Fake statements
-
Chandrababu Naidu: ఆ నాలుక ఎలాగైనా మడత పడుద్దీ.!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు మాటలకు ఆయన చేసే పనులకు పొంతన ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనని, సెల్‌ఫోన్ తీసుకొచ్చింది కూడా తానే అంటూ పదే పదే గప్పాలు కొట్టుకుంటున్న బాబు.. ఏపీలో అభివృద్ధి అనే అంశాన్ని తీసుకుని ప్రతిసారీ అవే మాయావి మాటలు వల్లెవేశారు. ముఖ్యంగా అమరావతి విషయంలో చేవ లేని కబుర్లు చెప్పి తనదైన శైలినే ప్రదర్శించారు బాబు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. రాజధానిని అలా కడతాను, ఇలా తీర్చిదిద్దుతాను, ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తానంటూ అంటూ తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. సింగపూర్, జపాన్, లండన్, దావోస్ ఇలా ఒక్కటేంటి.. వెళ్లిన ప్రతి చోటా అక్కడి ప్రాంతంలాగా ఏపీని మార్చుతానని సొల్లు కబుర్లు చెబుతూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. ప్రజాధనంతో ఫారిన్ టూర్లు చేసి.. ప్రజలను ఏమార్చడానికి కల్లబొల్లి ప్రకటనలు చేశారు. తీరా చూస్తే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏమీ చేయలేని అసమర్థతను, అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్నీ కట్టలేని తన చేతకానితనాన్ని నిరూపితం చేసుకున్నారు. చంద్రబాబు నోటి నుంచి రాలే అణిముత్యాలు కేవలం ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసే ఎత్తుగడ మాత్రమేనని.. ఆయన ఏం చెప్పినా.. వాటి వెనుక స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయనడానికి కింద తెలిపిన వివరాలే నిదర్శనం.. Nov 3 ,2014 : 3 రోజుల సింగపూర్ పర్యటన...జిల్లాకో ఎయిర్‌పనోర్టు తీసుకోస్తాం అని ప్రకటన. Nov 24,2014 : 6 రోజుల జపాన్ పర్యటన....ఆంధ్రప్రదేశ్ లోని అన్ని యూనివర్సిటీలలో జపనీస్ భాషని ప్రవేశపెడతాం అని ప్రకటన. జనవరి 20,2015: 4 రోజుల దావోస్ పర్యటన...స్పెయిన్ బులెట్ ట్రైన్ మీద స్టడీ చేసి అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లో తీసుకోస్తాం అని ప్రకటన. ఏప్రిల్ 15,2015 : 6 రోజుల చైనా పర్యటన...షాంఘై లాగా అమరావతిని నిర్మిస్తాం. జులై 5,2015 : 3 రోజుల జపాన్ పర్యటన...టోక్యో లాగా అమరావతిని నిర్మిస్తాం. ఆగస్ట్ 3,2015 : 6 రోజుల టర్కీ పర్యటన...ఇస్తాంబుల్ లాగా అమరావతిని కడతాం. సెప్టెంబర్ 20,2015: 3 రోజుల సింగపూర్ పర్యటన....అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం...తుళ్లూరుని సింగపూర్‌గా చేస్తాం. జనవరి 16,2016: 4 రోజుల దావోస్ పర్యటన....అమరావతికి పెట్టుబడుల వరద రాబోతుంది. మార్చ్ 11,2016 : 3 రోజుల లండన్ పర్యటన...అమరావతిలో లండన్ ఐ ని నిర్మిస్తాం. మే 8,2016 : 6 రోజుల థాయిలాండ్, స్విట్జర్లాండ్ టూర్.....ఫామిలీ టూర్ అని చెప్పాడు... బహుశా స్విస్ బ్యాంకులో ఏదో పని ఉండి ఉండొచ్చు...అది divert చేయడానికి థాయిలాండ్ మీదుగా ఫ్యామిలితో స్విట్జర్లాండ్ వెళ్ళాడు. జూన్ 27,2016 : 6 రోజుల చైనా టూర్...ఆంధ్రప్రదేశ్‌లో బులెట్ ట్రైన్ తీసుకొస్తా. జులై 9,2016 : 2 రోజుల కజాకిస్తాన్ టూర్...కేబుల్ కార్లని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తా. జులై 16,2017 : 3 రోజుల రష్యా టూర్...ఆంధ్రప్రదేశ్ లో మెరైన్ యూనివర్సిటీ స్టాపిస్తామని ప్రకటన. జనవరి 8,2017 : 2 రోజుల శ్రీలంక టూర్ ...అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అని ప్రకటన. జనవరి 16,2017: 3 రోజుల దావోస్ టూర్....మాస్టర్ కారిడార్ వైజాగ్‌కు తీసుకొస్తామని ప్రకటన. మే 4,2017 : 8 రోజుల అమెరికా టూర్... వైజాగ్‌కు ఫ్రాంక్లిన్ టెంపులెటన్ తీసుకొస్తా అని ప్రకటన. అక్టోబర్ 19,2017: 8 రోజుల చికాగో, దుబాయ్, లండన్ల పర్యటన...ఆంధ్రప్రదేశ్ లో ఏరో సిటీ కడతాం,దుబాయ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు కనెక్టివిటీ ,లండన్ తరహా ట్రాన్స్‌పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోస్తాం అని ప్రకటన. డిసెంబర్ 4 ,2017 : 4 రోజుల సౌత్ కొరియా టూర్,అమరావతిని సౌత్ కొరియా రెండో రాజధానిగా చేస్తాం అని ప్రకటన. ఇవీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనంతో చేసిన ఫారిన్ టూర్లు, ప్రజలని ఏమార్చడానికి 2014 నుంచి 2017 చేసిన ప్రకటనలు.... 2018,19 ఫారిన్ టూర్స్ గురించి మాత్రం చెప్పట్లేదు. -
ఒకే కాన్పులో పది మంది: అసలు బిడ్డలెక్కడ?
దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పుట్టిన బిడ్డలతో సహా ఆ తల్లి ఫొటోలను ఇంతవరకు బయటకు రిలీజ్ చేయకపోగా, ఆ తల్లీబిడ్డల ఆచూకీని ఇప్పటికీ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ వ్యహారంలో ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ పెయిట్ ర్యామ్‌పెడి అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిటోరియా: టెంబిసా పట్టణంలో గోసియామె తమార సిత్హోల్ అనే 37 ఏళ్ల మహిళ.. నెలలు నిండకముందే పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది ప్రిటోరియా న్యూస్ కథనం. ఈ రికార్డు జననాల కథనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా హౌజ్‌లన్నీ ఆ కథనాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని టెంబిసా అధికారులుగానీ, ఏ ఆస్పత్రి వర్గాలుగానీ ప్రకటించలేదు. ఇక వారం గడుస్తున్నా ఆ తల్లీబిడ్డలు మీడియా ముందుకు రాకపోవడంతో ఇది అసలు ఉత్త కథే అని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీనికితోడు ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించిన స్టేట్మెంట్ ప్రకారం చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్టీవ్ బికో అకాడమిక్ హస్పిటల్లో తాను పది మందికి జన్మనిచ్చానని సిత్హోల్, ‘క్లెమెంట్ మన్యాతెల షో’లో ఆమె స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ హాస్పిటల్ సీఈవో మథాబో మాథ్యుబెలా స్పందించారు. అసలు అలాంటి డెలివరీ కేసు తమ హాస్పిటల్ రికార్డుల్లో నమోదుకాలేదని ఆయన తేల్చేశారు. స్టీవ్ బికో ఆస్పత్రిపాటుతో పాటు ఇలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసును డీల్ చేసే లూయిస్ పాస్టూర్, మెడిక్లినిక్ మెడ్‌ఫోరం హాస్పిటల్స్ కూడా అలాంటి డెలివరీ తమ దగ్గర రికార్డు కాలేదని వెల్లడించాయి. దీంతో ఈ వ్యవహారంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ బిడ్డల తండ్రి టెబెహో సోటెట్సి తాజా స్టేట్మెంట్తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎక్కడున్నారో తెలియదు తాను చాలా పేదరికంలో ఉన్నానని, బిడ్డలకు సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని గోసియామె సిత్హోల్ ప్రజలను కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు దక్షిణాప్రికా దేశవ్యాప్తంగా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో విరాళాల్ని ఇవ్వొద్దంటూ ఇప్పుడు స్వయంగా టెబెహో కోరుతున్నాడు. అసలు పిల్లలెక్కడ ఉన్నారో? నాక్కుడా తెలియదు. వాళ్లు ఇంటికి వచ్చేదాకా ఎవరూవిరాళాలు ఇవ్వకండి అంటూ ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా ప్రిటోరియా న్యూస్‌కి సమాచారం అందించింది టెబెహోనే కావడం విశేషం. మరోవైపు సోటెట్సి కుటుంబ సభ్యులు గోసియామో సిత్‌హోల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2018లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిందని ఆమె ప్రకటించుకుందని, ఆ బిడ్డలు మాత్రం జాడలేరని వాళ్లు మీడియాకు తెలిపారు. నన్ను బద్నాం చేయొద్దు కాగా, పది మంది పిల్లల వ్యవహారంలో దక్షిణాఫ్రికా మీడియా నైతికతపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పేద మహిళ జీవితంలోకి తొంగిచూసి.. అనుమానాలు, ఆరోపణలు చేయడం సరికాదని మీడియాను హెచ్చరించారు కొందరు. అయితే ఆ కొందరే ఇప్పుడు అనుమానాల నేపథ్యంలో ఫేక్ కథనాలతో ప్రజల్ని తప్పుబట్టారంటూ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఇక మంగళవారం ప్రిటోరియా న్యూస్ రూంలో ప్రత్యక్షమైన గోసియామో సిత్హోల్.. తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని, టెబెహో ఫ్యామిలీకి తన మీద మొదటి నుంచి ప్రేమ లేదని, అందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బిడ్డల ఐడెంటిటీని పబ్లిక్‌గా ఎప్పుడు చూపిస్తారనే ప్రశ్నకు ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో అనుమానాలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. #Tembisa10 Two babies: twins Three babies: triplets Four babies: quadruplets Ten babies: missing pic.twitter.com/cEYbrtX81L — Birthmark Pearson ⛴ (@Kai_WithNoX) June 15, 2021 Piet, trying to sort out the Tembisa 10 equation in front of during South Africans. 🙆🏽♂️ 😂😂😂#Tembisa10 pic.twitter.com/wTaZxANKmM — MOSS™🇿🇦🏳️🌈 (@_officialMoss) June 15, 2021 -
అరుణవి అవాస్తవాలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇలాఖాలో ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందంటూ అవివేకంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డి.కె.అరుణ చెబుతున్న భూమిని కబ్జా చేసింది నాటి కాంగ్రెస్ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం బంధు ప్రీతి లేదని, తప్పు చేస్తే సొంత పిల్లలను కూడా వదిలిపెట్టనని ప్రకటించారని గుర్తు చేశారు. డీకే అరుణ బంధువులు ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఉన్నారు కాబట్టి ఆమెకు తెలంగాణ వరసల గురించి తెలియదని ఎద్దేవా చేశారు. ఆమెకు ఏమాత్రం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్‌ను బదానం చేయాలని చూసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని కర్నె హెచ్చరించారు. -
మా బాబే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉభయగోదావరి జిల్లాల రైతాంగం ప్రాణాలను పణంగా పెట్టి వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకువెళుతున్న సర్కారు ఇప్పుడు నిండు శాసనసభలోనూ పచ్చి అబద్ధపు ప్రకటనలతో సమర్థించుకుంటోంది. మంగళవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన చర్చతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వరదల కాలంలోనే గోదావరి మిగులు జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తామని ప్రకటిస్తూ.. గోదావరి ఏడాదిలో నాలుగున్నర నెలలు పొంగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఉభయగోదావరి జిల్లాల రైతాంగం భగ్గుమంటోంది. శానససభ సాక్షిగా చంద్రబాబు పచ్చి దగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతోంది. వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం రెండు నెలలు కాగా గత కొన్నేళ్లుగా 45 రోజులుకు కూడా వరద నీరుభారీగా వస్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ భారీగా వచ్చినా నిల్వ చేసే వనరులూ లేవు. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని రెండో పంటకు ఏటా సీలేరు రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. డెల్టా పంటలకు 12వేల 500 క్యూసెక్కుల నీరు అవసరం కాగా, ఆ సమయంలో గోదావరి నదిలో కేవలం 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే నీరు మళ్లిస్తామని సర్కారు చెబుతోంది. సీజన్ మార్పు కారణంగా జూన్, జూలై నెలల్లో గోదావరిలో వరదనీరే ఉండటం లేదు. గత ఏడాది జూన్, జూలై నెలల్లో కూడా గోదావరిలో 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వఉంది. ఇప్పటికే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మెట్ట ప్రాంతాల్లోని పంటలకు మళ్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా ప్రాంతం ఎడారిగా మారిపోతుందంటూ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే రైతన్నల మొరను ఏ మాత్రం పట్టించుకోని సర్కారు చివరికి అసెంబ్లీ సాక్షిగా కూడా మోసపూరిత ప్రకటనలు చేస్తోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. గోదావరి నాలుగున్నర నెలల పాటు పొంగిన చరిత్ర ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవే మాటలు ఇక్కడికొచ్చి మాట్లాడితే సరైన సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్ బాసటతో రైతన్నల హర్షం గోదావరి జిల్లాల రైతులకు ప్రభుత్వం ఏమాత్రం భరోసా ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు నీటిని మళ్లిస్తున్న చర్యలతో రైతులలో తీవ్ర ఆందోళన నెలకొందంటూ వైఎస్ జగన్ సభలో ప్రకటించారు. పట్టిసీమ రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద కాలం 60 రోజులు కాగా.. నాలుగున్నర నెలలు ఎప్పుడుందంటూ సర్కారును నిలదీశారు. పట్టిసీమను హడావుడిగా చేపడుతున్న ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని పక్కన పెడుతోందన్న రైతుల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన పోరాటం ఇక్కడి రైతాంగానికి స్థైర్యాన్నిచ్చింది. చంద్రబాబు నయవంచన తీరును ఎండగట్టి డెల్టా రైతన్నలకు జగన్ బాసటగా నిలిచారంటూ ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం.. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నమోదైన గోదావరి వరద వివరాలిలా గోదావరి ఫ్లడ్ సీజన్ జూలై నుంచి అక్టోబర్ అత్యధిక వరద కాలం జూలై నుంచి ఆగస్టు నెల వరకు మాత్రమే. ఇప్పటి వరకు జూలై, ఆగస్టు నెలల్లోనే అధిక నీటి మట్టాలు, అత్యధిక వరద నమోదయ్యాయి. అప్పుడప్పుడు మాత్రమే సెప్టెంబర్‌లో నమోదవుతుంది. గడిచిన 155 సంవత్సరాల నుంచి గోదావరి వరద రికార్డులను పరిశీలిస్తే 20 నుంచి 25 సార్లు మాత్రమే అత్యధిక (ప్రమాద స్థాయికి) వరద చేరింది. 1861 నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగుసార్లు అక్టోబర్ నెలలో అత్యధిక స్థాయి వరద నమోదు కాగా, ఇందులో రెండుసార్లు వరద ప్రమాద స్థాయికి చేరింది. 1861 నుంచి గోదావరి వరదలను పరిశీలిస్తే 30.10.1891లో రెండోప్రమాద హెచ్చరిక దాటి 17అడుగులకు చేరింది. (17.75 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు) 1.10.1948లో 8.20 అడుగుల అత్యధిక వరద నమోదైంది. 17.10.1987లో 9.75 అడుగుల స్థాయికి చే రింది. 23.10.1995లో ఒక సారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 17 అడుగులకు (మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపానికి) నమోదైంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.75 అడుగులకు చేరితే మొదటి హెచ్చరిక, 13.75 అడుగులకు చేరితే రెండో హెచ్చరిక, 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 60 రోజులకు మించి వరద ఉండదు గోదావరి నదిలో 60 నుంచి 70 రోజుల వరకు మించి వరద ఉండదు. అది కూడా అన్ని జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాలుగు నెలలు గోదావరికి వరద వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దీని అర్థమేమిటంటే ఆ నాలుగు నెలల పేరుతో కృష్ణా డెల్టాకు నీరు తోడే కుట్ర జరుగుతుంది. పట్టిసీమ వద్ద కడుతున్న ఎత్తిపోతల పథకం ఎంపీడీఎల్ ఎత్తు 12.5 మీటర్ల కంటే 14 మీటర్లు ఎత్తు పెంచితే గోదావరి డెల్టాకు కొంత ఇబ్బంది తప్పవచ్చు. ఎత్తు పెంచకపోతే రబీ సమయంలో కూడా కృష్ణాడెల్టాకు గోదావరి నుంచి నీరు తరలించుకోవచ్చునన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏదిఏమైనప్పటికీ ఎత్తిపోతల పథకం ముమ్మాటికి గోదావరి జిల్లా ప్రజలకు ముప్పుగానే భావించవచ్చు. - ప్రొఫెసర్ పీఏ రామకృష్ణంరాజు, జల వనరుల నిపుణులు ఏడాదిలో రెండు నెలలు పాటే వరద గోదావరి నదికి ఏటా జూలై రెండో వారం నుంచి రెండు నెలల పాటు వరద భారీగా వచ్చి చేరుతుంది. ఏడాదిలో రెండునెలలు మాత్రమే అత్యధికంగా వరదనీరొస్తుంది. అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో గత 150 సంవత్సరాల నుంచి వరద నీర్చొచ్చినా చెప్పుకోదగినంత నమోదు కాలేదు. ఇప్పటి వరకు నమోదైన వరద నీటిమట్టాలు పరిశీస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అన్ని ఉపనదులు ఒకేసారి పొంగి ప్రవహించడం మూలంగా గోదావరికి వరదలు వస్తాయి. - విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం చంద్రబాబువన్నీ మాయమాటలే గోదావరి నదికి ఏ సమయంలో వరద వస్తుందో తెలియకుండా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు చెప్తున్నవన్నీ పక్కా మాయమాటలు. పోలవరంను విస్మరించే కుట్ర ఇదంతా. గోదావరికి రెండు నెలలు మాత్రమే వరద నీరు వస్తుంది. అదే సమయంలో కృష్ణానదిలో కూడా వరద నీరు ఉంటుంది. ఆ సమయంలో ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాడెల్టాకు తరలించే 80 టీఎంసీల నీరు ఎక్కడ స్టోరేజ్ చేస్తారు, కృష్ణా నదిలో కేవలం 3 టిఎంసీల నీరు మాత్రమే ఆ సమయంలో స్టోర్ చేయవచ్చు. ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న నాటకం. - రుద్దరాజు పండురాజు పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్