టెల్‌అవీవ్: ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువకుడు ఎడాన్ అలెగ్జాండర్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా,ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం.
Well, atleast he looks healthy an clean. Idan Alexander, held hostage because of Netanyahu #Israel pic.twitter.com/J42O2yGsRg
— Steven Markussen (@DALAX) November 30, 2024
ఈ వీడియోపై ఎడాన్ తల్లి యేల్ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది.
గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment