పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో కిడ్నాప్నకు గురైన లచ్చిరాజు శవాన్ని బుధవారం కామవరం కాలువ వద్ద స్థానికులు గుర్తించారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
లచ్చిరాజు శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే లచ్చిరాజును కొంత మంది దుండగులు కిడ్నాప్ చేశారు. లచ్చిరాజును విడుదల చేయాలంటే అధిక మొత్తంలో నగదు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.