CARDS DISTRIBUTION
-
కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ
-
పెళ్లింట విషాదం
కొవ్వూరు రూరల్: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. సోదరి పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్లిన సోదరుడు ఐ. పంగిడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దుకూరు గ్రామానికి చెందిన మాలే సురేష్‌కుమార్ (24) సోదరి వివాహం ఈ నెల 17న కావడంతో శుభలేఖలు పంచేందుకు పెదనాన్న వీరవెంకట సత్యనారాయణతో కలిసి బుధవారం ఉదయం మోటార్ సైకిల్‌పై రాజమండ్రి బయలుదేరారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఐ.పంగిడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్‌కుమార్ మృతి చెందగా వీర వెంకట సత్యనారాయణ ప్రాణాలతో భయటపడ్డాడు. రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంచిన గుర్తు తెలియని క్వారీ లారీ ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో సురేష్‌కుమార్ బైక్‌కు బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో లారీ వెనుకభాగం మోటార్‌సైకిల్‌కు తగలడంతో వీరిద్దరూ కింద పడ్డారు. అదే సమయంలో వెనుకగా వస్తున్న మరో లారీ సురేష్కుమార్పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ సురేష్కుమార్పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి మాలే సాయిబాబు కొవ్వూరు పంచాయతీరాజ్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొవ్వూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విడాకుల పంచాయితీకి రండి!
భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించిన ఓ ప్రబుద్ధుడు.. ఆహ్వానం సినిమాలోలా ఇంటింటికీ తిరిగి తమ విడాకుల పంచాయితీకి రావాలంటూ వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో సోమవారం ఆహ్వాన పత్రికలు పంచాడు. నారాయణగిరికి చెందిన ముత్తోజు వెంకట్రాజం, రాజమణి దంపతుల కుమార్తె ఉమకు నాలుగున్నర సంవత్సరాల క్రితం దుగ్గొండికి చెందిన కలకొండ సురేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ పాప. మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడిన సురేష్ ఆమెను పుట్టింటికి పంపించాడు. బావమరిది రమేష్‌తోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సురేష్ మరో ఐదుగురితో కలిసి నారాయణగిరికి వచ్చి ఈ నెల 14న జరిగే ‘విడాకుల పంచాయితీకి ఆహ్వానం’ అని ముద్రించిన కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని పట్టుకోగా, సురేష్ తప్పించుకున్నాడు. మిగితా ఐదుగురిని ఆరా తీయగా తమకు చదువురాదని, రూ. 300 కూలి ఇస్తామంటే వచ్చి కరపత్రాలు పంచుతున్నామని తెలిపారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి ఉమ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. - ధర్మసాగర్