అదృశ్యమైన తల్లీకూతుళ్లు శవాలయ్యారు | mother, daughter killed by husbands | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన తల్లీకూతుళ్లు శవాలయ్యారు

Jan 20 2018 3:32 PM | Updated on Nov 6 2018 8:50 PM

సాక్షి, పోలవరం: ఏడాది క్రితంనాటి తల్లీకూతుళ్ల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు(19)లు తల్లీ కూతుళ్లు. వీరు గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుండి కనబడకుండా పోయారు. ఈ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ నుంచి ఎర్రాయగూడెం వెళ్లే రహదారి పక్కన జీడిమామిడి తోటలో వీరి శవాలను కనుగొన్నారు. తల్లీకూతుళ్ళను హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement