న్యూఢిల్లీ/చండీగఢ్: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలను వారం రోజుల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. సోమవారం తనను ఢిల్లీలో కలిసిన బాధిత కుటుంబసభ్యులకు సుష్మ ఈ విషయాన్ని తెలిపారు. ఇందుకోసం విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఇరాక్ వెళ్లి మొత్తం లాంఛనాలను పూర్తి చేస్తారని తెలిపారు.
ఇరాక్‌కు ఉద్యోగాలకు వెళ్లినవారే తమ కుటుంబ పోషణకు ఆధారమని కుటుంబసభ్యులు సుష్మకు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన భరోసాను.. మృతదేహాలను వెనక్కు రప్పించేందుకు చేస్తున్న యత్నా లను వారు అభినందించారు. ‘ప్రభుత్వం అన్ని రకాల హామీలను ఇచ్చింది. కుటుంబంలో ఒక రికి ప్రభుత్వోద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తా మని సుష్మాజీ చెప్పారు. ఇందుకోసం బాధితులకు చెందిన నాలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతానన్నారు. మృతదేహాలను వారంలోగా భారత్ తెస్తామన్నారు’ అని మృతుడు గోవింద్ సింగ్ సోదరుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment