ప్రాణం తీసిన ఈత సరదా
► కుంట నీటిలో మునిగి బాలుడి మృతి
► శోకసంద్రంలో తల్లిదండ్రులు
సంగెం: ఈత సరదా ఓ విద్యార్థి నిండు జీవితాన్ని బలితీసుకొని, తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మండలం లోని తీగరాజుపల్లి శివారు సోమ్లాతండాకు చెందిన గుగులోత్ భద్రీ, బీకోజీ దంపతుల ఏకైక కుమారుడు వెంకన్న(14) గవిచర్ల మోడల్ స్కూల్‌లో ఏడో తరగతి పూర్తి చేసుకొని ఎనిమిదో తరగతిలో చేరాడు. తండ్రి బీకోజీ స్థానిక రైస్ మిల్లులో హమాలీగా, తల్లి భద్రీ కూలీ పనిచేస్తున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వెంకన్న అదే తండాకు చెందిన స్నేహితులు ప్రవీణ్, సింహద్రి, పున్నెలతో కలిసి సమీపంలోని కర్నాల కుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు.
అక్కడ స్నేహితులు ఖాళీ వాటర్ బాటిళ్లను ఒంటికి కట్టుకొని నీటిలో దిగి ఈత కొడుతున్నారు. వెంకన్న బాటిల్ లేకుండానే నీటిలోకి దూకాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. తోటి స్నేహితులు భయంతో అరుస్తూ కేకలు వేశారు. సమీపంలో వ్యవసాయపనులు చేస్తున్న వారు వచ్చి కుంటలోకి దిగి వెతకగా అప్పటికే మృతిచెందాడు. విష యం తెలుసుకొని చేరుకున్న త ల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకు చనిపోగా గుండెలు బాదుకుంటూ రోదిస్తు న్న తీరు చూసిన వారు దుః ఖ సాగరంలో మునిగారు. తండ్రి ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.దీపక్ తెలిపారు.