గడిచిన ఏడాదిలో మొత్తం 39 మంది భారతీయులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బంధీ చేశారంట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో మొత్తం 39 మంది భారతీయులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బంధీ చేశారంట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, తాము చర్చలు జరిపి వారిని సురక్షితంగా విడిపించినట్లు కూడా వివరణ ఇచ్చింది.
బుధవారం లోక్సభలో ఈ విషయంపై ఓ ప్రశ్న తలెత్తగా జోక్యం చేసుకున్న విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ వివరణ ఇచ్చారు. గత ఏడాదిలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఇరాక్లోని మోసుల్ నుంచి మొత్తం 39మందిని నిర్బంధించారని, అయితే, తాము నిత్యం ఇరాక్ ప్రభుత్వంతో చర్చల్లో ఉంటూ వారిని విముక్తి చేసినట్లు వివరించారు.