
'వారంతా ప్రాణాలతో ఉన్నారు'
న్యూఢిల్లీ: ఇరాక్ లో ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఏడాదిగా బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బందీల కుటుంబ సభ్యులను శుక్రవారం ఆమె కలిశారు. మొసోల్ లో గతేడాది జూన్ లో 39 భారతీయులను ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు.
తమకున్న సమాచారం ప్రకారం వీరంతా క్షేమంగా ఉన్నారని బందీల కుటుంబీకులతో సుష్మా స్వరాజ్ చెప్పారు. బందీలను సురక్షితంగా విడిపించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూనే ఉందని తెలిపారు. బందీల కుటుంబాలను సుష్మా కలుసుకోవడం ఇది ఎనిమిదోసారి.