మియాపూర్: ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు ఏడేళ్ల తర్వాత పోలీసుల సహాయంతో తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ‘ఆరీఫ్’గా వెళ్లి ‘సమీర్’గా తిరిగొచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మియాపూర్‌లోని ఆదిత్యానగర్‌లో ఉండే ఎండీ గౌస్, రజియా బేగంలు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఆరీఫ్ సంతానం.
ఆరీఫ్ 2007 ఆగస్టు 16న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుమారుడి కోసం తండ్రి తిరగని ఊరు లేదు. అయినా ఆచూకీ దొరకలేదు. ఏడేళ్ల తర్వాత సంగారెడ్డిలో షేక్ ఖాదర్ వద్ద తమ కుమారుడున్నట్లు సమాచారం అందుకున్న గౌస్ మియాపూర్ పోలీ సులను ఆశ్రయించాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు సంగారెడ్డి వెళ్లారు. ఖాదర్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆరీఫ్ అలియాస్ సమీర్‌ను తీసుకొని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
తలపై మచ్చ ఆధారంగా గుర్తింపు..
మూడేళ్ల వయస్సులోనే ఆరీఫ్ తలకు గాయమైంది. ఆ గాయం మచ్చ ఆధారంగా తమ కుమారుడని గౌస్, రజియా బేగంలు గుర్తిం చారు. 2007లో షేక్ ఖాదర్ పండ్ల వ్యాపా రం చేసేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేదు. పిల్లలపై మమకారం పెంచుకున్న షేక్ ఖాదర్ మియాపూర్ ఆదిత్యానగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరీఫ్‌కు పండ్లు ఇస్తానని కిడ్నాప్ చేశాడు.
బాలుడిని మెదక్ జిల్లా సంగారెడ్డి అంగడిపేటలోని అత్తామామ వద్ద ఉంచి పెంచుకుంటున్నాడు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. అంతేగాక ఆరీఫ్ పేరును సమీర్‌గా మార్చి ఆధార్ కార్డులో ఆ పేరు నమోదు చేయించాడు. పోలీసులు అండగిపేటకు వెళ్లి విచారించగా ఖాదర్.. సమీర్‌ను పెంచుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో ఖాదర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తం తెలిపారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని ఖాదర్ పరారయ్యాడు.
ఆన ందంలో తల్లిదండ్రులు...
కనిపించకుండా పోయిన తమ కుమారుడు ఏడేళ్ల తరువాత తిరిగి చెంతకు చేరడంతో తల్లిదండ్రులు గౌస్, రజియా బేగం పట్టరాని సంతోషలో మునిగిపోయారు. తమ కొడుకు అదృశ్యం అయినప్పటి నుంచి కొడు కు దొరుకుతాడో లేడోనని బెంగపడ్డ రజి యా బేగం కళ్లు ముందే కొడుకు ప్రత్యక్షం కావడంతో ఆనంద బాష్పాలు రాల్చింది.
ఆరీఫ్‌గా అదృశ్యం.. సమీర్‌గా ప్రత్యక్షం
Published Thu, Aug 28 2014 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement