అహ్మదాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా టీమిండియా సిరీస్ విజయం దక్కించుకోగానే ఇంగ్లండ్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేస్తూ అదిరిపోయో రీతిలో పంచ్ ఇచ్చాడు. మ్యాచ ముగిసిన తర్వాత సెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెదడు ఫోటోను షేర్ చేశాడు. '' టీమిండియా అద్భుత విజయానికి ఇవే నా శుభాకాంక్షలు.. ఇంగ్లండ్ జట్టు వారి మెదుడును అహ్మదాబాద్‌లో మాత్రమే పొగొట్టుకోలేదు... మొత్తానికే కోల్పోయారు' అంటూ కామెంట్ చేశాడు.
సెహ్వాగ్ పెట్టిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. నాలుగు టెస్టుల సిరీస్ మొదలైనప్పటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ మినహాయించి మిగిలిన మ్యాచ్‌లు ఓడిపోయిన ప్రతీసారి ఇంగ్లండ్ మాజీలు టీమిండియాను, ఇక్కడి పిచ్‌లను విమర్శలు చేసేవారు. ఇంగ్లండ్ మాజీలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఫన్నీ పోస్టుతో పంచ్ ఇచ్చాడు. ఈ ఫోటో చూసిన వారంతా సెహ్వాగ్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు.
కాగా మ్యాచ్‌లో కాగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించి సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా 13వ సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు.. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి:
35 బంతులు.. 80 పరుగులు..
వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు
Congratulations Team India on an awesome Test Series victory.
— Virender Sehwag (@virendersehwag) March 6, 2021
England didn't lose it in Ahmedabad.
They lost it here .#INDvsENG pic.twitter.com/NXb1AxCHen
Comments
Please login to add a commentAdd a comment