ఇజ్రాయెల్ -హమాస్ ఒప్పందం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న నలుగురు పౌరులను ఇజ్రాయెల్ సైన్యం సురక్షితంగా కాపాడింది. నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి..వారిని రక్షించినట్లు తెలిపింది.
గత ఏడాది అక్టోబరులో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్‌లో కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మంది విడుదలయ్యారు. ఇంకా 130 మందికిపైగా బందీలుగా ఉన్నారని తెలుస్తోంది.
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నోవా అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను రక్షించింది.
గతేడాది అక్టోబరు 7న హమాస్ దాడి కారణంగా గాజాలో ఎనిమిది నెలల పాటు జరిగిన విధ్వంసకర యుద్ధం తర్వాత, హమాస్ ఉగ్రవాదులు అపహరించిన దాదాపు 250 మంది బందీలలో 116 మంది పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో మిగిలిపోయారు. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం వీరిలో కనీసం 40 మంది మరణించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment