పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు మాటలకు ఆయన చేసే పనులకు పొంతన ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనని, సెల్‌ఫోన్ తీసుకొచ్చింది కూడా తానే అంటూ పదే పదే గప్పాలు కొట్టుకుంటున్న బాబు.. ఏపీలో అభివృద్ధి అనే అంశాన్ని తీసుకుని ప్రతిసారీ అవే మాయావి మాటలు వల్లెవేశారు. ముఖ్యంగా అమరావతి విషయంలో చేవ లేని కబుర్లు చెప్పి తనదైన శైలినే ప్రదర్శించారు బాబు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. రాజధానిని అలా కడతాను, ఇలా తీర్చిదిద్దుతాను, ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తానంటూ అంటూ తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. సింగపూర్, జపాన్, లండన్, దావోస్ ఇలా ఒక్కటేంటి.. వెళ్లిన ప్రతి చోటా అక్కడి ప్రాంతంలాగా ఏపీని మార్చుతానని సొల్లు కబుర్లు చెబుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. ప్రజాధనంతో ఫారిన్ టూర్లు చేసి.. ప్రజలను ఏమార్చడానికి కల్లబొల్లి ప్రకటనలు చేశారు. తీరా చూస్తే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏమీ చేయలేని అసమర్థతను, అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్నీ కట్టలేని తన చేతకానితనాన్ని నిరూపితం చేసుకున్నారు.
చంద్రబాబు నోటి నుంచి రాలే అణిముత్యాలు కేవలం ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసే ఎత్తుగడ మాత్రమేనని.. ఆయన ఏం చెప్పినా.. వాటి వెనుక స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయనడానికి కింద తెలిపిన వివరాలే నిదర్శనం..
Nov 3 ,2014 : 3 రోజుల సింగపూర్ పర్యటన...జిల్లాకో ఎయిర్‌పనోర్టు తీసుకోస్తాం అని ప్రకటన.
Nov 24,2014 : 6 రోజుల జపాన్ పర్యటన....ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలలో జపనీస్ భాషని ప్రవేశపెడతాం అని ప్రకటన.
జనవరి 20,2015: 4 రోజుల దావోస్ పర్యటన...స్పెయిన్ బులెట్ ట్రైన్ మీద స్టడీ చేసి అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో తీసుకోస్తాం అని ప్రకటన.
ఏప్రిల్ 15,2015 : 6 రోజుల చైనా పర్యటన...షాంఘై లాగా అమరావతిని నిర్మిస్తాం.
జులై 5,2015 : 3 రోజుల జపాన్ పర్యటన...టోక్యో లాగా అమరావతిని నిర్మిస్తాం.
ఆగస్ట్ 3,2015 : 6 రోజుల టర్కీ పర్యటన...ఇస్తాంబుల్ లాగా అమరావతిని కడతాం.
సెప్టెంబర్ 20,2015: 3 రోజుల సింగపూర్ పర్యటన....అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం...తుళ్లూరుని సింగపూర్‌గా చేస్తాం.
జనవరి 16,2016: 4 రోజుల దావోస్ పర్యటన....అమరావతికి పెట్టుబడుల వరద రాబోతుంది.
మార్చ్ 11,2016 : 3 రోజుల లండన్ పర్యటన...అమరావతిలో లండన్ ఐ ని నిర్మిస్తాం.
మే 8,2016 : 6 రోజుల థాయిలాండ్, స్విట్జర్లాండ్ టూర్.....ఫామిలీ టూర్ అని చెప్పాడు... బహుశా స్విస్ బ్యాంకులో ఏదో పని ఉండి ఉండొచ్చు...అది divert చేయడానికి థాయిలాండ్ మీదుగా ఫ్యామిలితో స్విట్జర్లాండ్ వెళ్ళాడు.
జూన్ 27,2016 : 6 రోజుల చైనా టూర్...ఆంధ్రప్రదేశ్‌లో బులెట్ ట్రైన్ తీసుకొస్తా.
జులై 9,2016 : 2 రోజుల కజాకిస్తాన్ టూర్...కేబుల్ కార్లని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తా.
జులై 16,2017 : 3 రోజుల రష్యా టూర్...ఆంధ్రప్రదేశ్ లో మెరైన్ యూనివర్సిటీ స్టాపిస్తామని ప్రకటన.
జనవరి 8,2017 : 2 రోజుల శ్రీలంక టూర్ ...అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అని ప్రకటన.
జనవరి 16,2017: 3 రోజుల దావోస్ టూర్....మాస్టర్ కారిడార్ వైజాగ్‌కు తీసుకొస్తామని ప్రకటన.
మే 4,2017 : 8 రోజుల అమెరికా టూర్... వైజాగ్‌కు ఫ్రాంక్లిన్ టెంపులెటన్ తీసుకొస్తా అని ప్రకటన.
అక్టోబర్ 19,2017: 8 రోజుల చికాగో, దుబాయ్, లండన్‌ల పర్యటన...ఆంధ్రప్రదేశ్ లో ఏరో సిటీ కడతాం,దుబాయ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు కనెక్టివిటీ ,లండన్ తరహా ట్రాన్స్‌పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోస్తాం అని ప్రకటన.
డిసెంబర్ 4 ,2017 : 4 రోజుల సౌత్ కొరియా టూర్,అమరావతిని సౌత్ కొరియా రెండో రాజధానిగా చేస్తాం అని ప్రకటన.
ఇవీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనంతో చేసిన ఫారిన్ టూర్లు, ప్రజలని ఏమార్చడానికి 2014 నుంచి 2017 చేసిన ప్రకటనలు.... 2018,19 ఫారిన్ టూర్స్ గురించి మాత్రం చెప్పట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment