husbands
-
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
భర్తలు జైల్లో.. భార్యలు రాజకీయాల్లో..
మనదేశంలో కొందరు రాజకీయ నేతలు జైలుకు వెళ్లిన సందర్భంలో వారి భార్యలు రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని చూస్తుంటాం. ఇటువంటి దృశ్యం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించనుంది. జైల్లో ఉన్న తమ భర్తల రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి భార్యలు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, యూపీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ. వీరి భర్తలు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. వారు లోక్‌సభ ఎన్నికల్లోగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో తమ భర్తల రాజకీయ పలుకుబడిని కాపాడేందుకు ఈ ముగ్గురూ రాజకీయాల్లోకి దిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు ప్రతిపక్ష శిబిరానికి చెందినవారే. భూ కుంభకోణం ఆరోపణలపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అతనిని జ్యుడీషియల్ కస్టడీ కింద రాంచీ జైలులో ఉంచారు. హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన ధనంజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి కూడా ధనంజయ్ జౌన్పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే జైలులో ఉండటంతో ఆయన ఆశలు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో ఆయన భార్య శ్రీకళారెడ్డి జౌన్పూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు
పెళ్లైన ఏడాదిన్నరకే వరకట్న దాహానికి బలైంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో విచారణ సాగిని ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు 15 ఏళ్లకు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..భారతి అనే మహిళ అక్టోబర్3, 2007న పెళ్లై ఏడాదిన్నరలోపే అసాధారణ పరిస్థితుల్లో చనిపోయింది. దీంతో ఆమె భర్త, అత్త, బావ, మరిదిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఐతే ఆమెను హత్య చేశారనే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులను తొలుత నిర్దోషులుగా ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం ఆమె ఊపిరాడక చనిపోయినట్లు ఉంది. అదీగాక దర్యాప్తు అధికారులు సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు గురించి, పైగా పక్కన అద్దెకుంటున్న వారిని విచారించడం వంటివి చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు దోషలుగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు వివాహం అయినప్పటి నుంచి వరకట్న సమస్యలు ఎదుర్కొన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. మరణానికి ముందు రోజు కూడా వేధింపులకు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఆమె మరణానికి ముందు నిందితులందరిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ తదితర సాక్ష్యాధారాలు ఆధారంగా భర్త పవన్‌కుమార్, అత్తగారు సత్బిరో, బావ కప్తాన్ సింగ్, బావమరిది దల్జీత్ సింగ్‌లను దోషులగా నిర్ధారించినట్లు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతురాలు వివాహం అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేధింపులు కొనసాగినట్లు తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున వారిని దోషులగా గర్తించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకి సంబంధించి తదుపరి తీర్పును జనవరి 30కి వాయిదా వేసింది. (చదవండి: అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..) -
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్‌గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి..
-
ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు!
అందమైన జంట, అన్యోన్య దాంపత్యం, ముచ్చటైన జంట.. ఇలాంటి పదాలను తరచూగా వింటూనే ఉంటాం. ఎవరైనా భార్యాభర్తలు కలహాలు లేకుండా కాపురం చేస్తున్నా,, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నా ఈ పదాలతోనే వాళ్లను పొగడ్తల్లో ముంచేస్తాం. ఇద్దరు మనుషులు, వారి మనసులు కలిసి చేసే జీవనప్రయాణమే దాంపత్యం. ఏ సంప్రదాయం అయినా ఒక భర్తకు ఒక భార్య ఉండటమే చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని ఆచారాల్లో ఓ వ్యక్తి ఇద్దరు లేదా ఎంతమందినైనా పెళ్లి చేసుకునే వీలు కూడా ఉంటుంది. అయితే ఇష్టమొచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండకూడదు. ఈ ఆలోచన మనలో ఎంతమందికి వచ్చిందో తెలియదు. కానీ దక్షిణాఫ్రికాలో మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు దీనిపై పోరాడుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఉదారమైన రాజ్యాంగవ్యవస్థల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వెల్లువెత్తిన ప్రతిపాదనలను ఆ దేశ ప్రభుత్వం స్వీకరించింది. దేశంలోని మహిళలు అనేక మంది పురుషులను పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వడాన్ని పరిశీలిస్తూ సమగ్ర ప్రతిపాదనలతో ఓ ఫైలును డాక్యుమెంట్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు హోంమంత్రిత్వశాఖ గ్రీన్ పేపర్‌ను జారీ చేసింది. మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలను అనుమతించాలన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దేశంలో విస్తృత చర్చకు దారితీసింది. బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో అక్కడి బుల్లితెర ప్రముఖుడు మౌసా సెలేకూ సైతం ఉన్నారు. నలుగురు భార్యలున్న ఈయన.. బహుభర్తృత్వం ఆఫ్రికన్ సంస్కృతి సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఓ మహిళకు ఒకరిని మించి భర్తలున్నప్పుడు వారంతా ఆమె ఇంటి పేరును స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు రెవరెండ్ కెన్నెత్ మెషో మాట్లాడుతూ.. బహుభార్యాత్వం ఆచరణలో ఆమోదయోగ్యమైనది. కానీ బహుభార్యత్వం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసూయ, నాదీ అన్న అధిపత్య ధోరణితో ఉండే పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చనేది పనిచేయదన్నారు. అయితే చట్టాన్ని మార్చుతూ చేసిన ప్రతిపాదనలోని కీలక సమస్యలపై సాంప్రదాయ నాయకులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, ఇతర గ్రూప్‌లో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతోంది. -
అక్కడ భార్యలను వేధిస్తే క్వారంటైన్‌కు..
ముంబై : భర్తల చేతిలో వేధింపులకు గురయ్యే భార్యలకు ఊరట కల్పించేలా మహారాష్ట్రలో పుణే అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో గృహ హింస పెరగిందనే వార్తలతో పుణేలో గ్రామీణాభివృద్ధి యంత్రాంగం వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. ఇళ్లలో భార్యలు, మహిళలను వేధించే పురుషులను క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ భర్తల చేతిలో గృహహింసకు గురవుతున్నారనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పుణే జిల్లాపరిషత్ సీఈఓ ఆయుష్ ప్రసాద్ వెల్లడించారు. మద్యం షాపుల మూసివేతతో దిక్కుతోచని స్ధితిలో పురుషులు ఈ ఉన్మాదానికి తెగబడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో మహిళలపై గృహ హింస కేసులు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్ గణాంకాలు వెల్లడించిన నేపథ్యంలో పుణే జిల్లా పరిషత్ ఈ ప్రకటన చేసింది. మహిళలు లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉన్నందున వారిని భర్తలు ఎవరైనా వేధిస్తే నిందితులను క్వారంటైన్‌కు పంపుతామని ప్రసాద్ హెచ్చరించారు. తొలుత కౌన్సెలర్లు, పోలీసుల సాయంతో నచ్చచెపుతామని, అయినా భర్తల ప్రవర్తనలో మార్పు రాకుంటే క్వారంటైన్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం తాము పంచాయితీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి ఇంటింటికీ వెళ్లి వాకబు చేయిస్తామని చెప్పారు. వేధింపుల వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు లాక్డౌన్ సమయంలో బయటకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వారి ఇంటివద్దే శానిటరీ నాప్కిన్స్, మందులు సరఫరా చేస్తామని తెలిపారు. చదవండి : ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? -
భరణం అనగానే పేదలం అంటున్నారు
న్యూఢిల్లీ: వివాహ సంబంధ కేసులు పెండింగ్‌లో ఉండగా భార్యలు భరణం కోరితే భర్తలు.. దివాలా తీశామని, పేదరికంలో బతుకుతున్నామని చెబుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులు కోరిన హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల బెంచ్ ఈ విధంగా స్పందించింది. భార్య భరణం కోరిందన్న కారణంతో ఉద్యోగం మానేయొద్దని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న భర్తకు సూచించింది. భార్యకు నెలకు రూ.15 వేల చొప్పున భరణం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ‘ఈరోజుల్లో నెలకు రూ.15 వేలతో పిల్లల బాగోగులు చూసుకోవడం సాధ్యమేనా? భార్యలు భరణం కోరిన వెంటనే.. తాము పేదరికంలో బతుకుతున్నామని, లేదా దివాలాతీశామని భర్తలు చెప్పడం సర్వసాధారణమైంది. మీ భార్య భరణం కోరిందని మీరు ఉద్యోగం మానేయొద్దు’ అని బెంచ్ భర్తకు సూచించింది. ఆ భరణం మొత్తం ఎక్కువని, హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయాలని భర్త తరఫు లాయర్ చేసిన వాదనల్ని తోసిపుచ్చింది. భర్త ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. తన భర్తకు నెలకు రూ.80 వేల వేతనంతో పాటు, ఇంటి అద్దె, వ్యయసాయ భూముల రూపంలో మరో 2 లక్షల ఆదాయం వస్తోందని పేర్కొన్న భార్య..నెలకు రూ.1.10 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. -
మా ఆవిడ.. కాదు మా ఆవిడ.. షాకిచ్చిన ఆవిడ
బెంగళూరు : ఆవిడ మా ఆవిడ అంటూ ఒకరు.. కాదు మా ఆవిడ అంటూ మరొకరు. ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన గత శనివారం బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు తనకొద్దు అంటూ.. మరొకరిని పెళ్లి చేసుకున్నానని తెలిపి వారికి షాకిచ్చింది ఆ మహిళ. వారిద్దరూ స్నేహితులేనని, తమతో సంబంధం పెట్టుకున్న యువతి కోసం తన్నుకున్నారని తేల్చిన పోలీసులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సదరు మహిళను పిలిపించి మాట్లాడగా.. ఆ ఇద్దరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని, తను వారితో సహజీవనం మాత్రమే చేశానని, మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నానని షాకిచ్చింది. అంతేకాకుండా సదరు మహిళకు అప్పటికే మూడు పెళ్లిళ్లు కావడం కొసమెరుపు. తొలుత రంగస్వామి అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె కొన్నాళ్లు సంసారం చేసి అనంతరం అతన్నుంచి విడిపోయింది. తర్వాత ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ కుమార్‌తో సహజీవనం చేసింది. అనంతరం మూర్తి అనే ట్రాక్టర్ డ్రైవర్‌తో సహజీవనం సాగించింది. ఇది తెలిసిన రమేష్ ఆమెకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో పరిచయమైన సిద్దరాజు అనే క్యాబ్ డ్రైవర్ పెళ్లి చేసుకుందామని ఆమెకు చెప్పాడు. అతనితో కూడా సహజీవనం ప్రారంభించిన ఆమె, గత శనివారం సిద్దరాజుతో కలిసి ఉండటాన్ని మూర్తి చూశాడు. ఆగ్రహంతో సిద్దరాజుపై దాడి చేశాడు. ఇద్దరు గంటపాటు చితక్కొట్టుకున్నారు. ఇప్పుడా ఆ మహిళ ఇద్దరికీ హ్యాండిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. చదవండి: మా ఆవిడ.. కాదు మా ఆవిడ.. నడి రోడ్డుపై రచ్చ -
అదృశ్యమైన తల్లీకూతుళ్లు శవాలయ్యారు
సాక్షి, పోలవరం: ఏడాది క్రితంనాటి తల్లీకూతుళ్ల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు(19)లు తల్లీ కూతుళ్లు. వీరు గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుండి కనబడకుండా పోయారు. ఈ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ నుంచి ఎర్రాయగూడెం వెళ్లే రహదారి పక్కన జీడిమామిడి తోటలో వీరి శవాలను కనుగొన్నారు. తల్లీకూతుళ్ళను హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
జన్మభూమిలో భర్తల పెత్తనం
తుమ్మపాల (అనకాపల్లి): ప్రజాప్రతినిధులైన తమ భార్యల తరఫున అధికార పార్టీ నేతలు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. అనకాపల్లి మండలంలో జరుగుతున్న సభలకు ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి తరఫున ఆమె భర్త శ్రీను హాజరై ప్రసంగాలు చేస్తున్నారు. అదే కోవలో గ్రామాలలో జరుగుతున్న సభలకు మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీల తరఫున వారి భర్తలు పాల్గొంటూ హంగామా చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. జన్మభూమి సభలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ అధికారుల పక్కనే సూపర్ సర్పంచ్‌లు, సూపర్ ఎంపీటీసీలు కూర్చుని అజమాయిషీ చేస్తున్నారు. రేబాకలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలో కొందరు మరుగుదొడ్ల బిల్లుల గురించి ప్రశ్నించగా.. సర్పంచ్ భర్త సత్తిబాబు కలుగజేసుకొని మరీ పాత వాటికి బిల్లులు చెల్లించరని చెప్పేశారు. కాపుశెట్టివానిపాలెం గ్రామానికి ఒక వ్యక్తి ఇదే సమస్యపై ప్రశ్నించగా ఎంపీటీసీ భర్త చిన్నారావు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భర్తకు ఏసీకి మధ్య సంబంధమేంటి?
భర్తకు, ఇంట్లోని ఏసీకి ఏదైనా సారూప్యత ఉందని ఎప్పుడైనా భావించారా? భర్తకు, ఏసీకి ఏం పోలిక అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రస్తుత ట్విట్టర్ కింగ్, ఒకప్పటి ఫైర్‌బ్రాండ్ బ్యాట్స్‌మన్ వీరందర్ సెహ్వాగ్ మాత్రం ఓ పోలిక పెట్టాడు. ఎండలు మండుతున్న నేపథ్యంలో భర్తకు, స్పిల్ట్ ఏసీకి పోలిక పెట్టి తనదైన స్టైల్లో ట్విట్టర్‌కు కితకితలు పెట్టాడు. ఈ ట్వీట్‌ను ఇప్పటికే 6,800 మంది లైక్ చేశారు. వెయ్యికిపైగా మంది రీట్వీట్ చేశారు. ఇంతకూ ఆయన ఏమన్నాడంటే.. 'భర్త పరిస్థితి స్పిల్ట్ ఏసీలాంటిందే. బయట ఎంత లొల్లి అయినా చేయని ఇల్లును మాత్రం కూల్‌గా, నిశ్శబ్దంగా, రిమోట్ కంట్రోల్డ్‌గా ఉంచాల్సిందే' అని ఛలోక్తి విసిరాడు. అంతేకాదండోయ్ భార్య ఆర్తితో దిగిన ఫొటోను ఈ ట్వీట్‌కు జోడించాడు. సెహ్వాగ్ జోక్ వేస్తే గొల్లుమని నవ్వకుండా ట్విట్టర్ ఉండగలదా! అందుకే వాటే డెఫినేషన్ ఆఫ్ హస్బెండ్, పాజీ' అంటూ సెహ్వాగ్ ట్వీట్‌కు నెటిజనులు నీరాజనాలు పడుతున్నారు. Husband condition is like Split AC. How much ever noise outside , inside the house cool,silent and remote controlled. Shaant,shushil pati. pic.twitter.com/f80oWkaQSz — Virender Sehwag (@virendersehwag) April 14, 2017 -
వాట్సాప్ తలాక్‌లపై న్యాయ పోరాటం
⇒ భర్తలపై హైకోర్టులో పిటిషన్ వేసిన నూర్, ఫాతిమా ⇒ ఇలాంటి వాటి నుంచి ముస్లిం మహిళలను రక్షించాలని వినతి ⇒ సోమవారం విచారించనున్న కోర్టు సాక్షి, హైదరాబాద్: అమెరికా నుంచి వాట్సాప్ ద్వారా విడాకులు పంపిన తమ భర్తలపై ఇద్దరు భార్యలు న్యాయ పోరాటానికి దిగారు. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా విడాకులు ఇచ్చే క్రమంలో అక్రమ మార్గాలను అనుసరించకుండా తగిన మార్గదర్శకాలను రూపొందిం చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన మెహరీన్ నూర్, సయ్యదా హీనా ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ మార్గాల ద్వారా తలాక్ ఇచ్చే సందర్భాల్లో అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఖాజీలను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. వ్యాజ్యంలో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ సీఈవో, శాలిబండ సదర్ ఖాజీ, గోల్కొండ సదర్ ఖాజీలతో పాటు భర్తలు ఉస్మాన్ ఖురేషీ, సయ్యద్ ఫయాజుద్దీన్ ఖురేషీ, అత్తమామలు మహ్మద్ అబ్దుల్ హఫీజ్, అలియా ఖుల్సుంలను ప్రతి వాదులుగా పేర్కొన్నారు. వ్యా జ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు సోమ వారం విచారణ జరపనున్నారు. ఏకపక్ష నిర్ణయం సరికాదు... తన తప్పేమీ లేకపోయినప్పటికీ అమెరికాలో ఉంటున్న తన భర్త ఉస్మాన్ ఖురేషీ ఈ ఏడాది జనవరి 24న తనకు వాట్సాప్ ద్వారా తలాక్.. తలాక్.. తలాక్.. అంటూ మెసేజ్ పంపారని నూర్ తెలిపారు. ప్రసవం తరువాత మెట్టినింటికి వెళ్లినప్పుడు అత్త మామలు తనను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని.. ఫయా జుద్దీన్ వాట్సాప్ ద్వారా తలాక్ పంపారని చెప్పారని, అప్పుడే తనకా విషయం తెలిసిందని ఫాతిమా వివరించారు. ఇది ముస్లిం చట్టం, రాజ్యాంగ నిబంధనలు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపా రు. çసరైన కారణాలు చూపకుం డా ఏకపక్షంగా తలాక్ ఇవ్వడం సరికాదన్నారు. ఇలా అక్రమ మార్గాల ద్వారా ఇచ్చే తలాక్‌ల నుంచి అమాయక ముస్లిం మహిళలను రక్షించేందుకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోర్టును కోరారు. మరో పెళ్లికి యత్నం... వాట్సాప్ ద్వారా తలాక్‌లు పంపిన తరువాత తమ భర్తలు తమను బయటకు నెట్టి మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టు నూర్, ఫాతిమా తెలిపారు. తమ అత్తమామలకు నలుగురు కుమారులైతే... ముగ్గురికి వివాహమైందని, వారు ఇప్పటికే తమతో పాటు ఏడుగురికి ఇలానే తలాక్ ఇచ్చారని తెలిపారు. దీన్ని ప్రశ్నించినందుకు అత్తమామలు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. -
ఆయనలదే పెత్తనం
భార్యల మౌనం భర్తలదే రాజ్యం అధికారికమైనా అంతావారే ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల దగ్గరా అదేసూత్రం పెచ్చుమీరిపోతున్న ‘పచ్చ’పాతం సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారపార్టీ నేతల పెత్తనం పెచ్చుమీరిపోతోంది. ఆ పార్టీ నేతలు జిల్లాలో రా జ్యాంగేతర శక్తులుగా తయారయ్యా రు. ఇందుగలడందు లేడనే సామెత ను తలపించే రీతిలో ఆ పార్టీ నేతలు అన్నింటా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వ యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నేతలే తమకు ముఖ్యమని, వారు చెప్పిన పనులు చేయాల్సిందేనని హుకుం జారీచేశారు. సీఎం స్థాయి నుంచే అటువంటి ఆదేశాలు రాడంతో కలెక్టర్లే చేసేదేమీ లేక వారు చెప్పినట్టు చేసుకుపోతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు. ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతల సిఫార్సులకు అగ్రతాంబూలం వేయాల్సిన అనివార్య పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, గృహనిర్మాణాలు, బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరవ్వాలన్నా పార్టీ నేతల సిఫార్సులు తప్పడం లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన అర్హత పార్టీ నేతల ఆమోదముద్రే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల ఎంపిక దగ్గర నుంచి పంపిణీ వరకు అడుగడుగునా జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇటీవల ముగిసిన జన్మభూమి కార్యక్రమంలో ప్రతి చోటా వారి పెత్తనమే కనిపించడంతో ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదురైంది. ప్రజాగ్రహంతో తమకు పని లేదన్నట్టుగానే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదిగో తాజా ఘటన... తాజాగా రెండు రోజుల కిందట కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశం తీరు ఆ పార్టీ నేతల వ్యవహారశైలికి అద్దంపడుతోంది. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాపు, బీసీ రుణాలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది ప్రభుత్వ కార్యక్రమం. కానీ మొత్తం కార్యక్రమాన్ని పార్టీ నేతలే నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీడీవో విశ్వనాథరెడ్డి వేదికపై ఉన్నా ఎప్పటి మాదిరిగానే పెత్తనమంతా ఎమ్మెల్యే భర్త, టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్తిబాబుదే. సత్తిబాబుతోపాటు ఆ మండల ఎంపీపీ, జడ్పీటీసీలు పుల్లా సుధ, కాకరపల్లి సత్యవతి భర్తలు చందు, చలపతిరావులు పెత్తనం చెలాయించడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోను దాదాపు ఇదే ఒరవడిని పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలైనా, పనుల కాంట్రాక్ట్లైనా, అధికారులు బదిలీలైనా పెత్తనమంతా వారిదే. చివరకు శిలాఫలకాలపై వారి పేర్లు లేకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించే ధైర్యం అక్కడి అధికారులకు లేనేలేదు. ఈæ నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం లేకుండా నామ్కేవాస్తే అన్నట్టుగా మార్చేశారని నియోజకవర్గ ప్రజలు ఆక్షేపిస్తున్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలకు పోయే అధికార పార్టీ నేతలు మహిళా ఎమ్మెల్యేతోపాటు మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చోటా అంతే... జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న కొత్తపేట, తుని, రంపచోడవరం నియోజకవర్గాల్లో వారిని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. కొత్తపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని కాదని పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSఛార్జి బండారు సత్యానందరావుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలమూరు మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు మైక్‌ను లాగేసుకుని దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. తుని నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కాదని పార్టీ నేతలే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అక్కడ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెత్తనమంతా తమ్ముళ్లదే. మిగిలిన నియోజకవర్గాల్లోను దాదాపు ఇదేరకంగా పార్టీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. -
ట్రై చేయ్, బొక్కలిరుగుతయ్!
కరాచి: ‘మమ్మల్ని కొడతారా? ట్రై చేయండి!’ అంటూ పాకిస్తాన్ మగవలు తమ భర్తలకు సవాల్ విసురుతున్నారు. భర్తలు చెప్పిన దుస్తులు ధరించకపోయినా, సెక్స్ కోరిక తీర్చకపోయినా భార్యలను స్వల్పంగా కొట్టే అధికారాన్ని భర్తలకు కట్టబెడుతూ పాకిస్తాన్లో రాజ్యాంగాధికారంగల ఇస్లాం సైద్ధాంతిక మండలి (సీఐఐ) గత వారం ఓ బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లుపై మహిళలు మండిపడుతున్నా బయటకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేక పోయారు. దీంతో వారి అభిప్రాయాల వ్యక్తీకరణకు ఓ వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఫహద్ రాజ్పర్ అనే ఓ ఫొటోగ్రాఫర్ ‘ట్రైబీటింగ్మీలైట్లీ’ పేరిట ఫేస్బుక్లో ఓ ఉద్యమాన్ని ప్రారంభించగా పాకిస్తాన్ మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ‘నన్ను కొట్టేందుకు ప్రయత్నించు. నీ బొక్కలిరక్కొడతా.....బొక్కల్లో సున్నం లేకుండా చేస్తా.....రేపు సూర్యోదయం ఎలా ఉంటుందో కూడా చూడలేవు. మక్కెలిరగకొడతా, ఏ ముల్లా వచ్చి నిన్ను రక్షించలేరు.....నా ఏడేళ్ల కారు డ్రైవింగ్ అనుభవాన్ని ఉపయోగించి నీ మీదుగా కారు తోలుతా.....చేయి ఎత్తితే దాన్ని ఇరక్కొట్టి అల్లాకే వదిలేస్తా.....నీ మాంసం వండుకు తింటా.....చూస్తుండు, మరుగుజ్జు అయిపోతావ్.....కనీసం కొట్టాలని ఆలోచించినా పక్కటెముకలు విరుగుతయ్...’ అంటూ పాకిస్తాన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తమ కామెంట్లతోపాటు ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. తీవ్రంగా స్పందించిన వారిలో డిజిటల్ స్టోరీ టెల్లర్ అదికా లాల్వాని, ట్రావెల్ అండ్ లైఫ్‌సై్టల్ బ్లాగర్ అంబర్ జుల్ఫికర్, డిజిటల్ మార్కటర్ ప్రియాంక ఫహూజ, సోషల్ మీడియా మేనేజర్ సుంబుల్ ఉస్మాన్, డాక్టర్ షగుఫ్తా, షంశేర్, రొహన్నే, ప్యాక్పిక్స్ తదితరులు ఉన్నారు. -
'భార్యలను కొట్టొచ్చు.. కొంచెం మెల్లగా'
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ మతపరమైన సంస్థ.. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో పొందుపరచిన పలు అంశాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) అనే సంస్థ ఇటీవల పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం మహిళల రక్షణకు చేసిన పీపీడబ్ల్యూఏ చట్టం సరిగా లేదని దానిస్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో మహిళలను అవసరమైతే భర్తలు కొట్టొచ్చు.. కాకపోతే కొంచెం మెల్లగా కొట్టాలంటూ సూచించింది. అంతే కాదు ఏ ఏ సందర్భాల్లో కొట్టొచ్చో సవివరంగా నివేదికలో పేర్కొంది సీఐఐ. దీనిలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే.. భర్త చెప్పిన మాటను లెక్కచేయకుండా భార్య ప్రవర్తించినప్పుడు, భర్త చెప్పిన విధంగానే డ్రెస్ చేసుకోనప్పుడు, బురఖా ధరించనప్పుడు, అపరిచితులతో మాట్లాడినప్పుడు ఇలా పలు సందర్భాల్లో భార్యను మెల్లగా కొట్టొచ్చు అంటూ ఆ నివేదికలో పేర్కోంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ తరువాత కో ఎడ్యుకేషన్ ఉండరాదని, నర్సులు పురుష పేషంట్లకు చికిత్స చేయొద్దని ఇలా పలు అంశాలతో కూడిన నివేదిక త్వరలోనే పంజాబ్ అంసెంబ్లీలో చర్చకు రానుంది. -
భార్యా బాధితుల సంఘం కేలండర్ విడుదల
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్న భార్యా బాధితుల సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ‘ఏకం అవ్వండి.. ఏకం అవ్వండి.. ఓ భార్యా బాధితులారా’ అనే నినాదంతో కేలెండర్‌ను తాడేపల్లిగూడెంలో శుక్రవారం విడుదల చేసింది. సంఘం అధ్యక్షుడు జి.బాలాజీ వీటిని స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 498 (9), గృహ హింస కేసుల వల్ల బాధలు పడే భర్తలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతున్నారని, అలాంటి వారు మరో జీవితం పొందడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘాన్ని జాతీయ స్థాయిలో రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. న్యాయపరమైన సలహాలు, సెక్షన్ల గురించి క్యాలెండర్ వెనుక భాగంలో పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
తల్లడిల్లుతున్న తల్లులు
-
యముళ్లైన మొగుళ్లు..
మూడు ముళ్లు.. ఏడడుగులు.. అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు.. నీటి మూటలే అవుతున్నాయి. సంసార సాగరంలో చిన్నపాటి ఒడిదుడుకులకే సహనం కోల్పోతున్నారు. కడదాక కంటికి రెప్పలా కాపాడుకుంటాడనుకున్న భర్తే, భార్యాపిల్లల పాలిట యమకింకరుడవుతున్నాడు. నగరంలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు పలువురిని కలచివేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో, బయట భార్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భర్తదేనని ఇటీవల ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే రక్షణ సంగతి దేవుడెరుగు కట్టుకున్న భర్తలే భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అందంగా లేవని ఒకరు, అనుమానంతో మరొకరు, సట్టా ఆడొద్దనందుకు మనస్పర్థలతో.. ఇలా చిన్న చిన్న కారణాలతో భార్యలను అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతాలు పలువురిని కలిచివేశాయి. మరోపక్క భర్తలు పెట్టే బాధలు భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. సంసార సాగరంలో చిన్నిచిన్న సమస్యలను సర్థుకుపోవాల్సిన చోట పంతాలకు పోయి, ప్రాణాల మీదకుతెచ్చుకుంటున్నారు. ఈ నెలలో నగరంలో ఏడు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఘోర ఉదంతాలు ఇలా.. సట్టా ఆడవద్దన్నందుకు.. తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నకమేళాకు చెందిన నర్సింగ్‌రావు, తార దంపతులు. సట్టాకు బానిసైన నర్సింగ్రావును తార మందలించింది. ఈ పాపానికి ఈ నెల 5వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన నర్సింగ్‌రావు భార్యతో గొడవపడి ఉరివేసి చంపేశాడు. ప్రస్తుతం అతడు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. మనస్పర్థలతో.. భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జహంగీర్‌నగర్‌కు చెందిన సయ్యద్ జాఫర్(35), నజియా బేగం (32) దంపతుల మధ్య చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఆవేశానికిలోనైన జాఫర్ ఈ నెల 10వ తేదీన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందంగా లేదని.. గాజులరామారానికి చెందిన ఎజాస్ (22),మోసిన్ (19)లకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. భార్య అందంగా లేదని చీటికిమాటికి ఆమెతో గొడవపడేవాడు. ఈ నెల 16వ తేదీన కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగి మోసిన్ గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం ఎజాస్ జైలులో ఉన్నాడు. అనుమానంతో.. గుండ్లపోచంపల్లికి చెందిన కనకవ్వ (30), నర్సింహ (36) దంపతులు. భార్యపై అనుమానంతో నర్సింహ ఈ నెల 19న ఆమెతో గొడవపడి కొట్టి హ తమార్చాడు. ప్రస్తుతం నర్సింహ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. అత్తింటి వేధింపులతో.. అత్తింటి వేధింపులు భరించలేక గాంధీనగర్‌కు చెందిన స్వప్న (24) తన కూతురు శాన్వీ (20 నెలలు)తో కలిసి ఈ నెల 13న ఘట్కేసర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. భార్యపై కోపంతో.. భార్యపై కోపంతో ఓ ప్రొఫెసర్ తన ఇద్దరు పిల్లలను దారుణంగా నరికి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్వాల్‌కు చెందిన గురుప్రసాద్, సుహాసిని దంపతుల విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది. భార్యపై ఉన్న కోపంతో గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (09), నందవిహారి (05)లను ఈ నెల 6న కిరాతకంగా చంపి, తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త వేధింపులు భరించలేక.. ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్, కవిత (40) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18) భావన (16) ఉన్నారు. ఆస్తి వివాదంలో భర్త వేధింపులు భరించలేని కవిత శుక్రవారం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వైష్ణవి, భావన మృతి చెందారు. కవిత పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపకండి దంపతుల గొడవల మధ్య క్షణికావేశంలో పిల్లలను చంపడం సమంజసం కాదు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే సంసారం కలకాలం సుఖ సంతోషాలతో ఉంటుంది. -అనురాధారావు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు బంధం బలహీనపడటంతోనే.. దంపతులు ఒకరి నొకరు అర్థం చేసుకోవాల్సింది పోయి ఎవరికి వారు పంతాలకు పోతున్నారు. వీటికి కొన్ని టీవీ సీరియళ్లు కూడా తోడవుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన దాంపత్య జీవితం అనుమానాలు, అసూయతో గొడవలు, విడాకులు, ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తోంది. మనుషుల మధ్య తగ్గిన నమ్మకం, పెరిగిన అనుమానాలే ఇందుకు కారణం. -డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, సైక్రియాటిస్ట్ -
ఆవేశంతో ఒకరు, అనుమానంతో మరొకరు...
ఆవేశంతో ఒకరు, అదనపు కట్నం కోసం మరొకరు, అనుమానంతో ఇంకొకరు.. సమస్య ఏదైనా చివరికి కట్టుకున్న భార్య కడతేరిపోతుంది. నిండునూరేళ్లు సాగాల్సిన సంసారంలో కలతల కారణంగా అనేకమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాగినమైకంలో భార్య తలపై రోకలి బండతో కొట్టిచంపాడు ఓ దుర్మార్గుడు. ఆవేశంతో కట్టుకున్న దాన్ని కడతేర్చాడు మరో కసాయి. ఈ విధంగా భార్యలను భర్తలు హత్యలు చేయడం ఎక్కువైపోతోంది. కుటుంబ గొడవల్లో అధికంగా భార్యలే బలవుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరుకు చెందిన సరితతో కర్ణాటక రాష్ట్రం బోడేపల్లికి చెందిన మునియప్పకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. తరచూ గొడవలు పడుతున్న వీరికి పెద్దలు పలుమార్లు సర్దిచెప్పారు. అయినా తీరుమారలేదు. మునియప్ప తాగుడు మానలేదు.ఈ నేపథ్యంలో పీకల దాకా తాగివచ్చిన మునియప్ప భార్య సరితతో గొడవపడ్డాడు. తాగినమైకంలో పక్కనే ఉన్న రోకలిబండతో సరిత తలపై కొట్టి చంపేశాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ గొడవల కారణంగా కట్టుకున్నోడి చేతిలోనే భార్య కన్నుమూసింది. డ్రైవర్స్ కాలనీకి చెందిన పులిమి శ్రీనుకు శివరామపురానికి చెందిన రాజేశ్వరితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీను భార్య రాజేశ్వరితో గొడవపడి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఇక హైదరాబాద్ పాతబస్తీ రెయిన్బజార్లోని హఫీజ్‌నగర్‌లో ఇటువంటి సంఘటనే జరిగింది. సంసారంలో చెలరేగిన గొడవల్లో ఆవేశానికి గురైన భర్త సయ్యద్ జఫర్ భార్య నాజియ బేగంను రోకలి బండతో మోదాడు. ఆ తర్వాత సయ్యద్ జఫర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతుల మరణంతో వీరి నలుగురు పిల్లలు రోడ్డున పడ్డారు. ఇటువంటి ఘటనలలో మహిళలు ప్రాణాలు కోల్పోతుంటే, వారి పిల్లలు దిక్కులేనివారవుతున్నారు. వారి ఆలనాపాలన చూసేవారులేక, వారు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ** -
మా ఆయనే ఉంటే మీ పింఛన్ ఎవరికి కావాలి ?
శెట్టూరు : ‘మాకు భర్తలు ఉండి ఉంటే మీరిచ్చే వెయ్యి రూపాయలకు ఆశ పడేవారమా..’ అంటూ మండలంలోని చెర్లోపల్లి, మాలేపల్లికి చెందిన వితంతువులు అధికారులను నిలదీశారు. తమకు భర్తలు ఉన్నారంటూ వితంతు పింఛన్లు తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మా భర్తలు బతికి ఉంటే చూపించండి అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం చెర్లోపల్లి గ్రామంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ పరిధిలో దాదాపు 60 మంది వితంతువుల పింఛన్లను జాబితా నుంచి తొలగించారు. బాధిత వితంతువులు తిప్పమ్మ, శ్రీకాంతమ్మ, లక్ష్మక్క, సిద్దమ్మ, అనసూయమ్మ తదితరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ పింఛన్లు ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భర్త బతికున్నందున వితంతు పింఛన్‌కు అనర్హులుగా భావిస్తూ తీసేశారని అధికారులు సమాధానమిచ్చారు. తహశీల్దార్ వాణిశ్రీ మాట్లాడుతూ పింఛన్ రద్దయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. దీనికి శాంతించని బాధితులు మాకు మీరిచ్చే పింఛన్ వద్దు.. మా భర్తలు బతికే ఉంటే తెచ్చివ్వండి అంటూ బాధితులు నిలదీశారు. మీ నీచ నికృష్ట విధానాల వల్ల మాలాంటి వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. గ్రామ రాజకీయాలకు అర్హులైన తమను బలి చేయడం తగదన్నారు. రెండు గ్రామాల పరిధిలో 240 పింఛన్లను ఎందుకు తొలగించారో తెలియజేయాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆనందప్ప, గంగప్ప, హుస్సేన్‌పీరా, నాయకులు మల్లేశప్ప, ప్రకాష్, శేఖర్, తిమ్మప్ప, గోవిందప్ప, హనుమంతరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తిమ్మరాజు పట్టుబట్టారు. అర్హుల జాబితాను కూడా చదివి వినిపించాలని డిమాండ్ చేశారు. వేరేదారి లేక చివరకు అధికారులు జాబితా చదివారు. అందులో అర్హులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగులను కుట్రపూరితంగానే తొలగించారని భావించిన బాధితులు గొడవకు దిగారు. దీంతో స్పెషలాఫీసర్ రామసుబ్బయ్య జోక్యం చేసుకుని అర్హులందరికీ పింఛన్ మంజూరు చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివయ్య, ఏఓ వాసుకీరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, ఎంపీపీ మానస, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సునీత, ఓబులమ్మ, విద్యుత్ ఏఈ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జోక్స్: పార్కులో షాక్
ఓ జంట పార్కుకు వెళ్లింది. ఆ భార్యభర్తల మధ్య సంభాషణ ఇది. భార్య: చూశారా అక్కడ తాగుతూ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా అతనెవరో తెలుసా? భర్త: ఎవరు ? భార్య: నన్ను ప్రేమిస్తే రిజెక్ట్ చేశాను. అందుకని పదేళ్లుగా తాగుతున్నాడు. భర్త: ఎంత మంచి కారణం అయితే మాత్రం పదేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకోవాలా? చీమలంటే భయం సురేఖ: ఎందుకు మీ ఆయన చీమల్ని చూస్తే చాలు హడలిపోతున్నాడు భార్గవి: నిన్నే షుగర్ టెస్ట్ చేయిస్తే షుగర్ ఉందని తెలిసిందట. ఆ చోటు కూడా లేదు అప్పు: అంత ఆపసోపాలు పడుతున్నావేంటి! పప్పు: ఏం లేదబ్బా, ఇపుడే పెళ్లి భోజనం ఫుల్లుగా తిన్నాను. అరక్క! అప్పు: ఓ టాబ్లెట్ వేసుకోలేకపోయావా? పప్పు: ఆ మాత్రం చోటుంటే ఇంకో స్వీటు తినేవాడిని కదా! ఓర్నీ! మొదటి హీరోయిన్: నిన్న షూటింగ్ ముగిసేసరికి ఆలస్యమైంది. రాత్రిపూట నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కొందరు తాగుబోతులు కారుకు అడ్డంపడ్డారు. ఆగి హారన్ కొడితే పక్కకు పోకుండా నన్ను కార్లోంచి కిందకు లాగి మీద పడబోయారు. వెంటనే తెలివిగా ఆలోచించి తప్పించుకున్నాను... అని పక్కనున్న హీరోయిన్‌కు ఓ హీరోయిన్ చెబుతోంది. రెండో హీరోయిన్: మరి ఏం చేశావు? మొదటి హీరోయిన్: మేకప్ మొత్తం చెరిపేసుకున్నా. భలే భార్యలు జీవన్: మా ఆవిడ ఏ విషయాన్నయినా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతుంది నవీన్: మా ఆవిడయితే ఫ్రిజ్, టీవీ, కూలర్ అన్నీ పగలగొట్టి మరీ చెబుతుంది. -
భార్యాభర్తలు తెలుసుకోవలసిన నిజాలు!
పెళ్లి చేసుకోబోయేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. ఇవి చేదు నిజాలైనా భయపడవలసిన పనేమీలేదు. అయితే ఈ నిజాలు తెలుసుకోవడం అందరికీ మంచిది. ముఖ్యంగా మగవారు తెలుసుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. చీటికిమాటికీ ఆత్మహత్యలు చేసుకోవడం ఇప్పుడు పరిపాటైపోయింది. చిన్నచిన్న సంఘటనలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మనం వింటూ ఉంటాం. చిన్న కారణం అయినా కొంతమంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు ఇక్కడ మన ప్రధాన అంశం ఆత్మహత్యలు. అందులో భార్యాభర్తల ఆత్మహత్యలు. భార్యాభర్తలలో ఎవరు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసుకోవడం. ఎక్కువగా భర్తలే ఆత్మహత్యలు చేసుకుంటున్న నిజాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్ సిఆర్ బి) గణాంకాల ద్వారానే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో భార్యలు గానీ, భర్తలు గానీ సుమారు లక్ష మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో భార్యలు 31వేల 921 మంది ఉన్నారు. భర్తలు 63 వేల 343 మంది ఉన్నారు. అంటే భర్తలే అధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తేలింది. ఇక విడాకులు తీసుకున్న భార్యా భర్తల ఆత్మహత్యలను పరిశీలిస్తే, అందులోనూ భర్తల ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. భార్యలు 1,240 మంది ఆత్మహత్యలు చేసుకోగా, భర్తలు 2,043 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్న వారిలోనూ భర్తలే ఎక్కువ మంది ఉన్నారు. మహిళలకంటే పురుషులే సున్నితంగా మారుతున్నారు. అందులోనూ ముఖ్యంగా భర్తలు కుటుంబ సమస్యలకు తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా బాధ ఉంటే మహిళలు వెళ్లగక్కేస్తారని. లేదా పెద్దల సలహాలు తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా కావాలంటే మహిళలు చట్టాలను ఆశ్రయిస్తారు. అంతేకాకుండా వారికి సమాజపరంగా, కుటుంబ పరంగా అందరి ఆదరణ, మద్దతు లభిస్తోంది. భర్తల విషయంలో మాత్రం అందుకు రివర్స్. భర్తలు తమ సమస్యలను బయటకు చెప్పుకోలేరు. బాధలకు తట్టకోలేరు. కోపాన్ని, ఉద్రేకాన్ని, ఆందోళనను, ఒత్తిడిని అణుచుకుని మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలుపుతున్నారు. అమ్మ, నాన్న కలసి ఉంటేనే కుటుంబం. ఎవరు లేకపోయినా దాని ప్రభావం పిల్లలపై పడుతుంది. ముఖ్యంగా వారు విడిపోతే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భార్యభర్తలు విడిపోయి కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ... లాగా ఉంటే అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లి దగ్గర ఉండే పిల్లలు తండ్రిని కలవలేరు. తండ్రి దగ్గర ఉండే పిల్లలు తల్లిని కలవలేరు. ఆ పరిస్థితులలో పిల్లలు తీవ్ర మానసిక వత్తిడికి గురవుతారు. ఏది ఏమైనా ఈ ఆత్మహత్యల గణాంకాలు మగవారు జాగ్రత్తగా ఉండాలని, మానసికంగా దృఢంగా ఉండాలని తెలియజేస్తున్నాయి.