జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య | Sikh software engineering student stabbed to death in US | Sakshi

జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య

Published Sat, Sep 2 2017 4:35 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య - Sakshi

జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య

అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిక్కు యువకుణ్ని ఓ అమెరికన్‌ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.


సాక్షి,వాషింగ్టన్‌: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది.  భారతీయ  సిక్కు  యువకుణ్ని  ఓ అమెరికన్‌ కత్తితో  దారుణంగా పొడిచి చంపాడు. ఈ దురదృష్టకర ఘటనలో ఇంజనీరింగ్‌ విద్యార్థి గగన్‌దీప్‌ సింగ్‌ (22) హత్యకు గురికావడం విషాదాన్ని రేపింది.    యూనివర్శిటీలో అడ్మిషన్‌ రాలేదన్న అక్కసుతో జాకబ్‌ కోలెమన్‌ (19)  టాక్సీ డ్రైవర్‌, సిక్‌ విద్యార్థిని  అనేకసార్లు పొడిచి హత్యచేశారని స్థానిక పోలీసులు ప్రకటించారు.   

ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న సింగ్‌ టాక్సీ డ్రైవర్‌గా పనిచేన్నారు.. ఈ క్రమంలో  ఆగష్టు 28 న   వాషింగ్టన్ లోని  స్పోకేన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లో నిందితుడు సింగ్‌ టాక్సీ ఎక్కాడు.  ఇదాహోలోని బోనర్ కంట్రీలో  తన స్నేహితుడు ఇంటికి వెళ్లమని  కోరాడు.   ఆకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు విచక్షణా రహితంగా దాడి చేయడంతో సింగ్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

గోంజాగా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రయివేట్ కాథలిక్  యూనివర్శిటీలో  ప్రవేశం లభించకపోవడంతో  ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల కథనం. అయితే ఈ విషయాన్ని యూనివర్శిటీ ఖండించింది. అలాంటి అప్లికేషన్‌ ఏదీ తమ దగ్గరకు రాలేదనీ,  విచారణకు సహకరిస్తున్నట్టు తెలిపింది.

పంజాబ్‌లోని జంషెడ్‌పూర్‌కుచెందిన  గగన్‌దీప్‌సింగ్‌ గా  మృతుణ్ని గుర్తించారు.  2003నుంచిన ఆయన  వాషింగ్‌టన్‌లో నివసిస్తున్నారు.
మరోవపు జలంధర్ కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ రాజు మేనల్లుడు గగన్‌ సింగ్‌. ఈ హత్యపై ఆయన స్పందిస్తూ, తన మేనల్లుడు జాతి విద్వేషాలకు బలైయ్యాడని ఆవేదన వ్యక‍్తం  చేశారు.  ఉద్యోగాల కల్పనపై ట్రంప్  విధానాల  ఫలితంగా  జాతి విద్వేషాలకు బాధితులుగా భారతీయులు,  ఆసియన్లు  బాధితులుగా మారుతున్నారని మండిపడ్డారు.

కాగా  అమెరికాలో ఇటీవలి నెలల్లో అమెరికన్లు లభారతీయలును, సిక్కులను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆందోళన రేపుతోంది.  జూలైలో  కాలిఫోర్నియాలో ఒకే వారం లో రెండు వేర్వేరు సంఘటనలలో ఇద్దరు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement