అదృశ్యమైన విద్యార్థిని మృతి
Published Mon, Sep 2 2013 3:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పెదతండా(ఖమ్మంరూరల్), న్యూస్‌లైన్: ఇంట్లో ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురై గత నెల 30న అదృశ్యమైన విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం ఖమ్మంరూరల్ మండలం పెదతండాలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నా యి. పెదతండాకు చెందిన ధరావత్ శంకర్, సుశీలలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె వాణి(17) ఖమ్మంనగరంలోని గాంధీచౌక్‌లో ఉన్న సిరిచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ(ఎంపీసీ) సంవత్సరం చదువుతోంది. గత నెల 30వ తేదీన ఇంట్లో ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురైన వాణి అదే రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. అనంతరం తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు గ్రా మం చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.
దీంతో తన కుమార్తె కనిపించడం లేదని శంకర్ శనివారం ఖమ్మంరూరల్ పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పో లీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బిహ ర్భూమికి వెళ్లిన గ్రామస్తులకు గ్రామ శివారులోని మూడ్ రామ్మూర్తికి చెందిన వ్యవసాయ పోలంలోని బావిలో వాణి మృతదేహాన్ని గమనించారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.
కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
‘కూలీనాలీ చేసి నిన్ను చదివిస్తున్నాం.. ఇంటికి పెద్ద దిక్కు అయినా నీవు ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటావనుకుంటే ఇంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా..?’ అంటూ వాణి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది.
Advertisement
Advertisement