తుమ్మపాల (అనకాపల్లి): ప్రజాప్రతినిధులైన తమ భార్యల తరఫున అధికార పార్టీ నేతలు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. అనకాపల్లి మండలంలో జరుగుతున్న సభలకు ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి తరఫున ఆమె భర్త శ్రీను హాజరై ప్రసంగాలు చేస్తున్నారు. అదే కోవలో గ్రామాలలో జరుగుతున్న సభలకు మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీల తరఫున వారి భర్తలు పాల్గొంటూ హంగామా చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. జన్మభూమి సభలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ అధికారుల పక్కనే సూపర్ సర్పంచ్‌లు, సూపర్ ఎంపీటీసీలు కూర్చుని అజమాయిషీ చేస్తున్నారు. రేబాకలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలో కొందరు మరుగుదొడ్ల బిల్లుల గురించి ప్రశ్నించగా.. సర్పంచ్ భర్త సత్తిబాబు కలుగజేసుకొని మరీ పాత వాటికి బిల్లులు చెల్లించరని చెప్పేశారు. కాపుశెట్టివానిపాలెం గ్రామానికి ఒక వ్యక్తి ఇదే సమస్యపై ప్రశ్నించగా ఎంపీటీసీ భర్త చిన్నారావు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment