disappeared
-
తారను మాయం చేయనున్న జాబిల్లి
అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది. భూమి నుంచి 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైకా నీలం, తెలుపు కాంతులతో వెలిగిపోతూంటుంది. భూమి నుంచి నేరుగా చూడగలిగిన అతి పెద్ద నక్షత్రాల్లో ఇదొకటి. అంతరిక్ష వింతలపై ఆసక్తి ఉన్నవారిని నవంబర్ నెలలో మరో మూడు ఘట్టాలు ఊరిస్తున్నాయి. బృహస్పతి, శని, అంగారక గ్రహాలు రాత్రిపూట ఎంచక్కా దర్శనమివ్వనున్నాయి. అవి భూమికి సమీపంగా వస్తాయని టెలిస్కోపు లేకున్నా బైనాక్యులర్లతో వాటిని స్పష్టంగా చూడొచ్చని నాసా పరిశోధకులు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిడ్డా... ఏడున్నావ్!
రాజంపేట: ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు... ఉన్నత విద్యను అభ్యసించాడు... క్యాంపస్ సెలక్షన్స్‌లోనే మంచి ఉద్యోగం పొందాడు... అంతలోనే అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. రెండేళ్లుగా అతను ఎక్కడ ఉన్నాడో... ఏమయ్యాడో తెలియదు. అతని కోసం 2022 జూలై నుంచి తల్లిదండ్రులు ఎదరుచూస్తూ నిత్యం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి వేదన స్థానికులను సైతం కంటతడిపెట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... అన్నమయ్య జిల్లా రాజంపేటలోని విద్యుత్‌నగర్‌కు చెందిన పైడి సుబ్రహ్మణ్యం, లక్షమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శృతికి గత ఏడాది వివాహమైంది. కుమారుడు సు«దీర్ బెంగళూరులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ సెలక్షన్లో అక్కడే టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలో అతను రెండేళ్ల కిందట అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరులో సు«దీర్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు చేశారు. కానీ, ఇంతవరకు సుదీర్ జాడ తెలియలేదు.న్యూడ్ వీడియో వల్లే..! సుధీర్ వాట్సాప్‌లో న్యూడ్ వీడియో ముఠా ట్రాప్‌కు గురయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆర్ఐఎల్వైఏ ప్లస్ 1720–657–9633 నంబర్ నుంచి దుండుగులు సు«దీర్ న్యూడ్ ఫొటోను అతని అక్క శృతి ఫోన్‌కు వాట్సాప్‌లో 2022, జూలైలో పంపారు. వెంటనే శృతి తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన నంబర్‌కు కాల్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. సు«దీర్‌కు ఫోన్ చేయగా కట్‌చేశాడు. మళ్లీ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ‘తమ్ముడు నువ్వు భయపడవద్దు...’ అని సుదీర్‌కు శృతి మెసేజ్ పెట్టింది. అయినా తిరిగి అతని నుంచి సమాధానం లేదు. వెంటనే శృతి తన తండ్రితో కలిసి బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రూమ్మేట్స్ను విచారించగా, 2022 జూలై 26న ఫోన్లో మాట్లాడిన తర్వాత అతను బయటికి వెళ్లాడని, తిరిగిరాలేదని చెప్పారు. వీడియోను పంపించి బ్లాక్మెయిలర్స్ డబ్బు డిమాండ్ చేయడంతో సు«దీర్ అవమానంగా భావించి ఉంటాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా రెండేళ్లుగా అతీగతీ లేకపోవడంతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఎప్పటికైనా తమ కొడుకు తిరిగివస్తాడనే ఆశతో తెలిసిన ప్రతి చోట వెతుకుతున్నారు. తమ కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని మీడియా దృష్టికి కూడా తీసుకురాలేదని సుధీర్ తల్లిదండ్రులు కన్నీటిపర్యవంతమయ్యారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం..
మైసూరు: ఆర్థికంగా మోసం చేశారంటూ కుటుంబం మొత్తం కనిపించకుండా పోయిన సంఘటన ఎట్టకేలకు సుఖాంతమైంది. అదృశ్యమైన కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో బంధుమిత్రులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. మైసూరులోని కేజీ కొప్పలులోఉన్న మహేష్ (35), అతని భార్య భవాని (28), కుమార్తె ప్రేక్ష (3), తండ్రి మహదేవప్ప (65), తల్లి సుమిత్ర (53) జనవరి 20వ తేదీ నుంచి కనిపించకుండాపోయారు. మహేష్ తన స్నేహితుల మొబైల్‌కు వాయ్స్ మెసేజ్ చేసి ఏ బావిలోనో, చెరువులోనో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. భవాని సొదరుడు జగదీష్ సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. బెంగళూరులో మకాం అప్పటినుంచి బెంగళూరులోని స్నేహితుని ఇంటిలో తలదాచుకున్న మహేష్ కుటుంబం మైసూరుకు తిరిగి రావడంతో బంధువులు సంతోషపడ్డారు. మార్కెటింగ్ వ్యాపారం చేసే మహేష్ పూచీకత్తు ఇవ్వగా వీరేష్ అనే వ్యక్తి రూ. 35 లక్షల వరకూ అప్పులు చేశాడు. వీరేష్ పరారు కావడంతో రుణదాతలు మహేష్ చెల్లించాలని వెంటపడ్డారు. దీంతో వేధింపులను తట్టుకోలేక మహేష్ కుటుంబంతో సహా పరారు అయ్యాడు. కాగా, వారసత్వ నగరిలో ఇటీవలికాలంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. అప్పులు తీసుకుని చెల్లించలేదనే బాధతో మూడు రోజుల కిందట భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. అలాగే సైబర్ వంచకుల మోసాలు కూడా అధికమయ్యాయి. -
ఫిలింనగర్: ఉద్యోగం మానేశానని భర్తకు ఫోన్ చేసి .. ఇంట్లో నుంచి బయటకు
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని బాలరెడ్డినగర్‌లో నివసించే సాయి కృష్ణవేణి విప్రో సర్కిల్లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ నెల 1న తన భర్త ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేశానాని ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి ఫొన్ స్విచ్ఛాప్ చేసింది. ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. తన భార్య కనిపించడం లేదంటూ ప్రవీణ్ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..!
తిరువొత్తియూరు: ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెల్లారితే ముహూర్తం. బుధవారం సాయంత్రం రిసెప్షన్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు అదృశ్యం కావడంతో వరుడి బంధువులు వివాహం తాలూకు ఫ్లెక్సీలు చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై శివారు నగరం పూందమల్లి సమీపాన చెంబరంపాక్కంకు చెందిన యువకుడికి మధురాంతకం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. గురువారం ఉదయం నసరత్‌పేటలోని ఓ కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. బుధవారం సాయంత్రం ఆ కల్యాణ మండపంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు వరుడు వచ్చాడు. కానీ ఎంతసేపైనా వధువు, ఆమె బంధువులెవరూ రాకపోవడంతో వరుడు కంగారు పడ్డాడు. రిసెప్షన్‌కు రావడానికి గాను అలంకరణ నిమిత్తం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు ఉద్దేశపూర్వకంగా అదృశ్యమైందని, ఆమె కోసం ఆమె బంధువులు గాలిస్తున్నారని తెలుసుకున్న వరుడు, అతని బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. కల్యాణ మండపంలోని వివాహం తాలూకు ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారు. నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నసరత్‌పేట పోలీస్ స్టేషన్లో వరుడు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’ పొదల్లోకి ఈడ్చుకెళ్లి.. బండరాయితో -
బ్రేకింగ్: ఇండోనేషియా విమానం గల్లంతు
జకార్తా: ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ వెళ్తున్న ఎస్జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కలిపి మొత్తం 59 మంది ఉన్నట్లు తెలుస్తోంది.ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకర్నో హట్టా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమవడం కలకలం రేపుతోంది. అయితే ఆ విమానం ఓ ద్వీపంలో కూలిపోయి ఉంటుందని ఆ దేశానికి చెందిన మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండోనేషియా దేశంలో విమానయాలకు విషాద చరిత్ర ఉంది. 2018 అక్టోబర్ 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 189 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి. -
కావ్ కావ్ సేవ్ సేవ్
సాక్షి, హైదరాబాద్: ఇంటి ముందు ఉదయమే కాకులు కావ్‌కావ్‌మని అరిస్తే.. ‘బంధువులు వస్తారేమో’ అనడం కద్దు. నలుగురు కలిసి గోల చేస్తుంటే.. ‘ఏమిటా కాకిగోల’ అని.. తప్పుల తడకలెక్కలను ‘కాకిలెక్కల’ని ఎత్తి పొడుస్తారు. ఇరుగుపొరుగు నుంచి సూటిపోటి మాటలు ఎదురైతే.. ‘కాకుల్లా పొడుచుకుతింటున్నారు’ అంటారు. ‘ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు’.. ఇది పిసినారులను ఉద్దేశించి అనే మాట. నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ పరి స్థితుల్లో ఇలా కాకులతో ముడిపెట్టి మాట్లాడి, పోల్చే సందర్భాలెన్నో. పెంపుడు పక్షి కాకున్నా జనంతో నిత్యం మమేకమై మసిలే పక్షి కాకి. పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు అది కనిపించని క్షణం, ‘కావ్కావ్’మని వినిపించని శబ్దం ఉండవేమో. అయితే ఇదంతా గతం. క్షణం కాదుకదా ఇక రోజుల తరబడి కాకి కనిపించ దేమో. దసరా నాడు పాలపిట్ట దర్శనం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్టు భవిష్య త్తులో కాకిని చూడాలంటే.. వెతకాలేమో!. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నేళ్లలో నగరాలు, పట్ట ణాల్లో కాకులు కనిపించటమే గగనమంటోంది ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యా లయం పక్షి విభాగం జరిపిన ప్రాథమిక అధ్య యనం. ఈ విభాగం అధిపతి వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో త్వరలో దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరగనుంది. చంపేస్తున్న ఔషధ వ్యర్థాలు కాకులంటే చాలామందిలో ఏహ్య భావం ఉంటుంది. కానీ మనకు తెలియకుండా అవి చేస్తున్న మేలెంతో. చనిపోయిన జంతు కళేబరాలు వేగంగా మాయమయ్యేలా చేసి మనచుట్టూ అనారోగ్యకర వాతావరణం లేకుండా చేస్తాయివి. హిందువుల్లో చనిపోయిన వ్యక్తి కర్మకాండల్లో ‘కాకి ముట్టే’ తంతుకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడు కాకులు క్రమంగా తగ్గిపోవడానికి మనుషులే కారణమవుతుండటం విషాదం. నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పోగయ్యే వ్యర్థాలు కాకుల తిండిని విషతుల్యం చేస్తున్నాయి. ఆసుపత్రి వ్యర్థాలను నిజానికి శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాలి. ఖర్చు తగ్గించుకునేందుకు ఆసుపత్రుల నిర్వాహకులు వ్యర్థాలను నేరుగా చెత్తకుండీల్లో పారేస్తున్నారు. ఇటీవల ఇళ్లలోనూ మందుల వాడకం పెరిగింది. వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం తెచ్చుకున్న మందులను అవసరం తీరాక, నిల్వ ఉండి కాలం తీరిన ఔషధాలను చెత్తకుండీల్లో పడేస్తున్నారు. సాధారణంగా కాకులు తిండి కోసం చెత్తకుండీల వద్దకే ఎక్కువగా చేరుతుంటాయి. చెత్తలోంచి కావాల్సిన తిండిని ఏరుకుని తింటాయి. ఈ మందులు కలిసిన తిండి తిని అవి అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. కాకులు అంతరించేందుకు ఇది ప్రధాన కారణమవుతోంది. కాకి చావుకు కారణాలెన్నో! ఆసుపత్రి వ్యర్థాలు, పారేసిన ఔషధాలు కలిసిన తిండి తినడం వల్ల కొన్ని కాకులు చనిపోతుండగా ఆడ కాకుల్లో గుడ్లుపెట్టే సామర్థ్యం దెబ్బతింటోంది. ఫలితంగా వాటి సంతతి తగ్గిపోతోంది. ఇంకా కాకి చావుకు మరెన్నో కారణాలున్నాయంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌వర్మ. పక్షుల్లో కాకులు తెలివైనవి. ప్రమాదం పొంచి ఉన్నచోట అవి ఉండటానికి ఇష్టపడవు. నగరంలో పతంగులను ఎగురవేయడానికి ఉపయోగించే మాంజా దారం పలుచోట్ల చెట్లలో ఇరుక్కుపోతోంది. ఈ మాంజా ఉచ్చులో పడి చాలా కాకులు చనిపోతున్నాయి. ఒక కాకి చనిపోతే మిగతా కాకులు అక్కడ ఉండేందుకు ఇష్టపడవు. అందుకే నగరం కంటే, శివారు ప్రాంతాల్లో కాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఇళ్ల నుంచి చెత్తను తెచ్చి సమీపంలోని కుండీలో వేసేవారు. అందులోని తిండిని తిని కాకులు గడిపేవి. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి›మున్సిపల్ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఫలితంగా కుండీల్లో వాటికి తిండి కరువైంది. ఎత్తుగా ఉండే చెట్లపైనే కాకులు గూళ్లు పెట్టుకుంటాయి. అపార్ట్మెంట్ల నిర్మాణంతో ఇళ్ల ప్రాంగణాల్లో ఏపుగా ఉండే చెట్లు మాయమయ్యాయి. వీధుల్లోనూ పొడవాటి చెట్లు కనిపించట్లేదు. దీంతో గూళ్లకు అనువైన వాతావరణం వెదుక్కుంటూ కాకులు వెళ్లిపోతున్నాయి. కాకులకిది అత్యంత ప్రమాదకరస్థితి ఆసుపత్రులు, ఇళ్ల నుంచి వచ్చే మందుల వ్యర్థాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాకులు అంతరించేందుకిది కారణమయ్యేంత తీవ్రత నెలకొంది. ఫలితంగా ఐదారేళ్లుగా కాకుల సంఖ్య బాగా తగ్గిపోతోందని మా ప్రాథమిక అధ్యయనంలో తేలింది. త్వరలో మా బృందం పూర్తిస్థాయి అధ్యయనం ప్రారంభించనుంది. అందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. – వి.వాసుదేవరావు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త, పక్షి విభాగాధిపతి -
ఇవేంటో గుర్తుపట్టగలరా?
రైల్వేకోడూరు రూరల్: సాంకేతికతతో పురాతన పనిముట్లు కాల గమనంలో ఇమడలేక పోతున్నాయి.. ముఖ్యంగా నాడు ఆహార అవసరాలకు ఉపయోగించుకునే రోలు కుదేలయ్యింది.. తిరగలి(విసురురాయి) తిరగలేక కనుమరుగయ్యింది.. జాడీ(కాగులు) జాడలేకుండా పోయింది. నేడు మానవుడు కాలంతో పరిగెత్తుతూ ఆధునిక యంత్రాల మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. నాడు గ్రామాల్లోని ప్రతి ఇంటిలో ఒక రోలు ఉండేది. ఇంటి మధ్యలో రోలు ఏర్పాటు చేసుకునేవారు. ఆ రోలులో వివిధ రకాల పచ్చళ్లు నూరుకోవడం, పొడులు చేసుకునేవారు. అలాగే అక్కడక్కడా పెద్దవారి(పలుకుబడి ఉన్న) పెద్దపెద్ద రోళ్లను ఉపయోగించుకుని వడ్లు, కొర్రలు దంచుకునేవారు. నేడు మిక్సీలు రావడంతో పాత రోళ్లు మూలనపడ్డాయి. అయితే రోళ్లలో దంచుకుని తింటే ఆ రుచి భలేగుండేదని పెద్దలు గుర్తుచేసుకుంటున్నారు. అలాగే రైతులు పండించిన రాగులు, సజ్జలు తిరగలి(విసురురాయి) లో విసురుకుని పిండి చేసుకుని వాడేవారు. పిండి మిషను రాకతో తిరగలి కాస్త తిరగకుండా మూలనపడింది. మహిళలు తిరగలి వద్ద కూర్చుని పనిచేసుకుంటూ ఊరి ముచ్చట్లు పెట్టుకునేవారు. టీవీలు, మిక్సీలు రావడంతో అలాంటి వాతావరణం కాసింతయినా కానరాదు. నేటి తరం పిల్లలకు కూడా తిరగలి అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని జాడీలు (కాగులు)లో నిల్వ ఉంచేవారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకునేవారు. ఒక్కో కాగులో 80 సేర్లు నుంచి 120 సేర్ల వరకు వడ్లు నిల్వ చేసుకునే వారు. ఏదిఏమైనా పాత కాలంలోనే ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని పలువురు అంటున్నారు. -
కూతురుతో సహా సినీ నటి అదృశ్యం
సాక్షి, చెన్నై: కుమార్తెతో సహా సినీ నటి అదృశ్యం కావడంతో ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘చిన్న పూవే మేల్ల’ చిత్రం ద్వారా నర్మద వెండితెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో నటుడు రాంకీ, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 1987 విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నర్మద కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఆ ఒక్క చిత్రంతోనే నర్మద సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అనంతరం స్థానిక తారాపురంకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. అయితే నర్మద తన 15 ఏళ్ల కూతురుతో సహా కనిపించకపోవడంతో ఆమె భర్త బంధువులు పలుచోట్ల వారి కోసం గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో నర్మద భర్త గురువారం తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!) -
‘టిక్‌టాక్’ కలిపింది
మక్తల్/బిజినేపల్లి: పదమూడేళ్ల క్రితం అదృశ్యమైన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి టిక్‌టాక్ సాయంతో ఇంటికి చేరుకున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పెద్ద తండాకు చెందిన చంద్రు నాయక్ (45)కు మతిస్థిమితం సరిగా లేదు. ఈయనకు భార్య మారోనా, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చంద్రు 2007 సంవత్సరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చేరుకున్నాడు. అక్కడ గ్రామస్తులు చెప్పిన పని చేస్తూ వారు పెట్టింది తింటూ కాలం వెళ్లదీసేవాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన మ్యాకలి రామాంజనేయులు ఖాళీ సమయంలో సెల్ఫోన్లో తరచూ టిక్‌టాక్ షోలను చూసేవాడు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని సదరు వ్యక్తి ఫొటో తీసి అందులో పెట్టాడు. దీనిని పెద్దతండా వాసులు చూసి అదృశ్యమైన చంద్రునాయక్ అని గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించి శుక్రవారం గుడిగండ్లకు చేరుకున్నారు. అక్కడ చంద్రుని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి చంద్రును కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, తన భర్త చనిపోయాడని అనుకున్నానని భార్య మారోనా వాపోయింది. -
అదృశ్యమైన తల్లీకూతుళ్లు శవాలయ్యారు
సాక్షి, పోలవరం: ఏడాది క్రితంనాటి తల్లీకూతుళ్ల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు(19)లు తల్లీ కూతుళ్లు. వీరు గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుండి కనబడకుండా పోయారు. ఈ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ నుంచి ఎర్రాయగూడెం వెళ్లే రహదారి పక్కన జీడిమామిడి తోటలో వీరి శవాలను కనుగొన్నారు. తల్లీకూతుళ్ళను హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
రూరల్ పోలీస్ కనుమరుగు
కమిషనరేట్ పరిధిలో హన్మకొండ, వరంగల్ జిల్లాలు సీనియర్లకు కొత్త జిల్లాల బాధ్యతలు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో వరంగల్ రూరల్ పోలీసు విభాగం కనుమరుగు కానుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రూరల్ విభాగాన్ని తీసుకురావాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వరంగల్ పోలీస్ కమిషరేట్, వరంగల్ రూరల్ పోలీసు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సోమవారం డీజీపీ అనుగార్‌శర్మ వీడి యో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. వరంగల్ డీ ఐజీ రవివర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఇ తర పోలీసు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విస్తరించనున్న కమిషనరేట్ వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో వరంగల్ కమిషనరేట్, వరంగల్ రూరల్ పోలీసు విభాగాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న కమిషనరేట్ ప్రాంతా న్ని మినహాయించి మిగిలిన ప్రాంతాలకు రూరల్ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక భారంతో పాటు పాలన పరంగా చిక్కుముడులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. దీంతో రూరల్ ప్రాంతం మొత్తాన్ని కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్ స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్, క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. త్వరలో ఈ రెండు విభాగాలు కలిసిపోనున్నాయి. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలు ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. ఈ ఐదు మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి కూడా వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో విలీనం కానున్నాయి. పోలీసుశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం అమలైతే వరంగల్ రూరల్ పోలీసు విభాగం కనుమరుగు అవుతుంది. పోలీసు శాఖ తాజా నిర్ణయంతో వరంగల్ కమిషనరేట్ పరిధి విస్తరించనుంది. కమిషనరేట్ పరిధిలో 20 లక్షలకు పైగా జనాభా ఉంది. కొత్త స్టేషన్లు నాలుగు.. ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో కొత్తగా కాజీపేట, ఖిలావరంగల్, వేలేరు, చిల్పూరు, ఇల్లందకుంట, ఐనవోలు మండలాలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఖిలావరంగల్, కాజీపేట ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసు స్టేషన్లు ఉన్నాయి. దీంతో స్టేషన్లు లేని నాలుగు మండలాల్లో దసరా నాటికి కొత్త స్టేషన్లు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు బాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇవి ప్రారంభమైతే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మొత్తం 76 పోలీసు స్టేషన్లు వస్తాయి. ఎస్పీ క్యాంపునకు ఇబ్బందులు మహబూబాబాద్, జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలకు కొత్తగా పోలీసు శాఖ పరంగా ప్రత్యేక కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులకు సంబంధించిన భవనాల ఎంపిక, మౌలిక సదుపాయల కల్పనపై చర్చించారు. మహబూబాబాద్ ఎస్పీ ఆఫీసుగా ఐటీఐ భవనాన్ని, ఎస్పీ క్యాంపు ఆఫీసుగా పట్టణంలో ఓ అద్దె భవనాన్ని ఎంపిక చేశారు. ఇక జయశంకర్ జిల్లాలో మైనింగ్ ఓకేషనల్ సెంటర్ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చనున్నారు. ఎస్పీ క్యాంపు ఆఫీసుగా సింగరేణి అధికారులకు కేటాయించే ఎన్–ఏ టైపు క్వార్టర్‌ను ఇవ్వనున్నారు. సింగరేణి కమ్యూనిటీ హల్లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రెవెన్యూ అధికారులు ఇదే భవనం కోసం పట్టుబడుతున్నారు. పాలనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం ఎస్లాబ్లిష్మెంట్ విభాగంలో సీనియర్ సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. -
తిరుమల దర్శనానికి వెళ్లి.. యువతి అదృశ్యం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ఛత్రినాకకు చెందిన ఓ భక్తురాలు తిరుమల దర్శనానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఆమె ఆచూకీ కోసం తిరుమల పోలీసులతో పాటు ఛత్రినాక పోలీసులు కూడా వాకబు చేస్తున్నారు. ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన జాదవ్ నరేందర్, జె.రజని(24), రజనీ సోదరి అంబిక కలిసి ఈ నెల 3వ తేదీన తిరుమల తిరుపతికి వెళ్లారు. ఆర్యవైశ్య సమాజం సంఘంలో అద్దె రూం తీసుకున్న వీరు స్వామి దర్శనం చేసుకున్నారు. 4వ తేదీన ఉదయం అత్తతో ఫోన్ మాట్లాడుతానంటూ భర్తతో చెప్పి పక్కకు వెళ్లిన రజని ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో నరేందర్ తిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 0877-2289031, 9492926740 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
యువతి అదృశ్యం
కీసర : ఇంటి నుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందిందని సీఐ గురువారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన కాసర్ల ధనలక్ష్మి (19) నగరంలోని కోరంటి ఆస్పత్రిలో ఎంఎల్టీ కోర్సులో శిక్షణ తీసుకుంటోంది. కాగా ఈనెల 16న (బుధవారం) రోజు మాదిరే ఆస్పత్రికి వెళుతున్నట్లు ధనలక్ష్మీ ఇంటి నుంచి వెళ్లింది. గురువారం వరకు కూడా ధనలక్ష్మి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి రాజమల్లు కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
అదృశ్యమైన యువతి తెల్లారేసరికి..
హైదరాబాద్: అదృశ్యమైన ఓ యువతి మరుసటి రోజే అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించింది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు అంబర్ పేటకు చెందిన కమాలుద్దీన్ కూతురు మెహర్ ఉన్నీసాబేగం(25) శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ల్లి సాయంత్రం వరకు కూడా తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఫలితం లేక పోవడంతో అదే రోజు కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, మెహర్ ఉన్నీసాబేగం ఆదివారం ఉదయం రామంతాపూర్‌లోని రాంశంకర్‌నగర్ నాలా వద్ద శవమై తేలింది. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహంపై గాయాలున్నట్లు సమాచారం. -
ఇద్దరు చిన్నారుల అదృశ్యం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మౌలాలీ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలానికి దారితీసింది. మధ్యాహ్నం స్కూల్ నుంచి తిరుగుముఖం పట్టిన చిన్నారులు తీవ్ర గాలింపు చర్యల అనంతరం రాత్రి 8.30 గంటల సమయంలో నాచారంలో కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం అమ్మాపురానికి చెందిన చిరంజీవి, ఆయన భార్య సుమలత నిర్మాణరంగ కార్మికులుగా పనిచేస్తూ మౌలాలీ హౌసింగ్ బోర్డు పరిధిలోని కైలాసగిరిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె కీర్తి(6), కుమారుడు ధనుష్ (4) ఎప్పటిలా బుధవారం కూడా స్థానిక అంగన్వాడీ స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ స్కూల్లోనే ఉండి ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు. కానీ, వారు ఇంటికి చేరుకోలేదు. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన చిరంజీవి దంపతులకు పిల్లలు ఇద్దరూ కనిపించకపోయే సరికి కలవరం చెందారు. అంగన్వాడీ స్కూల్ టీచర్‌ను విచారించగా పిల్లలు ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. స్థానికంగా తెలిసిన వారందరినీ విచారించి, చివరికి కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలకు వరుసకు మేనమామ అయిన శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, అదృశ్యమైన ఇద్దరు చిన్నారులను రాత్రి 8.30 గంటల సమయంలో నాచారంలో గుర్తించారు. అయితే, వారు దారితప్పి వెళ్లారా, లేక ఎవరైనా అపహరించి పోలీసుల గాలింపు చర్యలతో వదిలిపెట్టి వెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసుల విచారిస్తున్నారు. -
తల్లీ కూతురు అదృశ్యం
విజయవాడ: బంధువుల ఇంటికి వెళ్లడం కోసం ఆటో ఎక్కిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద జరిగింది. ఆదివారం సాయంత్రం రహీమున్నిసా(24) తన నాలుగేళ్ల కూతురితో కలసి బయల్దేరింది. ఆమె బంధువలు ఇంటికి చేరలేదన్న విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో ఉయ్యూరు చేరుకున్న తర్వాత ఆటోలో ఒక్కదాన్నే ఉన్నానని, తనకు భయంగా ఉందని ఫోన్ చేసి చెప్పినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి రహీమున్నిసా ఫోన్ అందుబాటులో లేకుండా పోయిందని తెలిపారు. -
అదృశ్యమైన విద్యార్థులు ఒరిస్సాలో ప్రత్యక్షం
నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలో ఆదివారం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులు సోమవారం ఒరిస్సాలో ప్రత్యక్షమయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నాగరాజు కుమార్తె పవిత్ర మర్రిగూడలోని ఎంవీఆర్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన మరో విద్యార్థిని జంజిరాల సైదులు కుమార్తె పావని చైతన్య వైష్ణవి స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇద్దరూ ఆడుకుంటు లాలిపాప్స్ కొనుక్కునేందుకు రైల్వేస్టేషన్ వైపు ఉన్న దుకాణం వద్దకు వెళ్లారు. అటునుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఒకే చోట ఆడుకుంటున్న విద్యార్థులు 5.30 గంటలకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఆడుకుని వచ్చిపోయే రైళ్లను చూస్తున్నారు. 6.15 నిమిషాలకు ఫలక్‌నూమా రైలు రావడంతో అందులోకి ఎక్కి దిగుతుండడంతో ఫ్లాట్ మీద ఉన్న ప్రయాణికులు రైల్లో వచ్చిన విద్యార్థులు ఏమో అనుకుని రైలు కదులుతుంది ఎక్కండి అని గట్టిగా చెప్పడంతో మళ్లీ రెలైక్కారు. టీసీ గమనించడంతో.. ఫలక్‌నూమా రైలులో మిర్యాలగూడ ప్రాంతానికి ఓ వ్యక్తి టీసీగా పనిచేస్తున్నా డు. ఒరిస్సా ప్రాంతంలోని కుర్ధా రైల్వే స్టేషన్‌కు రైలుచేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయినప్పటికీ వారు దిగలేదు. ఈ ఇద్దరు చిన్నారులు తెలుగులో మాట్లాడుకోవడం టీసీ గమనించాడు. వారి కుటుంబ వివరాలు తెలుసుకుని నల్లగొండ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. కాగా, ఆ ఇద్దరు చిన్నారులను తీసుకురావాలని పోలీసులు అక్కడికి వెళ్లారు. -
ఆరీఫ్‌గా అదృశ్యం.. సమీర్‌గా ప్రత్యక్షం
మియాపూర్: ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు ఏడేళ్ల తర్వాత పోలీసుల సహాయంతో తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ‘ఆరీఫ్’గా వెళ్లి ‘సమీర్’గా తిరిగొచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మియాపూర్‌లోని ఆదిత్యానగర్‌లో ఉండే ఎండీ గౌస్, రజియా బేగంలు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఆరీఫ్ సంతానం. ఆరీఫ్ 2007 ఆగస్టు 16న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుమారుడి కోసం తండ్రి తిరగని ఊరు లేదు. అయినా ఆచూకీ దొరకలేదు. ఏడేళ్ల తర్వాత సంగారెడ్డిలో షేక్ ఖాదర్ వద్ద తమ కుమారుడున్నట్లు సమాచారం అందుకున్న గౌస్ మియాపూర్ పోలీ సులను ఆశ్రయించాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు సంగారెడ్డి వెళ్లారు. ఖాదర్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆరీఫ్ అలియాస్ సమీర్‌ను తీసుకొని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తలపై మచ్చ ఆధారంగా గుర్తింపు.. మూడేళ్ల వయస్సులోనే ఆరీఫ్ తలకు గాయమైంది. ఆ గాయం మచ్చ ఆధారంగా తమ కుమారుడని గౌస్, రజియా బేగంలు గుర్తిం చారు. 2007లో షేక్ ఖాదర్ పండ్ల వ్యాపా రం చేసేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేదు. పిల్లలపై మమకారం పెంచుకున్న షేక్ ఖాదర్ మియాపూర్ ఆదిత్యానగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరీఫ్‌కు పండ్లు ఇస్తానని కిడ్నాప్ చేశాడు. బాలుడిని మెదక్ జిల్లా సంగారెడ్డి అంగడిపేటలోని అత్తామామ వద్ద ఉంచి పెంచుకుంటున్నాడు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. అంతేగాక ఆరీఫ్ పేరును సమీర్‌గా మార్చి ఆధార్ కార్డులో ఆ పేరు నమోదు చేయించాడు. పోలీసులు అండగిపేటకు వెళ్లి విచారించగా ఖాదర్.. సమీర్‌ను పెంచుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో ఖాదర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తం తెలిపారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని ఖాదర్ పరారయ్యాడు. ఆన ందంలో తల్లిదండ్రులు... కనిపించకుండా పోయిన తమ కుమారుడు ఏడేళ్ల తరువాత తిరిగి చెంతకు చేరడంతో తల్లిదండ్రులు గౌస్, రజియా బేగం పట్టరాని సంతోషలో మునిగిపోయారు. తమ కొడుకు అదృశ్యం అయినప్పటి నుంచి కొడు కు దొరుకుతాడో లేడోనని బెంగపడ్డ రజి యా బేగం కళ్లు ముందే కొడుకు ప్రత్యక్షం కావడంతో ఆనంద బాష్పాలు రాల్చింది. -
అదృశ్యమైన విద్యార్థిని మృతి
పెదతండా(ఖమ్మంరూరల్), న్యూస్‌లైన్: ఇంట్లో ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురై గత నెల 30న అదృశ్యమైన విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఖమ్మంరూరల్ మండలం పెదతండాలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నా యి. పెదతండాకు చెందిన ధరావత్ శంకర్, సుశీలలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె వాణి(17) ఖమ్మంనగరంలోని గాంధీచౌక్‌లో ఉన్న సిరిచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ(ఎంపీసీ) సంవత్సరం చదువుతోంది. గత నెల 30వ తేదీన ఇంట్లో ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురైన వాణి అదే రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. అనంతరం తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు గ్రా మం చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో తన కుమార్తె కనిపించడం లేదని శంకర్ శనివారం ఖమ్మంరూరల్ పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పో లీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బిహ ర్భూమికి వెళ్లిన గ్రామస్తులకు గ్రామ శివారులోని మూడ్ రామ్మూర్తికి చెందిన వ్యవసాయ పోలంలోని బావిలో వాణి మృతదేహాన్ని గమనించారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు ‘కూలీనాలీ చేసి నిన్ను చదివిస్తున్నాం.. ఇంటికి పెద్ద దిక్కు అయినా నీవు ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటావనుకుంటే ఇంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా..?’ అంటూ వాణి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. -
న్యూఢిల్లీ, ముంబై ఘటనలు భారత పరువు తీశాయి
న్యూఢిల్లీలోని నిర్భయ, ముంబైలోని ఫోటో జర్నలిస్టులపై సామూహిక అత్యాచార సంఘటనలతో భారత ప్రతిష్ట మసకబారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. సోమవారంలో లోక్‌సభలో ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటనపై జరిగిన చర్చ కార్యక్రమంలో ఆమె తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓ వైపు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థానాలను ఆధిరోహిస్తున్నారన్నారు. మరోవైపు మహిళలపై దారుణ అకృత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ ఘటనపై ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె పేర్కొన్నారు. ముంబై, న్యూఢిల్లీ ఘటనలపై సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గాంధీలో అప్పుడే జన్మించిన శిశువు మాయం
నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం జన్మించిన శిశువు క్షణాల్లో మాయమైంది. దీంతో ఆ శిశువు తల్లితండ్రులు మనోహార్, సులోచనలు వారి బంధువులు ఆసుపత్రి అంతా గాలించారు. అయిన శిశువు జాడ తెలియలేదు. దాంతో ఆ విషయాన్ని వారు ఆసుపత్రిలోని వైద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సలహా మేరకు ఆ శిశువు తల్లితండ్రులు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే తమకు మరియమ్మ అనే మహిళపై అనుమానం ఉందని ఆ శిశువు తల్లితండ్రులు పోలీసులు తెలిపారు.