆస్తానం, అక్టోబరు 3 నుంచి 11వ వరకు బ్రహ్మోత్సవాలు, 12న బ్యాక్‌సవారీ, 24న తిరుమల నంబి ఉత్సవం, నవంబరు 7న పుష్పయాగం ఉంటాయి.
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఉండదు
Published Fri, Jan 8 2016 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement