పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్న భార్యా బాధితుల సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ‘ఏకం అవ్వండి.. ఏకం అవ్వండి.. ఓ భార్యా బాధితులారా’ అనే నినాదంతో కేలెండర్‌ను తాడేపల్లిగూడెంలో శుక్రవారం విడుదల చేసింది. సంఘం అధ్యక్షుడు జి.బాలాజీ వీటిని స్థానికులకు పంపిణీ చేశారు.
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్న భార్యా బాధితుల సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ‘ఏకం అవ్వండి.. ఏకం అవ్వండి.. ఓ భార్యా బాధితులారా’ అనే నినాదంతో కేలెండర్‌ను తాడేపల్లిగూడెంలో శుక్రవారం విడుదల చేసింది. సంఘం అధ్యక్షుడు జి.బాలాజీ వీటిని స్థానికులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 498 (9), గృహ హింస కేసుల వల్ల బాధలు పడే భర్తలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతున్నారని, అలాంటి వారు మరో జీవితం పొందడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘాన్ని జాతీయ స్థాయిలో రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. న్యాయపరమైన సలహాలు, సెక్షన్ల గురించి క్యాలెండర్ వెనుక భాగంలో పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.