హమాస్‌ చీఫ్‌ బంకర్‌ చూస్తే షాక్‌ అవాల్సిందే.. భారీగా డబ్బు.. | Yahya Sinwar bunker Cash personal shower UN ration supplies in Gaza | Sakshi
Sakshi News home page

హమాస్‌ చీఫ్‌ బంకర్‌ చూస్తే షాక్‌ అవాల్సిందే.. భారీగా డబ్బు.. వీడియో విడుదల

Published Mon, Oct 21 2024 11:23 AM | Last Updated on Mon, Oct 21 2024 11:52 AM

Yahya Sinwar bunker Cash personal shower UN ration supplies in Gaza

హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్‌ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్‌ ఉన్న ఈ బంకర్‌లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్‌ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్‌ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.

ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి  సిన్వార్ సూత్రధారి.  ఆయన  రఫాకు పారిపోయే ముందు ఈ  బంకర్‌లోనే కొన్నిరోజులు గడిపినట్లు  తెలుసో​ంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను  అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో  సిన్వార్‌ మృతి చెందారు.

 

‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు.  మానవతా సహాయం, ఆయుధాలు,  మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.

 

ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్‌ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్‌ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.

చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్‌ ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement