అందమైన జీవిత రహస్యం చెప్పిన సెహ్వాగ్‌  | Virendra Sehwag Defines Very Beautiful Life | Sakshi
Sakshi News home page

అందమైన జీవిత రహస్యం చెప్పిన సెహ్వాగ్‌ 

Published Wed, Jun 24 2020 8:18 AM | Last Updated on Wed, Jun 24 2020 8:22 AM

Virendra Sehwag Defines Very Beautiful Life - Sakshi

సెహ్వాగ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటో

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ అందమైన జీవితానికి రహస్యం చెప్పారు. అమాయకత్వం, ప్రేమ, చిన్న చిన్న విషయాలను ఆస్వాదించగలగటమే అందమైన జీవితానికి నిజమైన అర్థం అంటున్నారు. బుధవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘  తన కూతురికి కొత్త బట్టలు కానుకగా ఇచ్చి.. కొత్త బట్టల్లో ఉన్న కూతురి ఫొటో తీయటం అన్నది ఓ తండ్రి జీవితంలో అత్యంత విలువైనది. అమాయకత్వం, ప్రేమ, చిన్న చిన్న విషయాలను ఆస్వాదించటం = ఓ అందమైన జీవితం ’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఫొటో ఆఫ్‌ ది డే.. నిజం పాజీ.. అద్భుతమైన క్షణం.. మనసును హత్తుకునే చిత్రం.. మాటల్లో చెప్పటానికి వీలుకానిది.. సంతోషం చిన్నచిన్న విషయాల్లోనే ఉంటుంది. పిల్లల పెదాలపై చిరునవ్వు తేవటానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ( వీరు.. ఆసనం పేరేంటో చెప్పవా? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement