
పేలుడు పదార్థాలతో వ్యక్తి హల్ చల్
పెర్త్: ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి కలకలం సృష్టిస్తున్నాడు. భారీ పేలుడు పదార్థాలు తన ఒంటికి చుట్టుకొని హల్ చల్ చేస్తూ చుట్టుపక్కలవారిని హడలెత్తిస్తున్నాడు. పోలీసుల సమాచారం మేరకు ఆస్ట్రేలియాకు నైరుతి వైపున్న బన్బర్రి పార్క్లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బాంబులు చుట్టుకొని వచ్చిన ఆ వ్యక్తి అక్కడే ఒకరిని బందీగా పట్టుకొని పేల్చేవేసుకుంటానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. అయితే, అతడి డిమాండ్ ఏమిటనే విషయం కూడా చెప్పడం లేదని సమాచారం. ఘటన తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి చర్యలు ప్రారంభించారు.