![బాధితురాలే.. నిందితురాలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81456429405_625x300.jpg.webp?itok=UZ6ZFQQ6)
బాధితురాలే.. నిందితురాలు
♦ చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు
♦ అసలు గొలుసు బ్యాంకులో..
♦ చోరీకి గురైనట్లు నాటకం స్నేహితుడితో కలసి కుట్ర
♦ పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిన వైనం
♦ కేసు ఛేదించిన పోలీసులను అభినందించిన డీఎస్పీ
స్నేహితుడితో కలిసి మెడలోని పుస్తెలతాడును తాకట్టు పెట్టేసింది. పైగా గొలుసు ఎవరో తెంచుకుపోయినట్టు సీన్ క్రియేట్ చేసి.. భర్త, అత్తమామలను బురిడీ కొట్టించింది. ‘సెల్’ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపడంతో మొత్తం గుట్టు రట్టయింది.
బాధితురాలే.. నిందితురాలు
చిన్నశంకరంపేట: ఐదు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీస్‌లు చాకచక్యంగా చేధించిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులకు తెలియకుండా బంగారు గొలుసును బ్యాంకు లో తాకట్టు పెట్టిన మహిళ రోల్డ్‌గోల్డ్ గొలుసు ధరించింది. తన స్నేహితుడే లాక్కుపోయేలా పథకం వేసి పోలీస్‌లకు అడ్డం దొరికిపోయిం ది. బాధితురాలే నిందితురాలుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలిం చారు. గురువారం చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్‌లో తూప్రాన్ డీఎస్‌పీ వెంకటేశ్వర్లు విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేట మండలం చందాపూర్‌లో కాపురం ఉంటు న్న వినోద భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చైన్‌స్నాచింగ్ నాటకానికి తెరతీసింది.
పదిహేను రోజుల క్రితం తన పుట్టిన ఊరైన చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి వెళ్లి న వినోద, అక్కడ తన స్నేహితుడు అరిగే రాజు తో కలిసి బంగారు పుస్తేల తాడును బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 వేల రుణం పొందింది. ఈ విషయం దాచిపెట్టి రోల్డ్‌గోల్డ్ పుస్టేల తాడు ను మెడలో వేసుకుని అత్తగారింటికి వచ్చింది. కానీ వాస్తవం బయట పడకుండా ఉండడానికి గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్లిన్లు నాటకం ఆడేందుకు పక్కాప్లాన్ వేసుకుని అమలు చేసింది. నాటకంలో భాగంగా ఈ నెల 21న మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన తలారి వినోద భర్త స్వామితో కలిసి పొలం నుంచి వస్తుండగా, బైక్‌పై వచ్చిన దుండగుడు రెండు తూలాల గొలుసును మెడలోంచి లాక్కు పోయాడు. భర్త ఎదుటే దుండగుడు గొలుసు లాక్కుపోవడంతో అందరూ ఇది నిజమేనని నమ్మి పోలీసులకు సమచారం అందించారు.
కేసు నమోదు చేసిన చిన్నశంకరంపేట ఎస్‌ఐ నగేష్, సీఐ నందీశ్వర్‌రెడ్డి ద ర్యాప్తు నిర్వహించారు. దుండగుడు గొలుసును లాక్కుపోయినట్లు చెప్పిన బాధితురాలు మెడై పె ఎలాంటి గాట్లు లేకపోగా, పుస్తెల తాడును కత్తిరించుకు పోయినట్లు ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు బాధితురాలి సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తును చేసి కేసును ఛేదించారు. గురువారం చేగుంట మం డలం కరీంనగర్‌కు చెందిన రాజును అదుపులోకి తీసుకుని బంగారు గొలుసును బ్యాంకు నుంచి తెప్పించారు. అసలు బంగారు గొలు సు, రోల్డ్‌గోల్డ్ గొలుసును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. చైన్ స్నాచింగ్ కేసుల పెరిగిపోతున్న తరుణంలో చందాపూర్ కేసును ఐదు రోజుల్లో చేధించిన చిన్నశంకరంపేట ఎస్‌ఐ నగేష్, పోలీస్ కానిస్టేబుళ్లు గౌస్, నర్సింలు, రమేష్‌ను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.