పెళ్లింట విషాదం
పెళ్లింట విషాదం
Published Wed, May 10 2017 7:41 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కొవ్వూరు రూరల్: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. సోదరి పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్లిన సోదరుడు ఐ. పంగిడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దుకూరు గ్రామానికి చెందిన మాలే సురేష్‌కుమార్ (24) సోదరి వివాహం ఈ నెల 17న కావడంతో శుభలేఖలు పంచేందుకు పెదనాన్న వీరవెంకట సత్యనారాయణతో కలిసి బుధవారం ఉదయం మోటార్ సైకిల్‌పై రాజమండ్రి బయలుదేరారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఐ.పంగిడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్‌కుమార్ మృతి చెందగా వీర వెంకట సత్యనారాయణ ప్రాణాలతో భయటపడ్డాడు. రోడ్డు మార్జిన్‌లో నిలిపి ఉంచిన గుర్తు తెలియని క్వారీ లారీ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో సురేష్‌కుమార్ బైక్‌కు బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో లారీ వెనుకభాగం మోటార్‌సైకిల్‌కు తగలడంతో వీరిద్దరూ కింద పడ్డారు. అదే సమయంలో వెనుకగా వస్తున్న మరో లారీ సురేష్‌కుమార్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ సురేష్‌కుమార్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి మాలే సాయిబాబు కొవ్వూరు పంచాయతీరాజ్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొవ్వూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement