సాక్షి, హైదరాబాద్ : కేరళలో సంచలనం కలిగించిన ఆదివాసి మధు హత్య కేసుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కేజీ బియ్యం దొంగతనం చేశాడని దాడిచేసిన ఉబైద్, అబ్దుల్ కరీం, హుస్సేన్‌లు మధు మరణానికి కారణం అయ్యారంటూ తన ట్విటర్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. ఇది ఆధునిక సమాజంలో జరిగిన అవమానకరమైన సంఘటనగా అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని సెహ్వాగ్ అన్నాడు. కేరళలో తినుబండారాలు దొంగిలించాడని ఒక 27 ఏళ్ల మతిస్థిమితం లేని ఆదివాసిని స్థానికులు దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పలు మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
Madhu stole 1 kg rice. A mob of Ubaid , Hussain and Abdul Kareem lynched the poor tribal man to death. This is a disgrace to a civilised society and I feel ashamed that this happens and kuch farak nahi padta. pic.twitter.com/LXSnjY6sF0
— Virender Sehwag (@virendersehwag) February 24, 2018
Comments
Please login to add a commentAdd a comment