విద్యుదాఘాతంతో జేఎల్‌ఎం మృతి
తండ్రి మరణంతో ఆరు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన సమీర్
హన్మకొండ అర్బన్ : విద్యుదాఘాతంతో ఓ జూనియర్ లైన్ మెన్ (జేఎల్‌ఎం)మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం హన్మకొండ సుబేదారిలోని రామకృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. బంధువులు కథనం ప్రకారం.. వరంగల్ చార్‌బౌలికి చెందిన ఎం.డీ.సమీర్‌సోయాబ్ (26) తన తండ్రి అబ్బాస్ ఆగస్టు్టలో మృతిచెందడంతో కారుణ్య నియమకంలో భాగంగా కాజీపేట సబ్‌స్టేన్ పరిధిలో జూనియర్ లైన్ మెన్ ద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 8 గంటలకు రామకృష్ణ కాలనీలో విద్యుత్ సరఫరా కావడం లేదని స్థానికులు సమాచారం ఇచ్చారు.
దీంతో ఆయన కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు సరిచేసినా∙విద్యుత్ సరçఫరా కాలేదు. మరోసారి చెక్ చేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ట్రాన్స్ ఫార్మర్ వద్దకు చేరుకుని సుబేదారి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతుడి తల్లి్లకి సమాచారం అందించారు. తల్లి్ల తస్లీం ఫిర్యాదు మేరకు పోస్టుమర్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి పంచనామ నిర్వహించారు. కాగా, సమీర్‌తో విద్యుత్ సమస్య ఉందని చెప్పితే వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించే వాడని స్థానికులు పేర్కొన్నారు.
రాత్రి 11గంటలకు తల్లికి చివరి ఫోన్
అధికారులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సమీర్‌తల్లి తస్లీమా రోదనలు మిన్నంటాయి. రాత్రి 11గంలకు నాకు ఫోన్ చేసి తిన్నా అమ్మా.. అన్నావు...ఉదయం 10గంటలకు వస్తానన్నావు... నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు బేటా... నువ్వులేని ఇంట్లో నేను ఎలా ఉండాలి ..ఇక నేనెవరి కోసం బతకాలంటూ రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.
ప్రమాదం ఎలా జరిగింది..?
రామకృష్ణకాలనీలో శుక్రవారం ఒక ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ సందర్భంగా టెంట్ వేసే క్రమంలో కర్ర తగిలి విద్యత్ సరఫరాకు అంతరాయం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయంపై ఎన్పీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సమయంలో శుక్రవారం నైట్‌డ్యూటీలో ఉన్న సమీర్ శనివారం ఉదయం మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పనులు చేస్తారు. అయితే సమీర్ షాక్‌కు గురైన సమయంలో పక్కనే ఉన్న 11కేవీ లైన్ కు విద్యుత్ సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దానికి సాంకేతిక లోపం వల్ల విద్యత్ సరఫరా అయిందా.. లేక హడావుడిలో బంద్ చేకుండా పనిచేయడం వల్ల ఇలా జరిగిందా అన్న విషయం తెలియలేదు.
విద్యుదాఘాతంతో జేఎల్‌ఎం మృతి
కాజీపేట : అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందిన జూనియర్ లైన్ మెన్ ఎండీ సమీర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాజీపేట ఆర్‌ఈసీ విద్యుత్ సబ్‌స్టేన్ ఎదుట సమీర్ బంధు, మిత్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న కాజీపేట సీఐ రమేష్‌కుమార్ ఆందోళనకారులకు సభ్యులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో ట్రాన్స్ కో ఏడీఈ మధుసూధన్ ఘటన స్థలానికి చేరుకుని సమీర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందించడానికి డిపార్ట్‌మెంట్ సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.