సాక్షి, ప్రత్యేకం : సోషల్‌మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్లను చేసే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శనివారం చేసిన ఓ ట్వీట్ అభిమానులను అయోమయంలో పడేసింది. గౌతమ్ గంభీర్ పుట్టిన రోజు సందర్భంగా ‘జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా.’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
సెహ్వాగ్ ట్వీట్‌కు స్పందించిన గంభీర్.. ’శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నా’ అంటూ రీట్వీట్ చేశారు. అంతే ఒక్కసారిగా అభిమానులు ‘సెహ్వాగ్ మీకు ఏమైందంటూ’ రీట్వీట్లతో గగ్గోలు పెట్టడం ప్రారంభించారు.
ఎప్పుడే ప్రత్యేక శైలిలో ట్వీట్లు చేస్తూ అలరించే మీరు కామన్ ట్వీట్ ఎందుకు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొందరు మీకు, గంభీర్‌కు మధ్య ఏదైనా సమస్యా? అని అడిగారు. ప్రపంచంలోని విధ్వంసకర ఓపెనింగ్ జోడీల్లో సెహ్వాగ్-గంభీర్‌ల జోడీ కూడా ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment