బెంగళూరులో వీడని రాజంపేట యువకుని అదృశ్యం కేసు
రెండేళ్లు గడుస్తున్నా జాడలేని సుధీర్
కన్నీటి పర్యంతమవుతున్న తల్లితండ్రులు
రాజంపేట: ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు... ఉన్నత విద్యను అభ్యసించాడు... క్యాంపస్ సెలక్షన్స్‌లోనే మంచి ఉద్యోగం పొందాడు... అంతలోనే అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. రెండేళ్లుగా అతను ఎక్కడ ఉన్నాడో... ఏమయ్యాడో తెలియదు. అతని కోసం 2022 జూలై నుంచి తల్లిదండ్రులు ఎదరుచూస్తూ నిత్యం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి వేదన స్థానికులను సైతం కంటతడిపెట్టిస్తోంది.
ఇందుకు సంబంధించిన వివరాలు... అన్నమయ్య జిల్లా రాజంపేటలోని విద్యుత్‌నగర్‌కు చెందిన పైడి సుబ్రహ్మణ్యం, లక్షమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శృతికి గత ఏడాది వివాహమైంది. కుమారుడు సు«దీర్ బెంగళూరులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ సెలక్షన్‌లో అక్కడే టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందాడు.
ఈ క్రమంలో అతను రెండేళ్ల కిందట అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెంగళూరులో సు«దీర్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు చేశారు. కానీ, ఇంతవరకు సుదీర్ జాడ తెలియలేదు.
న్యూడ్ వీడియో వల్లే..!
సుధీర్ వాట్సాప్‌లో న్యూడ్ వీడియో ముఠా ట్రాప్‌కు గురయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆర్‌ఐఎల్‌వైఏ ప్లస్ 1720–657–9633 నంబర్ నుంచి దుండుగులు సు«దీర్ న్యూడ్ ఫొటోను అతని అక్క శృతి ఫోన్‌కు వాట్సాప్‌లో 2022, జూలైలో పంపారు. వెంటనే శృతి తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన నంబర్‌కు కాల్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. సు«దీర్‌కు ఫోన్ చేయగా కట్‌చేశాడు. మళ్లీ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఆ తర్వాత ‘తమ్ముడు నువ్వు భయపడవద్దు...’ అని సుదీర్‌కు శృతి మెసేజ్ పెట్టింది. అయినా తిరిగి అతని నుంచి సమాధానం లేదు. వెంటనే శృతి తన తండ్రితో కలిసి బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రూమ్‌మేట్స్‌ను విచారించగా, 2022 జూలై 26న ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అతను బయటికి వెళ్లాడని, తిరిగిరాలేదని చెప్పారు. వీడియోను
పంపించి బ్లాక్‌మెయిలర్స్ డబ్బు డిమాండ్ చేయడంతో సు«దీర్ అవమానంగా భావించి ఉంటాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయాడని అనుమానిస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా రెండేళ్లుగా అతీగతీ లేకపోవడంతో తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఎప్పటికైనా తమ కొడుకు తిరిగివస్తాడనే ఆశతో తెలిసిన ప్రతి చోట వెతుకుతున్నారు. తమ కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని మీడియా దృష్టికి కూడా తీసుకురాలేదని సుధీర్ తల్లిదండ్రులు కన్నీటిపర్యవంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment