ఓ జంట పార్కుకు వెళ్లింది. ఆ భార్యభర్తల మధ్య సంభాషణ ఇది.
భార్య: చూశారా అక్కడ తాగుతూ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా అతనెవరో తెలుసా?
భర్త: ఎవరు ?
భార్య: నన్ను ప్రేమిస్తే రిజెక్ట్ చేశాను. అందుకని పదేళ్లుగా తాగుతున్నాడు.
భర్త: ఎంత మంచి కారణం అయితే మాత్రం పదేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకోవాలా?
చీమలంటే భయం
సురేఖ: ఎందుకు మీ ఆయన చీమల్ని చూస్తే చాలు హడలిపోతున్నాడు
భార్గవి: నిన్నే షుగర్ టెస్ట్ చేయిస్తే షుగర్ ఉందని తెలిసిందట.
ఆ చోటు కూడా లేదు
అప్పు: అంత ఆపసోపాలు పడుతున్నావేంటి!
పప్పు: ఏం లేదబ్బా, ఇపుడే పెళ్లి భోజనం ఫుల్లుగా తిన్నాను. అరక్క!
అప్పు: ఓ టాబ్లెట్ వేసుకోలేకపోయావా?
పప్పు: ఆ మాత్రం చోటుంటే ఇంకో స్వీటు తినేవాడిని కదా!
ఓర్నీ!
మొదటి హీరోయిన్: నిన్న షూటింగ్ ముగిసేసరికి ఆలస్యమైంది. రాత్రిపూట నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కొందరు తాగుబోతులు కారుకు అడ్డంపడ్డారు. ఆగి హారన్ కొడితే పక్కకు పోకుండా నన్ను కార్లోంచి కిందకు లాగి మీద పడబోయారు. వెంటనే తెలివిగా ఆలోచించి తప్పించుకున్నాను... అని పక్కనున్న హీరోయిన్‌కు ఓ హీరోయిన్ చెబుతోంది.
రెండో హీరోయిన్: మరి ఏం చేశావు?
మొదటి హీరోయిన్: మేకప్ మొత్తం చెరిపేసుకున్నా.
భలే భార్యలు
జీవన్: మా ఆవిడ ఏ విషయాన్నయినా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతుంది
నవీన్: మా ఆవిడయితే ఫ్రిజ్, టీవీ, కూలర్ అన్నీ పగలగొట్టి మరీ చెబుతుంది.
జోక్స్: పార్కులో షాక్
Published Sun, Apr 6 2014 1:50 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
Advertisement
Advertisement