సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాలుగు కార్పొరేట్ కంపెనీలు ప్రకటించాయి. సోమవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో నాలుగు కంపెనీలు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా.. రూ.159 కోట్లతో పెట్ ఫుడ్ పరిశ్రమ ‘పెట్ ఫుడ్ ప్లాం ట్’ ఏర్పాటు చేసేందుకు మ్యాన్‌కైండ్ కన్సూ్యమర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమి టెడ్,
హైదరాబాద్ సమీపంలోని బండ తిమ్మాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా లో రూ.123 కోట్లతో చాకొలెట్స్ తయారీ, బేకరీ కంపెనీని ఏర్పాటు చేసేందుకు 3ఎఫ్, హైదరాబాద్ సమీ పంలోని కొత్తూరులో రూ.115 కోట్ల తో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూని ట్‌ను నెలకొల్పేందుకు రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌పీఎల్), తన సిస్టర్ కంపెనీ వోల్ట్‌లీ ఎనర్జీ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల కంపెనీ ఏర్పాటు చేసేందుకు యూఏఈకి చెందిన మెటా4లు ముందు కొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment