హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ఛత్రినాకకు చెందిన ఓ భక్తురాలు తిరుమల దర్శనానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఆమె ఆచూకీ కోసం తిరుమల పోలీసులతో పాటు ఛత్రినాక పోలీసులు కూడా వాకబు చేస్తున్నారు.
ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన జాదవ్ నరేందర్, జె.రజని(24), రజనీ సోదరి అంబిక కలిసి ఈ నెల 3వ తేదీన తిరుమల తిరుపతికి వెళ్లారు. ఆర్యవైశ్య సమాజం సంఘంలో అద్దె రూం తీసుకున్న వీరు స్వామి దర్శనం చేసుకున్నారు. 4వ తేదీన ఉదయం అత్తతో ఫోన్ మాట్లాడుతానంటూ భర్తతో చెప్పి పక్కకు వెళ్లిన రజని ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో నరేందర్ తిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 0877-2289031, 9492926740 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
తిరుమల దర్శనానికి వెళ్లి.. యువతి అదృశ్యం
Published Sat, Apr 9 2016 8:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement