పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయిదు రోజులుగా కొనసాగుతోంది. గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడి మెరుపు దాడి ప్రారంభించిన హమాస్ వెనువెంటనే 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్దం ప్రకటించి వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది హమాస్ ఆక్రమించిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ మెల్లమెల్లగా గాజాపై పైచేయి సాధిస్తోంది.
గాజాలో ఉగ్రవాదుల ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం కదంతొక్కుతుంది. ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు. ఈ మారణహోమంలో పాలస్థీనా కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న భీకర పోరులో పలు కంటతడి పెట్టించే వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, దాడులు చేయడం, రాకెట్ల ప్రయోగం వంటి వీడియో ఇప్పటికై వైరల్‌గామారిన విషయం తెలిసిందే.
తాజాగా మరో హృదయ విదాకర వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లోకి చోరబడి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా పట్టుకున్న హమాస్ సైన్యం వారితో అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకొని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మహాస్ ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోలో.. ఓ వ్యక్తి, అతని పక్కన భార్య, ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉన్నారు. వీరితోపాటు పక్కన మరికొంతమంది చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తూ నోరు పట్టుకొని ఉండటం కనిపిస్తోంది.
చదవండి: భారత్-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!
వ్యక్తి కాలు వెంట రాక్తం కారుతున్నప్పటికీ.. ఓ ముష్కరుడు ఆ కుటుంబాన్ని మాట్లాడమంటూ ఆదేశించాడు. ‘మీ దేశంతో మాట్లాడండి. మేము ఇక్కడ ఉన్నామని వారికి చెప్పండి’ అంటూ హమాస్ ఉగ్రవాది వారితో అనడం వినిపిస్తోంది. అతను గాజాకు దగ్గరగా ఉన్న నహాల్ ఓజ్ కిబ్బత్జ్‌లో ఉన్న ఇంట్లోకి ప్రవేశపెట్టినట్లు హమాస్ మిలిటెంట్ చెప్పాడు. ఆ వ్యక్తి కాలిలోకి బుల్లెట్లు దించినట్లు కెమెరాను చూస్తూ చెప్పాడు. దంపతుల కుమారిడిపై తుపాకీ గురిపెట్టి.. పక్కన ఉన్న వ్యక్తులను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బెదిరించాడు. దీనికి సంబంధఙంచిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇక ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి మారణహోమం సృష్టించిన హమాజ్ మిలిటెంట్ సంస్థ.. చిన్నారులు, మహిళలు సహా 150 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా గాజా స్ట్రిప్‌లోని పౌరుల నివాసాలపై ఇజ్రాయెల్ బాంబును వేసిన ప్రతిసారీ ఒక బందీని చంపేస్తానని బెదిరించింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ముట్టడించాలని ఆదేశించి.. ఆ ప్రాంతానికి విద్యుత్, ఆహారం, ఇంధనం, నీటిని నిలిపివేసిన తరువాత హమాస్ నుంచి ఈ హెచ్చరికలు చేసింది.
Hamas broke into a Kibbutz and killed over 100 innocent people...
— The Wee Doggie (@The_Wee_Doggie) October 11, 2023
They even decapitated children....
But the first thing Sinn Fein supporters and Gerry Carroll do, is wave their Palestinian flegs...
When people show you their morals the first time, remember to believe them... pic.twitter.com/KCF3r2coLJ
ఈ బెదిరింపుల కారణంగా గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగేందుకు ఇజ్రాయెల్ సైన్యం వెనకాడుతోంది. అయితే బందీల అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా హమాస్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్వదేశంలోనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బందీలను చంపే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై తన భారీ సైనిక దాడిని సడలించే సంకేతాలను చూపించడం లేదు. దీనికితోడు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ను ఐసీస్‌తో పోల్చుతూ.. గాజా ఉగ్రవాదులు పిల్లలను బంధించి, కాల్చివేసి, ఉరితీశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment