సాక్షి, హైదరాబాద్: లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ) ఉగ్ర వాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ నయ్యూ అలియాస్ సమీర్ టార్గెట్‌లో విదేశీయులు ఉన్నట్టు తేలింది. ప్రధానంగా యూదులు (ఇజ్రాయిలీలు) ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్థారించింది. వీరిని మట్టుపెట్టడానికి హిమాచల్‌ప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో రెక్కీ చేసిన ట్లు తేల్చింది. దీంతో ఎన్‌ఐఏ గతవారం సమీర్‌తోపాటు అతనికి సహకరించిన మరో 9మందిపై ఢిల్లీ లోని పటియాల కోర్టులో అభియోగ పత్రాలు దాఖ లు చేసింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన సమీర్ ఉగ్రవాద శిక్షణ కోసం పాకిస్తాన్‌కు వెళ్లాడు. 2007 మార్చ్‌లో మరో ఇద్దరు పాకిస్తానీయులతో కలసి అక్రమంగా బంగ్లాదేశ్ మీదుగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశిస్తూ బీఎస్‌ఎఫ్ అధికారులకు పశ్చిమ బెంగాల్‌లో చిక్కాడు. అదే ఏడాది మేలో జరి గిన మక్కా మసీదు పేలుళ్లలోనూ అనుమానితుడిగా మారాడు. దీంతో సమీర్‌ను పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారు. మహంకాళి పోలీసుస్టేషన్‌లో ఉన్న సమీర్ ఈ ఏడాది జూన్ 18న అక్కడ నుంచి పారిపోవడానికి యత్నించి విఫలమయ్యాడు.
దీనిపై ఎస్కేప్ కేసు నమోదైంది. విచారణ తర్వాత కోల్‌కతా జైలుకు తరలించారు. ఇతడిని కోల్‌కతా పోలీసులు 2014లో కేసు విచారణ కోసం ముంబై కోర్టులో హాజరు పరచడానికి తీసుకెళ్లారు. అనంతరం హౌరా–ముంబై ఎక్స్ ప్రెస్‌లో కోల్‌కతాకు తరలిస్తుండగా తప్పించుకున్నా డు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను ఎన్‌ఐఏ అధికారులు గత నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ లక్నో లోని చార్‌భాగ్ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. విచా రణలో అధికారులు భారీ కుట్రను ఛేదించారు.
పాక్, దుబాయ్ ఉగ్రవాదులతో సంబంధాలు
రైలు నుంచి తప్పించుకున్నాక హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, మనాలీల్లో తలదాచుకున్న సమీర్.. పాక్, దుబాయ్‌ల్లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు కొన సాగించినట్లు గుర్తించారు. వీరి నుంచి ఆర్థిక సాయం అందుకుంటూ దేశంలో ఎల్‌ఈటీ కార్యకలాపాలు విస్తరించడానికి సహకరించాడని తేల్చారు. విదేశాల్లో ని ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడానికి నింబూజ్ వంటి యాప్స్‌తో పాటు వీవోఐపీ, ఇంటర్‌నెట్ కాల్స్ వాడినట్లు ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment