
భర్తకు ఏసీకి మధ్య సంబంధమేంటి?
భర్తకు, ఇంట్లోని ఏసీకి ఏదైనా సారూప్యత ఉందని ఎప్పుడైనా భావించారా? భర్తకు, ఏసీకి ఏం పోలిక అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రస్తుత ట్విట్టర్ కింగ్, ఒకప్పటి ఫైర్‌బ్రాండ్ బ్యాట్స్‌మన్ వీరందర్ సెహ్వాగ్ మాత్రం ఓ పోలిక పెట్టాడు. ఎండలు మండుతున్న నేపథ్యంలో భర్తకు, స్పిల్ట్ ఏసీకి పోలిక పెట్టి తనదైన స్టైల్‌లో ట్విట్టర్‌కు కితకితలు పెట్టాడు. ఈ ట్వీట్‌ను ఇప్పటికే 6,800 మంది లైక్ చేశారు. వెయ్యికిపైగా మంది రీట్వీట్ చేశారు. ఇంతకూ ఆయన ఏమన్నాడంటే..
'భర్త పరిస్థితి స్పిల్ట్ ఏసీలాంటిందే. బయట ఎంత లొల్లి అయినా చేయని ఇల్లును మాత్రం కూల్‌గా, నిశ్శబ్దంగా, రిమోట్ కంట్రోల్డ్‌గా ఉంచాల్సిందే' అని ఛలోక్తి విసిరాడు. అంతేకాదండోయ్ భార్య ఆర్తితో దిగిన ఫొటోను ఈ ట్వీట్‌కు జోడించాడు. సెహ్వాగ్ జోక్ వేస్తే గొల్లుమని నవ్వకుండా ట్విట్టర్ ఉండగలదా! అందుకే వాటే డెఫినేషన్ ఆఫ్ హస్బెండ్, పాజీ' అంటూ సెహ్వాగ్ ట్వీట్‌కు నెటిజనులు నీరాజనాలు పడుతున్నారు.
Husband condition is like Split AC. How much ever noise outside , inside the house cool,silent and remote controlled.
— Virender Sehwag (@virendersehwag) April 14, 2017
Shaant,shushil pati. pic.twitter.com/f80oWkaQSz