తిరుమలలో ఎగ్‌ పలావ్‌! | Egg Biryani At Tirumala Tirupati: AP | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఎగ్‌ పలావ్‌!

Published Sun, Jan 19 2025 3:09 AM | Last Updated on Sun, Jan 19 2025 3:09 AM

Egg Biryani At Tirumala Tirupati: AP

వెంట తెచ్చుకుని తింటున్న తమిళనాడు బృందం

భక్తుల ఫిర్యాదు మేరకు సీజ్‌ చేసిన పోలీసులు

నిఘా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం

తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరు­మలలో శనివారం కొందరు కొడిగుడ్ల పలావ్‌ (ఎగ్‌ బిర్యానీ) తింటూ కనిపించడం కల­క­లం సృష్టించింది. తమిళనాడు రాష్ట్రం గుమ్ము­­డి­పూండికి చెందిన 23 మంది తిరుమలకు వస్తూ పెద్ద క్యారియర్‌ నిండా కోడిగుడ్ల పలావ్‌ తమ వెంట తెచ్చుకున్నారు. వారు బస్సులో అలిపిరి వద్ద చెకింగ్, లగేజ్‌ స్కానింగ్‌ దాటుకుని తిరుమలకు చేరుకు­న్నారు. రాంబగీచా అతిథిగృహం సమీపంలోని బస్టాండ్‌ వద్ద బస్సు దిగి అక్కడే కోడిగుడ్ల పలావ్‌ తినసాగారు.

ఈ విషయాన్ని కొందరు భక్తులు గుర్తించి సమీపంలోని పోలీస్‌ కాంప్లెక్స్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వచ్చి గుమ్ముడిపూండికి చెందిన వారి వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్‌ చేశారు. తిరు­మలకు ఇలాంటి ఆహారం తీసుకురాకూ­డ­దని పోలీసులు మందలించారు. ఈ అంశంపై టూ టౌన్‌ సీఐని సంప్రదించగా.. అది చాలా చిన్న విషయమని, పెద్దగా పట్టించు­కో­వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం గమనార్హం. కాగా, టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం నిఘా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

తిరుమలలో బయటపడ్డ ఎగ్‌ పలావ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement