Samir
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండో అరెస్ట్
-
ఉగ్రవాది సమీర్ టార్గెట్‌లో విదేశీయులు
సాక్షి, హైదరాబాద్: లష్కరే తొయిబా(ఎల్ఈటీ) ఉగ్ర వాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ నయ్యూ అలియాస్ సమీర్ టార్గెట్‌లో విదేశీయులు ఉన్నట్టు తేలింది. ప్రధానంగా యూదులు (ఇజ్రాయిలీలు) ఉన్నట్లు ఎన్ఐఏ నిర్థారించింది. వీరిని మట్టుపెట్టడానికి హిమాచల్‌ప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో రెక్కీ చేసిన ట్లు తేల్చింది. దీంతో ఎన్ఐఏ గతవారం సమీర్‌తోపాటు అతనికి సహకరించిన మరో 9మందిపై ఢిల్లీ లోని పటియాల కోర్టులో అభియోగ పత్రాలు దాఖ లు చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన సమీర్ ఉగ్రవాద శిక్షణ కోసం పాకిస్తాన్‌కు వెళ్లాడు. 2007 మార్చ్‌లో మరో ఇద్దరు పాకిస్తానీయులతో కలసి అక్రమంగా బంగ్లాదేశ్ మీదుగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశిస్తూ బీఎస్ఎఫ్ అధికారులకు పశ్చిమ బెంగాల్లో చిక్కాడు. అదే ఏడాది మేలో జరి గిన మక్కా మసీదు పేలుళ్లలోనూ అనుమానితుడిగా మారాడు. దీంతో సమీర్‌ను పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారు. మహంకాళి పోలీసుస్టేషన్లో ఉన్న సమీర్ ఈ ఏడాది జూన్ 18న అక్కడ నుంచి పారిపోవడానికి యత్నించి విఫలమయ్యాడు. దీనిపై ఎస్కేప్ కేసు నమోదైంది. విచారణ తర్వాత కోల్‌కతా జైలుకు తరలించారు. ఇతడిని కోల్‌కతా పోలీసులు 2014లో కేసు విచారణ కోసం ముంబై కోర్టులో హాజరు పరచడానికి తీసుకెళ్లారు. అనంతరం హౌరా–ముంబై ఎక్స్ ప్రెస్‌లో కోల్‌కతాకు తరలిస్తుండగా తప్పించుకున్నా డు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను ఎన్ఐఏ అధికారులు గత నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ లక్నో లోని చార్భాగ్ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. విచా రణలో అధికారులు భారీ కుట్రను ఛేదించారు. పాక్, దుబాయ్ ఉగ్రవాదులతో సంబంధాలు రైలు నుంచి తప్పించుకున్నాక హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, మనాలీల్లో తలదాచుకున్న సమీర్.. పాక్, దుబాయ్‌ల్లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు కొన సాగించినట్లు గుర్తించారు. వీరి నుంచి ఆర్థిక సాయం అందుకుంటూ దేశంలో ఎల్ఈటీ కార్యకలాపాలు విస్తరించడానికి సహకరించాడని తేల్చారు. విదేశాల్లో ని ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడానికి నింబూజ్ వంటి యాప్స్‌తో పాటు వీవోఐపీ, ఇంటర్నెట్ కాల్స్ వాడినట్లు ఆధారాలు సేకరించారు. -
విద్యుదాఘాతంతో జేఎల్ఎం మృతి
తండ్రి మరణంతో ఆరు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన సమీర్ హన్మకొండ అర్బన్ : విద్యుదాఘాతంతో ఓ జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం)మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం హన్మకొండ సుబేదారిలోని రామకృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. బంధువులు కథనం ప్రకారం.. వరంగల్ చార్‌బౌలికి చెందిన ఎం.డీ.సమీర్‌సోయాబ్ (26) తన తండ్రి అబ్బాస్ ఆగస్టు్టలో మృతిచెందడంతో కారుణ్య నియమకంలో భాగంగా కాజీపేట సబ్‌స్టేన్ పరిధిలో జూనియర్ లైన్ మెన్ ద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 8 గంటలకు రామకృష్ణ కాలనీలో విద్యుత్ సరఫరా కావడం లేదని స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు సరిచేసినా∙విద్యుత్ సరçఫరా కాలేదు. మరోసారి చెక్ చేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ట్రాన్స్ ఫార్మర్ వద్దకు చేరుకుని సుబేదారి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతుడి తల్లి్లకి సమాచారం అందించారు. తల్లి్ల తస్లీం ఫిర్యాదు మేరకు పోస్టుమర్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి పంచనామ నిర్వహించారు. కాగా, సమీర్‌తో విద్యుత్ సమస్య ఉందని చెప్పితే వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించే వాడని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి 11గంటలకు తల్లికి చివరి ఫోన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సమీర్‌తల్లి తస్లీమా రోదనలు మిన్నంటాయి. రాత్రి 11గంలకు నాకు ఫోన్ చేసి తిన్నా అమ్మా.. అన్నావు...ఉదయం 10గంటలకు వస్తానన్నావు... నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు బేటా... నువ్వులేని ఇంట్లో నేను ఎలా ఉండాలి ..ఇక నేనెవరి కోసం బతకాలంటూ రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ప్రమాదం ఎలా జరిగింది..? రామకృష్ణకాలనీలో శుక్రవారం ఒక ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ సందర్భంగా టెంట్ వేసే క్రమంలో కర్ర తగిలి విద్యత్ సరఫరాకు అంతరాయం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయంపై ఎన్పీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సమయంలో శుక్రవారం నైట్‌డ్యూటీలో ఉన్న సమీర్ శనివారం ఉదయం మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పనులు చేస్తారు. అయితే సమీర్ షాక్‌కు గురైన సమయంలో పక్కనే ఉన్న 11కేవీ లైన్ కు విద్యుత్ సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దానికి సాంకేతిక లోపం వల్ల విద్యత్ సరఫరా అయిందా.. లేక హడావుడిలో బంద్ చేకుండా పనిచేయడం వల్ల ఇలా జరిగిందా అన్న విషయం తెలియలేదు. విద్యుదాఘాతంతో జేఎల్ఎం మృతి కాజీపేట : అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందిన జూనియర్ లైన్ మెన్ ఎండీ సమీర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాజీపేట ఆర్ఈసీ విద్యుత్ సబ్‌స్టేన్ ఎదుట సమీర్ బంధు, మిత్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న కాజీపేట సీఐ రమేష్‌కుమార్ ఆందోళనకారులకు సభ్యులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో ట్రాన్స్ కో ఏడీఈ మధుసూధన్ ఘటన స్థలానికి చేరుకుని సమీర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందించడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
సమీర్ వర్మకు టైటిల్
న్యూఢిల్లీ: బహ్రెయిన్ చాలెంజ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. బహ్రెయిన్‌లోని ఇసా టౌన్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు 21-14, 21-10తో నాలుగో సీడ్, ప్రపంచ 47వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై సంచలన విజయం సాధించాడు. వారం రోజుల వ్యవధిలో సమీర్ వర్మ రెండో సింగిల్స్ టైటిల్ సాధించడం విశేషం. గతవారం ఇదే వేదికపై జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన సమీర్ అదే జోరును చాలెంజ్ టోర్నీలోనూ కొనసాగించాడు. మరోవైపు భారత్‌కే చెందిన శైలి రాణే వరుసగా రెండో టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో శైలి రాణే 22-24, 10-21తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
ఆరీఫ్‌గా అదృశ్యం.. సమీర్‌గా ప్రత్యక్షం
మియాపూర్: ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు ఏడేళ్ల తర్వాత పోలీసుల సహాయంతో తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ‘ఆరీఫ్’గా వెళ్లి ‘సమీర్’గా తిరిగొచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మియాపూర్‌లోని ఆదిత్యానగర్‌లో ఉండే ఎండీ గౌస్, రజియా బేగంలు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఆరీఫ్ సంతానం. ఆరీఫ్ 2007 ఆగస్టు 16న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుమారుడి కోసం తండ్రి తిరగని ఊరు లేదు. అయినా ఆచూకీ దొరకలేదు. ఏడేళ్ల తర్వాత సంగారెడ్డిలో షేక్ ఖాదర్ వద్ద తమ కుమారుడున్నట్లు సమాచారం అందుకున్న గౌస్ మియాపూర్ పోలీ సులను ఆశ్రయించాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు సంగారెడ్డి వెళ్లారు. ఖాదర్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆరీఫ్ అలియాస్ సమీర్‌ను తీసుకొని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తలపై మచ్చ ఆధారంగా గుర్తింపు.. మూడేళ్ల వయస్సులోనే ఆరీఫ్ తలకు గాయమైంది. ఆ గాయం మచ్చ ఆధారంగా తమ కుమారుడని గౌస్, రజియా బేగంలు గుర్తిం చారు. 2007లో షేక్ ఖాదర్ పండ్ల వ్యాపా రం చేసేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేదు. పిల్లలపై మమకారం పెంచుకున్న షేక్ ఖాదర్ మియాపూర్ ఆదిత్యానగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరీఫ్‌కు పండ్లు ఇస్తానని కిడ్నాప్ చేశాడు. బాలుడిని మెదక్ జిల్లా సంగారెడ్డి అంగడిపేటలోని అత్తామామ వద్ద ఉంచి పెంచుకుంటున్నాడు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. అంతేగాక ఆరీఫ్ పేరును సమీర్‌గా మార్చి ఆధార్ కార్డులో ఆ పేరు నమోదు చేయించాడు. పోలీసులు అండగిపేటకు వెళ్లి విచారించగా ఖాదర్.. సమీర్‌ను పెంచుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో ఖాదర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తం తెలిపారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని ఖాదర్ పరారయ్యాడు. ఆన ందంలో తల్లిదండ్రులు... కనిపించకుండా పోయిన తమ కుమారుడు ఏడేళ్ల తరువాత తిరిగి చెంతకు చేరడంతో తల్లిదండ్రులు గౌస్, రజియా బేగం పట్టరాని సంతోషలో మునిగిపోయారు. తమ కొడుకు అదృశ్యం అయినప్పటి నుంచి కొడు కు దొరుకుతాడో లేడోనని బెంగపడ్డ రజి యా బేగం కళ్లు ముందే కొడుకు ప్రత్యక్షం కావడంతో ఆనంద బాష్పాలు రాల్చింది.