ఇంటి బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న డీఈ, ఏఈలను స్థానికులు నిర్బంధించారు.
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఇంటి బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న డీఈ, ఏఈలను స్థానికులు నిర్బంధించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది.
డీఈ శివశంకర్ నాయక్, ఏఈ రంగనాయక్‌లు బిల్లులు ఇవ్వకుండా ప్రజలను తిప్పించుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎమ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులు హౌసింగ్ కార్యాలయానికి చేరుకొని డీఈని, ఏఈని నిర్బంధించారు.